Anaganaga O Sukravaram OTT: ఉన్నట్టుండి మనం మనకు నచ్చిన ఏజ్ లోకి, నచ్చిన వ్యక్తి బాడీలోకి మారిపోతే ఎలా ఉంటుంది ? అచ్చం ఇలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చింది సమంత హీరోయిన్ గా నటించిన ‘ఓ బేబీ’ మూవీ. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఈ సినిమా గురించి మాత్రం కాదు. బాడీ స్వాప్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘అనగనగా ఓ శుక్రవారం’ (Anaganaga O Sukravaram Movie 2026) ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
సినిమాలో తల్లి సంప్రదాయబద్ధంగా, ఇంటి బాధ్యతలను ఒక్కతే మోస్తూ ఉంటుంది. కూతురేమో పక్కా మోడ్రన్ అమ్మాయి. కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తుంది. కెరీర్ పరంగా టెన్షన్ లో ఉంటుంది. అయితే జెనరేషన్ గ్యాప్ వల్ల తల్లీకూతుర్ల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు, అభిప్రాయభేదాలు వస్తుంటాయి. ఒకరి కష్టాన్ని మరొకరు అస్సలు అర్థం చేసుకోరు. గురువారం రాత్రి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. నా స్థానంలో ఉంటే నీకు నా కష్టం తెలిసేది అని ఇద్దరూ అనుకుంటారు.
అంతే తెల్లారేసరికి కథ మారిపోతుంది. మరుసటి రోజు అంటే… శుక్రవారం ఉదయం ఒక మ్యాజిక్ జరుగుతుంది. నిద్రలేచేసరికి తల్లి ఆత్మ కూతురి శరీరంలోకి, కూతురి ఆత్మ తల్లి శరీరంలోకి మారిపోతాయి. అద్దంలో తమను తాము చూసుకుని ఇద్దరూ అవాక్కవుతారు. ఈ వింత పరిస్థితి నుండి ఎలా బయటపడాలో వాళ్ళకి అర్థం కాదు. కూతురి శరీరంలో ఉన్న తల్లి మోడ్రన్ బట్టలు వేసుకుని కూతురి కార్పొరేట్ ఆఫీస్‌కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ల్యాప్‌టాప్‌లు, ప్రజెంటేషన్లు, ఇంగ్లీష్ మీటింగ్‌లు చూసి ఆమె తలప్రాణం తోకకు వస్తుంది.
తల్లి శరీరంలో ఉన్న కూతురు ఇంట్లో ఉండి వంట గది బాధ్యతలు, చుట్టుపక్కల వారి మాటలు, బంధువుల వ్యవహారాలను చూసుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజూ తల్లి పడే శారీరక కష్టాన్ని, ఓర్పును ఆమె అనుభవిస్తేనే గానీ అర్థం కాదు. ఈ గందరగోళంలో ఒకరి స్థానంలో మరొకరు రోజంతా గడపడం వల్ల వాళ్ళకి జీవిత సత్యాలు బోధపడతాయి. ఆఫీసులో కూతురు ఎంత మానసిక ఒత్తిడిని తట్టుకుని పని చేస్తోందో తల్లికి అర్థమవుతుంది. అలాగే, ఇంట్లో ఉంటూ తల్లి తమ కోసం ఎంత త్యాగం చేస్తోందో కూతురు తెలుసుకుంటుంది. మరి ఆ తరువాత కథ ఎలాంటి టర్న్ తీసుకుంది ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే ఈ హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాను చూడాల్సిందే.
ETV WIN ‘కథా సుధ – సండే స్టోరీస్’లో భాగంగా జూలై 19 నుండి స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. తెలుగు సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా వచ్చిన ‘అనగనగా ఓ శుక్రవారం’ తెలుగులోనే ఉంది. సినీయర్ నటి ఇంద్రజ తల్లి పాత్రలో, మోహన కూతురు పాత్రలో నటించారు.
Read Also: రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్