BigTV English

OTT Movie : అమ్మాయిలను చంపి ప్రయోగాలు చేసే సైకో లేడి … మెంటలెక్కించే మూవీ బ్రో

OTT Movie : అమ్మాయిలను చంపి ప్రయోగాలు చేసే సైకో లేడి … మెంటలెక్కించే మూవీ బ్రో

OTT Movie : హారర్ సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక స్కిన్ డిసీజ్ వల్ల ఒక అమ్మాయి సైకోలా మారుతుంది. వేరే వాళ్ళను చంపి, వాళ్ల చర్మాన్ని తన మొహానికి అంటించుకుంటుంది. సైన్స్ ప్రయోగాలలో భాగంగా ఇవి చేస్తుంది. ఈ మూవీ భయం పుట్టిస్తూ, చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ న్యూజీలాండ్ బాడీ హారర్ సినిమా పేరు ‘గ్రాఫ్టెడ్’ (Grafted). ఈ మూవీకి సాషా రెయిన్‌బో దర్శకత్వం వహించారు. ఇందులో జోయెనా సన్, జెస్ హాంగ్, ఈడెన్ హార్ట్, జారెడ్ టర్నర్, సెపి తోవా నటించారు. ఇది హారర్, రొమాన్స్ జోనర్‌లను కలిపి ఉంటుంది. ఈ సినిమా కథ ఒక చైనీస్ స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. ఆమె సోషల్ ఇన్‌సెక్యూరిటీలు, అందంపై ఆధారపడిన సమాజంలో గుర్తింపు కోసం పోరాడుతుంది. ఈ మూవీ 2024 ఆగస్టు 9న న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. సెప్టెంబర్ 12న న్యూజిలాండ్‌లో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

సారా అనే చైనీస్ విద్యార్థినికి ఆమె ముఖంపై పుట్టుకతోనే స్కిన్ డిసీజ్ ఉటుంది. బయట తిరగటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆమె తన తండ్రి పరిశోధనను కొనసాగించేందుకు న్యూజీలాండ్‌లోని, ఒక ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో స్కాలర్‌షిప్‌తో చేరుతుంది. ఆమె తండ్రి, స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నాలజీపై శాస్త్రవేత్తగా ఉండే వాడు. తన ప్రయోగాలలో ఒకటి విఫలమై అనుకోకుండా మరణిస్తాడు. సారా తన తండ్రి అసంపూర్తిగా మిగిలిన పనిని కొనసాగించాలని నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియ ఆమె మొహం మీద మచ్చలను పోగొడుతుందని ఆశిస్తుంది. న్యూజీలాండ్‌లో సారా తన బంధువు లింగ్ తో కలిసి ఉంటుంది. ఇక యూనివర్శిటీలో ఈవ్ జాస్మిన్ ఆమె రూపాన్ని ఎగతాళి చేస్తారు. సారా తన బంధువు అంజెలా లాంటి పాపులారిటీని సాధించాలని కోరుకుంటుంది. కానీ ఆమె సోషల్ అవగాహన లేకపోవడం వల్ల ఆమె మరింత ఒంటరిగా ఉండాల్సి వస్తుంది.
సారా యూనివర్శిటీలో తన తండ్రి పరిశోధనను కొనసాగిస్తుంది. ఇక్కడ స్కిన్ గ్రాఫ్టింగ్ ద్వారా మానవ చర్మానికి సంబంధించిన సీరమ్‌ను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది.

అక్కడ ప్రొఫెసర్ పాల్ ఆమె పరిశోధనను చూసి ఆకర్షితుడై, దానిని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఇదిలా ఉండగా, అంజెలాతో జరిగిన ఒక ఘర్షణలో, సారా అంజెలాను చంపేస్తుంది. ఈ సంఘటన తర్వాత సారా తన సీరమ్‌ను ఉపయోగించి అంజెలా ముఖ చర్మాన్ని తన ముఖంపై గ్రాఫ్ట్ చేస్తుంది. దీనివల్ల ఆమె అంజెలా రూపంలోకి మారుతుంది. అంజెలా రూపంలో సారాకి పాపులారిటీ, స్నేహితులు లభిస్తాయి. కానీ ఈ కొత్త గుర్తింపును కాపాడుకోవడానికి ఆమె మరింత ప్రమాదకరమైన చర్యలకు పాల్పడుతుంది. ఆమె రహస్యాన్ని బయటపెట్టే ఎవరినైనా చంపడానికి వెనకాడకుండా ఉంటంది. చివరికి సారా తన ప్రయోగాలను విజయవంతంగా ముగిస్తుందా ? ఆమె చేసే హత్యలు ఎటు వంటి పరిణామాలకు దారి తీస్తాయి ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే,ఈ సినిమాను చూడండి.

Read Also : ఊహకందని ప్రయోగాలతో మరో ప్రపంచంలోకి వెళ్ళే సైంటిస్ట్… ట్విస్ట్ లతో మతిపోగొట్టే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×