BigTV English

OTT Movie : అమ్మాయిల్ని అంత్యంత కిరాతకంగా చంపే సైకో కిల్లర్… కిక్కిచ్చే కొరియన్ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల్ని అంత్యంత కిరాతకంగా చంపే సైకో కిల్లర్… కిక్కిచ్చే కొరియన్ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie : కొరియన్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. కుట్రలు, కుతంత్రాలతో వచ్చే తెలుగు సీరియల్స్ లా కాకుండా, సరదాగా సాగిపోయే సిరీస్ లే ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్, సిటీలో జరిగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ల చుట్టూ తిరుగుతుంది. ఈ  సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


జియో హాట్ స్టార్ (Jio hotstar)లో

ఈ కొరియన్ యాక్షన్ డ్రామా సిరీస్ పేరు ‘ది ఫస్ట్ రెస్పాండర్స్’ (The First Responders). ఇందులో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, పారామెడిక్స్ కార్యకలాపాల చుట్టూ స్టోరీ తిరుగుతుంది.  ఈ సిరీస్‌లో కిమ్ రే-వోన్ (జిన్ హో-గే), సన్ హో-జున్ (బాంగ్ డో-జిన్), గాంగ్ సీంగ్-యోన్ (సాంగ్ సీల్) ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సిరీస్ రెండు సీజన్లను కలిగి ఉంది, ప్రతి సీజన్‌లో 12 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఇది “చికాగో ఫైర్” “911” వంటి అమెరికన్ ఫస్ట్ రెస్పాండర్ షోలతో పోల్చబడుతుంది.ఇది జియో హాట్ స్టార్ (Jio hotstar)లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ సిరీస్ దక్షిణ కొరియాలోని టేవోన్ అనే ప్రాంతంలో జరుగుతుంది, ఇక్కడ పోలీస్ స్టేషన్, అగ్నిమాపక స్టేషన్ పక్కపక్కనే ఉన్నాయి. ఈ రెండు బృందాలు, పారామెడిక్స్‌తో కలిసి, నేరాలు, అగ్ని ప్రమాదాలు, అత్యవసర సంఘటనలను ఎదుర్కొంటాయి. కథ ప్రధానంగా జిన్ హో-గే, బాంగ్ డో-జిన్, సాంగ్ సీల్ అనే మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. మొదటగా జిన్ హో-గే అనే పోలీస్ డిటెక్టివ్, నేరస్థులను పట్టుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటాడు.  అతను నేర సన్నివేశాలను విశ్లేషించడం, నేరస్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, కేసును ఎలాగైనా కొలిక్కి తెచ్చే బలమైన సంకల్పంతో పనిచేస్తాడు.

సీజన్ 1 : సిరీస్ ఒక థ్రిల్లింగ్ యాక్షన్-డ్రామాగా ప్రారంభమవుతుంది, ఇక్కడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, పారామెడిక్స్ వివిధ అత్యవసర సంఘటనలలో కలిసి పనిచేస్తారు. ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త కేస్‌ను పరిష్కరిస్తారు, ఉదాహరణకు కిడ్నాపింగ్, హిట్-అండ్-రన్ యాక్సిడెంట్‌లు, ఆత్మహత్య ప్రయత్నాలు, అగ్నిప్రమాదాల వంటి కేసుల ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో జిన్ హో-గే అనే ఆఫీసర్ తన నైపుణ్యాలతో ఈ కేసులను పరిష్కరించడానికి నడుంబిగిస్తాడు. ఇందులో  ఏడు సంవత్సరాల క్రితం కిడ్నాప్ అయిన బాలిక  కేసు ఇన్వెస్టిగేషన్ లో అనేక మలుపులతో స్టోరీ తిరుగుతుంది.  దీని వెనుక సీరియల్ కిల్లర్ హస్తం ఉందని కనిపెడతాడు.

అయితే బాంగ్ డో-జిన్, సాంగ్ సీల్ అతనికి సహకరిస్తారు. ఈ ముగ్గురి మధ్య సహకారం,స్నేహం స్టోరీని ముందుకు నడిపిస్తాయి.  సీజన్ 1 ఒక ఉత్కంఠభరితమైన క్లిఫ్‌ హ్యాంగర్‌తో ముగుస్తుంది.  ఇది సీజన్ 2 కోసం ఆసక్తిని పెంచుతుంది. సీజన్ 2 లో  జిన్ హో-గే, సాంగ్ సీల్ అనే  కొత్త పాత్రలతో  ఈ స్టోరీ కొనసాగుతుంది.  ఇందులో చాలా క్రిటికల్ కేసులను సాల్వ్ చేయాల్సి వస్తుంది.  ఈ సీజన్‌ సీరియల్ కిల్లర్స్ చేసే హత్యకేసుల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. కేస్ సీజన్ 1 నుండి కొనసాగిన కొన్ని సన్నివేశాలు ఇందులో కంటిన్యూ అవుతాయి.

Read Also : ఒక్కడితోనే పని కానిచ్చే వదినా మరదళ్ళు… పెళ్లయ్యాక పాడు పనులు… మతి పోగొట్టే క్లైమాక్స్ ట్విస్టు

Related News

OTT Movie : భార్య ఫోన్ లో సీక్రెట్ స్పై యాప్… మ్యారేజ్ యానివర్సరీకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే షాక్

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో రాత్రి బర్త్ డే పార్టీ… కళ్ళు తెరిచి చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… భయాన్నే భయపెట్టే హర్రర్ మూవీ

OTT Movie : ప్రేమ పేరుతో సీక్రెట్ వీడియోలు… లేడీ ఆఫీసర్ ను నిండా ముంచే కేటుగాడు… గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్

OTT Movie : మాట్లాడుకునే చెట్లు… ఆ అడవిలోకి అమ్మాయిలు వెళ్తే తిరిగిరారు… ఒక్కో ట్విస్టుకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : అమ్మాయిలపై అఘాయిత్యం చేసి చంపే సైకో… వీడికి ఇదేం మాయ రోగం సామీ… క్లైమాక్స్ లో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్

OTT Movie: ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్లి ఏదో చేస్తారు.. నేపాల్ పోలీసుల అరాచకాన్ని చూపించే మూవీ ఇది

×