OTT Movie : సైకో సినిమాలు రకరకాల స్టోరీలతో కేక పెట్టిస్తుంటాయి. ఈ సినిమాలు చివరివరకూ ఉత్కంఠంగా నడుస్తుంటాయి. ఇప్పుడుమనం చెప్పుకోబోయే సినిమాలో ఒక సైకో ప్రేమికులను మాత్రమే టార్గెట్ చేస్తుంటాడు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
గత కొన్ని సంవత్సరాలుగా ‘Heart Eyes’ అనే సీరియల్ కిల్లర్, వాలెంటైన్స్ డే నాడు వివిధ నగరాల్లో ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తుంటాడు. ఈ సంవత్సరం కిల్లర్ సియాటిల్ నగరంలో తన హత్యలను కొనసాగిస్తాడు. ఒక స్పాలో రెండు జంటలను ఈ సైకో చంపుతాడు. ఈ హత్యలు జరిగిన ప్రాంతంలో ‘J.S.’ అనే అక్షరాలతో కూడిన ఒక ఎంగేజ్మెంట్ ఉంగరంని పోలీసులు గుర్తిస్తారు. మరొవైపు అల్లీ మెక్‌కేబ్ అనే యువతి ఒక జ్యువెలరీ కంపెనీలో పిచ్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఆమె తన ప్రియుడు కోలిన్‌తో విడిపోయిన తర్వాత ప్రేమపై నమ్మకం కోల్పోతుంది. జే అక్కడ సిమ్మన్స్ తో కలిసి పనిచేస్తూ ఉంటుంది. జే, అల్లీని వాలెంటైన్స్ డే రోజు డిన్నర్‌కు ఇన్వైట్ చేస్తాడు. అల్లీని ఇంప్రెస్ చేయాలని అనుకుంటాడు. ఇక వీళ్ళు డిన్నర్ చేస్తున్న సమయంలో, అల్లీ తన మాజీ ప్రియుడు కోలిన్‌ని కొత్త ప్రియురాలు సియన్నాతో చూస్తుంది.
ఈ సందర్భంలో అల్లీ తన మాజీ ప్రియుడిని రెచ్చగొట్టడానికి జేను ముద్దు పెట్టుకుంటుంది. దీంతో వీళ్ళు ఒక ప్రేమ జంటగా కనిపించి ‘Heart Eyes’ కి టార్గెట్ అవుతారు. అక్కడే ఉన్న కిల్లర్ వీళ్లపై దాడి చేస్తాడు. ఈ జంట తమ ప్రాణాల కోసం పరుగెత్తాల్సి వస్తుంది. ఈ క్రమంలో పోలీసులు జే పై కొంత అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మర్డర్లు జరిగిన చోట దొరికిన ఉంగరం జే ది గా గుర్తిస్తారు. ఇక అల్లీ, జే కిల్లర్ నుంచి తప్పించుకోవడానికి ఒక థియేటర్‌లో దాక్కుంటారు. చివరికి హర్ట్ ఐస్ ఈ జంటని చంపుతాడా, అతను ఎందుకు వాలెంటైన్స్ డే రోజు మాత్రమే ప్రేమికులను చంపుతున్నాడు. ఇకా ఎంత మంది అతనికి టార్గెట్ అవుతారు అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హాలీవుడ్ హారర్ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : భార్యాభర్తల మధ్యలో ఓ సైకో పిల్ల… ట్విస్టులతో అదరగొట్టే సైకలాజికల్ థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ హారర్ మూవీ పేరు ‘హర్ట్ ఐస్’ (Heart Eyes). 2025 లో వచ్చిన ఈ మూవీకి జోష్ రూబెన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఒలివియా హోల్ట్, మాసన్ గూడింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ స్టోరీ కామెడీ, స్లాషర్ హారర్ శైలులను కలిపి, వాలెంటైన్స్ డే నాడు జంటలను లక్ష్యంగా చేసుకునే సీరియల్ కిల్లర్ చుట్టూ కథ తిరుగుతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.