OTT Movie : టైటిల్ ను చూసి కంగారు పడకండి. ఇది పక్కా ఫ్యామిలీతో చూడగలిగే హారర్ మూవీ. ఈ రోజు మన సినిమా సజెషన్ ఒక తైవానీస్ సైన్స్-ఫిక్షన్ హారర్ షార్ట్ ఫిల్మ్. ఒక సీక్రెట్ ప్రకృతి శక్తి గురించి ఆసక్తికరమైన మిస్టరీతో మిమ్మల్ని కట్టిపడేసే ఈ చిత్రం కేవలం 6 నిమిషాల నిడివితో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, డ్రోన్ సినిమాటోగ్రఫీతో ఆకట్టుకుంటుంది. ఒక సాధారణ దోమ కాటు నుండి బయటపడే భయంకరమైన రహస్యం ఆడియన్స్ కు ఒక అద్భుతమైన థ్రిల్‌ను అందిస్తుంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
ఈ మూవీ కథ ఒక యువతి (జోన్ లోలుఓ) చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒంటరిగా సమయం గడపడానికి అడవిలోని ఒక నిర్మానుష్యమైన నదీతీరానికి వెళుతుంది. అందమైన అడవి, నది, ప్రకృతి సౌందర్యం మధ్య సూర్యరశ్మిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను ఒక దోమ కుడుతుంది. ఈ సాధారణ దోమ కాటు ఒక భయంకరమైన అతీంద్రియ శక్తిని బయట పెడుతుంది.
మామూలుగా దోమలు ఒక చుక్క రక్తం తాగుతాయి. కానీ ఈ దోమ మాత్రం బాగానే రక్తాన్ని పీల్చుకుంటుంది. కానీ ఆమె ఆ దోమను పెద్దగా పట్టించుకోదు. అయితే ఆమె రక్తం ఒక విచిత్రమైన, ఇతర ప్రపంచానికి చెందిన జీవికి సంబంధించిన ఒక సీక్రెట్ శక్తికి దారి తీస్తుంది. ఆ జీవి ఈ అమ్మాయి రక్తంతో అసాధారణమైన రూపంలోకి మారుతుంది. ఈ చిత్రంలోని సీజీఐ విజువల్స్ భయంకరంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే కథ చివరిలో ఒక షాకింగ్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి ? అసలు ఆ వింత జంతువు ఏంటి? ఆ దోమ కాటు వల్ల హీరోయిన్ కి ఏమైంది? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
Read Also : చిన్న క్లూ కూడా వదలకుండా హత్యలు… వీడి తెలివికి దండంరా బాబూ… గ్రిప్పింగ్ కొరియన్ క్రైమ్ డ్రామా
ఏ ఓటీటీలో ఉందంటే?
ప్రకృతి రహస్యాలు, సూపర్ న్యాచురల్ హారర్, సైన్స్-ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ షార్ట్ ఫిల్మ్ ఆడియన్స్ కు భయంకరమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ‘క్లియర్ వాటర్’ (clear water). రాబ్ జబ్బాజ్ దర్శకత్వంలో తీసిన ఈ తైవానీస్ సైన్స్-ఫిక్షన్ హారర్ షార్ట్ ఫిల్మ్ లో జోన్ లోలుఓ ప్రధాన పాత్రలో నటించింది. 6 నిమిషాల రన్‌టైమ్‌తో 2020 అక్టోబర్ 30న విడుదలైన ఈ మూవీ DUST యూట్యూబ్ ఛానెల్‌లో ఇంగ్లీష్ లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో అందుబాటులో ఉంది.