OTT Movie : ఓటీటీలోకి సరికొత్త స్టోరీలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ప్రేక్షకులను రెండు గంటలపాటు, థియేటర్లలో కూర్చోబెట్టడానికి తమవంతు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. కంటెంట్ నచ్చితే ప్రతీ సినిమాను ఆదరిస్తున్నారు . అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది. ఇందులో స్టోరీ ఒక మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ తో ఈ స్టోరీ పిచ్చెక్కిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ తమిళ మిస్టరీ-థ్రిల్లర్ మూవీ పేరు ‘జెంటిల్ ఉమెన్’ (Gentle woman). 2025 లో వచ్చిన ఈ సినిమాకి జోషువా సేతురామన్ దర్శకత్వం వహించారు. ఇందులో లిజోమోల్ జోస్ (పూర్ణి), హరి కృష్ణన్ (అరవింద్), లోస్లియా మరియనేసన్ (అన్నా) ప్రధాన పాత్రల్లో నటించారు. దీనిని హరి భాస్కరన్ నిర్మించారు. ఈ సినిమా 2025 మార్చి 7 నుంచి థియేటర్లలో విడుదలైంది. 1 గంట 53 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.8/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా, తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది
స్టోరీలోకి వెళితే
పూర్ణి (లిజోమోల్ జోస్) ఒక సాంప్రదాయ గృహిణి. LIC ఉద్యోగి అయిన తన భర్త అరవింద్ తో, మూడు నెలల తన వివాహ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉదయం కాఫీ తయారు చేయడం, భోజనం సిద్ధం చేయడం, అరవింద్‌కు బాల్కనీ నుండి వీడ్కోలు చెప్పడం వంటి రోజువారీ పనులతో మంచి ఫీలింగ్ తో ఉంటుంది. అరవింద్ కూడా పుస్తకాలు చదువుతూ, దేవునికి ప్రార్థనలు చేస్తూ ఒక ఆదర్శ భర్తగా కనిపిస్తాడు. అయితే అతను పూర్ణిని గృహిణిగా మాత్రమే చూస్తాడు. కనీసం ఆమె మొబైల్ రీఛార్జ్ కూడా చేయడు. ఆమెను ఇంటి పనులు చేసే ఒక పనిమనిషిలా చూస్తాడు. ఒక రోజు పూర్ణి దూరపు బంధువు, ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం వారి ఇంటికి వస్తుంది. ఈ సందర్భంలో అరవింద్ ఆమెతో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు.
ఆ సమయంలో అక్కడ ఒక చిన్నపాటి గొడవ జరుగుతుంది. ఈ గోడవలో అరవింద్ స్పృహతప్పి పడిపోతాడు. అదే సమయంలో అరవింద్ అక్రమ సంబంధాలు కూడా బయటపడతాయి. తను అన్నా అనే మహిళతో సంబంధం కలిగి ఉంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి అరవింద్ ఆకస్మికంగా కనిపించకుండా పోతాడు. పోలీసులు ఈ మిస్సింగ్ ను ఆర్థిక సమస్యల కారణంగా జరిగి ఉంటుందని అనుమానిస్తారు. ఇది తెలుసుకున్న అన్నా అరవింద్‌ను వెతకడానికి వస్తుంది. ఈ క్రమంలో పూర్ణి, అన్నా మధ్య ఒక సైలెంట్ వార్ నడుస్తుంది. అన్నాకి పూర్ణి మీద అనుమానం కలుగుతుంది. ఇక స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. చివరికి పూర్ణి భర్త ఏమవుతాడు ? అతని మిస్సింగ్ వెనుక ఎవరుంటారు ? అన్నా, అరవింద్ కోసం ఏం చేస్తుంది ? ఈ విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : కొత్త కోడలు అడుగు పెట్టినప్పటి నుంచి అపశకునాలే… ట్విస్టులతో అదరగొట్టే కన్నడ మిస్టరీ థ్రిల్లర్