OTT Movie : ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఉన్న హర్రర్ థ్రిల్లర్ కోసం వెతుకుతున్నార ? అయితే ఈ మూవీ మీ కోసమే! ఈ అమెరికన్ ఫ్యాంటసీ హర్రర్ డ్రామా సిరీస్… ఒక పోలీస్ డిటెక్టివ్ జీవితంలో ఊహించని ట్విస్ట్‌లు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అంశాలతో అలరిస్తుంది. ఇందులో మాయాజాల జీవులతో నిండిన ఒక డార్క్, మిస్టీరియస్ ప్రపంచం ఉంటుంది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉందో తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే…
కథ పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్‌లోని హోమిసైడ్ డిటెక్టివ్ నిక్ బుర్క్‌హార్ట్ (డేవిడ్ గియుంటోలి) చుట్టూ తిరుగుతుంది. అతను తన పూర్వీకుల నుండి వచ్చిన ఒక ప్రత్యేక వంశం అయిన “గ్రిమ్” జాతికి చెందిన వాడు. గ్రిమ్‌లు అనేవి అతీంద్రియ శక్తులను కలిగిన వేటగాళ్లు, వీరు మానవాళిని వెసెన్ (Wesen) అనే మాయాజాల జీవుల నుండి రక్షించే బాధ్యతను తీసుకుంటారు. ఈ వెసెన్ జీవులు మానవ రూపంలో ఉంటాయి, కానీ వాటి నిజమైన రూపాన్ని గ్రిమ్ లు మాత్రమే చూడగలరు. ముఖ్యంగా వాటి “వోజ్” (Woge) సమయంలో, అంటే ఒత్తిడి లేదా ఆవేశంలో వాటి జంతు రూపం బయటపడినప్పుడు. డిటెక్టివ్ నిక్ గ్రిమ్ గా మారి వాటిని పట్టుకుంటాడు. ఈ క్రమంలో అతను తన పోలీస్ పార్టనర్ హాంక్ గ్రిఫిన్, తన స్నేహితుడు మన్రో, ఒక రిఫార్మడ్ బ్లట్‌బాడ్ (వోల్ఫ్-లైక్ వెసెన్), రోసలీ, ఫాక్స్-లైక్ వెసెన్ సహాయంతో రోగ్ వెసెన్‌లతో తలపడతాడు. ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు? హీరో డిటెక్టివ్ గా ఎలాంటి పనులు చేస్తున్నాడు ? అసలు ఈ వెసెన్లు మనుషులను పట్టి ఎందుకు పీడిస్తున్నాయి ? వాటిని పట్టుకున్నాక హీరో ఏం చేస్తున్నాడు? అనే విషయాలు తెలియాలంటే మూవీపై ఓ లుక్కేయండి.
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?
ఈ సిరీస్‌లో బ్రదర్స్ గ్రిమ్ ఫెయిరీ టేల్స్ నుండి ప్రేరణ పొందిన “మాన్స్టర్ ఆఫ్ ది వీక్” ఎపిసోడ్‌లతో పాటు, నిక్ గ్రిమ్ వంశం, వెసెన్ ప్రపంచంలో కుట్రలు, రాయల్ బ్లడ్‌లైన్‌లతో సంబంధం ఉన్న సీన్ రెనార్డ్ (సాషా రోయిజ్), నిక్ పోలీస్ కెప్టెన్ చుట్టూ అల్లుకున్న లోతైన మిస్టరీ వంటి ఇంట్రెస్టింగ్ అంశాలు హైలెట్. ఈ సిరీస్ సస్పెన్స్, హారర్, ఫాంటసీ, క్రైమ్ డ్రామాతో ఎండింగ్ వరకూ ఆడియన్స్ స్క్రీన్లకు అతుక్కుపోయేలా చేస్తుంది.
Read Also : అబ్బాయిలని చూడగానే ఆ పార్ట్ సైజ్ చెప్పే టెక్నాలజీ… ఇలాంటి మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా
స్టీఫెన్ కార్పెంటర్, జిమ్ కౌఫ్, డేవిడ్ గ్రీన్‌వాల్ట్ సృష్టించిన ఈ అమెరికన్ సూపర్ న్యాచురల్ డ్రామా సిరీస్ పేరు ‘గ్రిమ్’ (Grimm), డేవిడ్ గియుంటోలి, రస్సెల్ హార్న్స్‌బీ, సిలాస్ వీర్ మిచెల్, బ్రీ టర్నర్, సాషా రోయిజ్, బిట్సీ టులోచ్ తదితరులు నటించిన ఈ సిరీస్, 6 సీజన్‌లలో 123 ఎపిసోడ్‌లతో (ఒక్కో ఎపిసోడ్ 42-45 నిమిషాలు) అదరగొట్టింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.