BigTV English

OTT Movie: హార్రర్ మూవీ లవర్స్ కు హార్ట్ ఎటాక్ తెప్పించే సినిమా… సీను సీనుకూ గుండె జారిపోవాల్సిందే

OTT Movie: హార్రర్ మూవీ లవర్స్ కు హార్ట్ ఎటాక్ తెప్పించే సినిమా… సీను సీనుకూ గుండె జారిపోవాల్సిందే

OTT Movie : దెయ్యాల స్టోరీలను వినాలన్నా, చూడాలన్న ఉత్సాహం చూపిస్తుంటారు కొంతమంది ప్రేక్షకలు. అయితే ఇటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక మరుపురాని థ్రిల్లింగ్ ఇస్తుంది. ఈ మూవీని టాప్ హారర్ సినిమాలలో ఒకటిగా చెప్పుకుంటున్నారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

అన్నీ గ్రాహం తన తల్లి ఎల్లెన్ చనిపోవడంతో విషాదంలో ఉంటుంది. ఎల్లెన్ మరణం తర్వాత ఆమె కుటుంబం విచిత్రమైన, భయాంకలిగించే సంఘటనలను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో అన్నీ తన తల్లి గురించి రహస్యాలను కనిపెడుతుంది. ఆమె ఒక రహస్య సంస్థలో సభ్యురాలని, ఆమె కుటుంబాన్ని ఒక శక్తి చుట్టుముట్టేలా చేసిందని తెలుస్తుంది. ఇలా ఉండగా అన్నీ చిన్న కుమార్తె చార్లీ విచిత్రమైన ప్రవర్తనతో, ఒక భయానక దుర్ఘటనలో మరణిస్తుంది. ఇది ఈ కుటుంబాన్ని మరింత గందరగోళంలోకి నెట్టివేస్తుంది. అన్నీ తన బాధలను ఎదుర్కోవడానికి ఒక సపోర్ట్ గ్రూప్‌లో చేరుతుంది. అక్కడ ఆమె జోన్ అనే మహిళ పరిచయం అవుతుంది.


ఆమె ఆధ్యాత్మిక ఆచారాల ద్వారా చార్లీ ఆత్మతో మాట్లాడవచ్చని చెబుతుంది. కథ ముందుకు సాగే కొద్దీ అన్నీ తన తల్లి ఎల్లెన్ ఒక దెయ్యం పాయిమన్ (Paimon) అనే రాక్షసుడిని ఆరాధించే సంస్థలో ఉండేదని తెలుసుకుంటుంది. ఈ రాక్షసుడు ఒకరి శరీరంలో ప్రవేశించాలని ప్రయత్నిస్తుంటాడు. గ్రాహం కుటుంబం దీనికి బలిపశువులుగా మారుతారు. చివరికి అన్నీ ఆత్మలతో మాట్లాడుతుందా ? ఈ దుష్ట శక్తులను ఆమె ఎలా ఎదుర్కుంటుంది ? ఇంకెంతమంది ఈ దెయ్యం చేతిలో బలి అవుతారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకంటే, ఈ సైకలాజికల్ హారర్  సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ప్రపంచం మొత్తం వైరస్ వచ్చి తుడిచి పెట్టుకుపోతే… ఈ పిల్ల మాత్రం వైరస్నే తరిమి కొడుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సైకలాజికల్ హారర్ మూవీ పేరు ‘హెరిడిటరీ’ (Hereditary). 2018 లో విడుదలైన ఈ సినిమాకి ఆరి ఆస్టర్ తన తొలి చిత్ర దర్శకుడిగా దర్శకత్వం వహించాడు. ఇందులో టోనీ కొల్లెట్, అలెక్స్ వోల్ఫ్, మిల్లీ షాపిరో, ఆన్ డౌడ్, గాబ్రియేల్ బైర్నే వంటి నటులు నటించారు. ఈ సినిమా స్టోరీ ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంది. హెరిడిటరీ 2018 జనవరి 21న, సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. యునైటెడ్ స్టేట్స్‌లో 2018 జూన్ 8న థియేట్రికల్‌గా విడుదలైంది. ఈ మూవీ విస్తృతమైన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇది 2018లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×