OTT Movie : మలయాళ సినిమాలు రియలిస్టిక్ గా ఉండటం వల్లే, వీటిని చూడటానికి ఆసక్తిని చూపిస్తున్నారు మూవీ లవర్స్. ఈ దర్శకులు స్టోరీలను తెరకెక్కించే విధానం కూడా, సామాన్యుడికి కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమా పనీపాటా లేని ముగ్గురు యువకుల చుట్టూ తిరుగుతుంది. వీళ్లంతా కలసి ఒక నీచమైన పనికి పాల్పడతారు. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
యూట్యూబ్‌లో
‘వన్యం’ (Vanyam) సోహన్ సీనులాల్ దర్శకత్వం వహించిన మలయాళ క్రైమ్ డ్రామా చిత్రం. ఈ సినిమా యూట్యూబ్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. IMDbలో ఈ సినిమాలకి 7.0/10 రేటింగ్ ఉంది. ఇందులో అపర్ణా నాయర్ (సన్యాసిని), అనూప్ రమేష్ (రియాజ్, మెకానిక్), విష్ణు ఉన్నికృష్ణన్ (వివేక్, వెబ్ డిజైనర్), సుమిత్ సముద్ర (కృష్ణకుమార్, టెంపుల్ ప్రీస్ట్ కొడుకు) ప్రధానపాత్రల్లో నటించారు.
స్టోరీలోకి వెళ్తే
రియాజ్, వివేక్, కృష్ణకుమార్ అనే ముగ్గురు నిరుద్యోగ యువకులు, రియాజ్ సైకిల్ షాప్‌లో సమయం గడుపుతూ, ధనవంతుల లగ్జరీ జీవితం గురించి చర్చించుకుంటూ ఉంటారు. వీళ్ళు ప్రేమలో పడటానికి ప్రయత్నిస్తారు. కానీ అమ్మాయిలు వారిపై ఆసక్తి చూపకపోవడంతో నిరాశ పడతారు. ఈ క్రమంలో వీళ్ళు ఒక వేశ్యను సంప్రదించే ప్రయత్నం చేస్తారు. ఆమె ఎక్కువ రేటు చెప్పడంతో ఈ కార్యక్రమం కూడా బెడిసికొడుతుంది. ఈ సమయంలో వివేక్ ఒక నీచమైన ఆలోచనను ప్రతిపాదిస్తాడు. ఒక అనీటా అనే సన్యాసినిపై అఘాయిత్యం చేయాలని, ఆమె సన్యాసిని కాబట్టి ఈ ఘటనను బయటకు చెప్పదని భావిస్తారు. ఇక అనుకున్నదే వీళ్ళ ప్లాన్ కూడా విజయవంతమవుతుంది.
Read Also : ఇదెక్కడి సినిమారా బాబూ… మొక్కలకు ప్రాణం వచ్చి మనుషుల్ని లేపేస్తే… సై -ఫై మాస్టర్ పీస్ థ్రిల్లర్