OTT Movie : ఆరాచకమైన సినిమాలను చూడాలనుకుంటే జాంబి సినిమాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలలో ఉండే విధ్వంసం ఎక్కడా ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక వైరస్ వల్ల మనుషులు జాంబిలుగా మారిపోతారు. ఆతరువాత స్టోరీ ఊహకందని రీతిలో నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
మెలనీ అనే అమ్మాయి ఒక సైనిక స్థావరంలో ఖైదీగా ఉంటుంది. అక్కడ ఆమెలో జాంబి వైరస్ ను తట్టుకునే శక్తి ఉంటుంది. అందువల్ల ఆమెపై డాక్టర్ కరోలిన్ పరిశోధన చేస్తూ, వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నం చేస్తుంటుంది. మెలనీకి అక్కడే ఉన్న ఆమె టీచర్ హెలెన్ జస్టినో తో ప్రత్యేక బంధం ఏర్పడుతుంది. ఆమె మెలనీని గౌరవంగా, ఆప్యాయంగా చూస్తుంది. అయితే ఈ సైనిక స్థావరం పై ఒక్కసారిగా జాంబీలు దాడి చేస్తాయి. అక్కడ మెలనీ తో పాటు ఇద్దరు సైనికులు తప్పించుకుంటారు. మిగతా వాళ్ళంతా జాంబిలుగా మారిపోతారు. ఇక వీళ్ళు బయటి ప్రపంచంలో బతకడానికి ప్రయాణం చేస్తారు. అక్కడ మెలనీ తన జాంబి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
ఆమె తన తెలివితేటలతో, ధైర్యంతో బతికున్న వాళ్ళకు సహాయం చేస్తుంది. కానీ ఆమెలో దాగిఉన్న జాంబి స్వభావం ఆమెకు నిరంతరం భయాన్ని కలిగిస్తుంది. ఆ తరువాత మెలనీ ఈ వ్యాధి గురించి కీలకమైన విషయాలను తెలుసుకుంటుంది. చివరికి మెలనీ ఈ వైరస్ కి విరుగుడు కనిపెడుతుందా ? జాంబి వైరస్ ను ఆమె ఎలా తట్టుకుంటోంది ? ఆమె జాంబిలను ఎలా ఎదుర్కుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ అపోకలిప్టిక్ అడ్వెంచర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : తండ్రికే తెలియకుండా కొడుకుని పూడ్చిపెట్టే కిరాతకుడు ఈ పోలీస్… ఓటీటీని ఊపేసిన బెస్ట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్
జీ 5 (Zee 5) లో
ఈ అపోకలిప్టిక్ అడ్వెంచర్ మూవీ పేరు’ది గర్ల్ విత్ ఆల్ ది గిఫ్ట్స్’ (The Girl with All the Gifts). 2016 లో వచ్చిన ఈ సినిమాకి కోల్మ్ మెక్‌కార్తీ దర్శకత్వం వహించారు. M.R. Carey రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో గెమ్మా ఆర్టెర్టన్, ప్యాడీ కాన్సిడైన్, గ్లెన్ క్లోజ్, సెనియా ననువా వంటి నటులు నటించారు. ఈ కథ ఒక డిస్టోపియన్ భవిష్యత్తులో జరుగుతుంది. ఇక్కడ ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ మానవాళిని దాదాపుగా నాశనం చేస్తుంది. మనుషులు జాంబిలుగా మారిపోతారు. ఆ తరువాత స్టోరీ మెలనీ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.