Viral news: ఇటీవల యువత ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, అలాగే ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ.. ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. గతంలో కూడా కొంత డేంజర్ స్టంట్స్, రీల్స్ చేస్తూ ప్రాణాలను కోల్పోయినవారు ఉన్నారు. అయితే కొంత మందికి ఏమాత్రం బుద్ది రావడం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ల తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
ఇద్దరు భార్యాభర్తలు, తమ ఏడేళ్ల చిన్నారి కూతురు జీవితాన్ని పణంగా పెట్టి, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు డేంజర్ స్టంట్‌కు ప్రయత్నించారు. ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్‌పూర్, బరేఠా డ్యామ్ వద్ద జరిగింది. ఈ జంట తమ కూతురిని డ్యామ్ రైలింగ్‌కు అవతల ఉన్న ఒక గేజ్ బాక్స్‌పై కూర్చోబెట్టారు. ఆ గేజ్ బాక్స్ కేవలం ఒక ఇనుప యాంగిల్‌తో సపోర్ట్ ఫిట్టింగ్ చేసి ఉంది. ఈ చిన్నారి ఎలాంటి భయం లేకుండా ఆ నీటి అంచున కూర్చుని ఉండగా, తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహిస్తున్నట్టు వీడియో కనిపిస్తోంది. ఆమె తండ్రి ఆమె చేతులను వదిలేసిన తర్వాత కూడా ఆమె అక్కడే కూర్చుని ఉంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ये रील का चक्कर है बाबू भईया!
राजस्थान के भरतपुर में माता-पिता रील के चक्कर में बेटी की जान को खतरे में डाला।#Rajasthan #BarethaDam #Bharatpur pic.twitter.com/8jTwTrVfT5
— Surabhi🇮🇳 (@surabhi_tiwari_) July 7, 2025
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మూడు రోజుల కింద ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఉమాశంకర్ అనే స్థానిక వ్యక్తి రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. అతను తన భార్య, కూతురితో డ్యామ్‌ను చూసేందుకు వచ్చారు. ఈ డ్యామ్, ఇటీవలి భారీ వర్షాల కారణంగా నీరు భారీగా ప్రవహిస్తోంది. ఇది చూసేందుకే వారు వచ్చారు. అయితే జిల్లా కలెక్టర్ క్వమర్ చౌదరి మూడు రోజుల ముందు డ్యామ్‌లు, చెరువుల వద్ద సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కొంత మంది చేష్టలు నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.
ALSO READ: Heavy rain: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన, బయటకు రావొద్దు
తమ కూతరిని అలా నీటి అంచున కూర్చొబెట్టిన పేరెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. కొంచెం మిస్టేక్ అయిన చిన్నారి ప్రాణాలకే ప్రమాదమని కామెంట్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఆ పేరెంట్స్ బాధ్యతారాహిత్యాన్ని ఖండించారు. పోలీసులు కూడా దీనిపై స్పందించారు. సోషల్ మీడియా లైక్‌లు, ఫాలోవర్స్ కోసం ఇటువంటి ప్రమాదకర స్టంట్‌లు చేయవద్దని హెచ్చరించారు. ఆ చిన్నారి తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.