OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలు, వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు, ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలలో ఉండే విజువల్స్, గ్రాఫిక్స్, స్టోరీల పరంగా వీటిని చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు మూవీ లవర్స్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వీటిని చూస్తూ, బాగా ఎంటర్టైన్ అవుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ లో, ఒక సైంటిస్ట్ తన ప్రయోగాల వల్ల మరో ప్రపంచం లోకి వెళ్తాడు. ఆ తర్వాత స్టోరీ మలుపు తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రిమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
ఆపిల్ టివి (Apple TV) లో
ఈ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ పేరు ‘డార్క్ మేటర్’ (Dark Matter). 2024 లో వచ్చిన ఈ సిరీస్ బ్లేక్ క్రౌచ్ 2016 రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇందులో జోయెల్ ఎడ్జెర్టన్, జెన్నిఫర్ కాన్నేల్లీ, ఆలిస్ బ్రాగా, జిమ్మీ సింప్సన్, ఓక్స్ ఫెగ్లీ వంటి నటులు నటించారు. మొదటి సీజన్ 2024 మే 8న రెండు ఎపిసోడ్‌లతో ఆపిల్ టివి (Apple TV) లో ప్రీమియర్ చేయబడింది. ఈ సిరీస్ ఒక భౌతిక శాస్త్రవేత్త అయిన జాసన్ డెస్సెన్ చుట్టూ తిరుగుతుంది.
స్టోరీలోకి వెళితే
జాసన్ చికాగోలో తన భార్య డానియెలా, కుమారుడు చార్లీ తో సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఇతను భౌతిక శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తుంటాడు. అయితే ఒక రాత్రి, తన లాగే ఉండే ఒక రూపం జాసన్ : 2 ఒక రహస్యమైన ప్రదేశానికి తీసుకెళ్తాడు. అక్కడ ఇతడు కలలు గన్న ప్రపంచం ఉంటుంది. తన జీవితంలో ఒక ప్రత్యామ్నాయ ప్రపంచంలో, జాసన్ ఒక విజయవంతమైన శాస్త్రవేత్తగా ఉంటాడు. ఎన్ని విజయాలు సాధించినా కానీ, అతని దగ్గర తన కుటుంబం లేకపోవడంతో బాధపడతాడు. అతను తన అసలు జీవితానికి తిరిగి రావడానికి, తన కుటుంబాన్ని రక్షించడానికి ఒక కఠినమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఈ ప్రయాణంలో అతనికి జాసన్ : 2 కి సంబంధించిన స్నేహితురాలు అమండా లూకాస్ సహాయం చేస్తుంది. జాసన్ తన అసలు జీవితానికి తిరిగి రావడానికి వివిధ రకాల ప్రపంచాలను గుండా ప్రయాణిస్తాడు. అయితే అతడు మరో ప్రపంచంలో గడిపిన జీవితం కారణంగా, అతని కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. చివరికి జాసన్ తన ఫ్యామిలీని కలుస్తాడా ? వాళ్ళు ఎటువంటి ప్రమాదంలో చిక్కు కుంటారు? జాసన్ వాళ్ళను కాపాడతాడా ? ఇన్నాళ్ళూ అతను ఎక్కడ పరిశోధనలు చేశాడు ? చివరికి ఏం జరిగింది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్ ను చూడాల్సిందే.
Read Also : శవాలను మాయం చేస్తూ అఘోరీ తాంత్రిక పూజలు … ఈ వెబ్ సిరీస్ చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే