Volcano Eruption: ప్రపంచంలో అగ్నిపర్వతాల్లో ఒకటైన మౌంట్ ఎట్నా యాక్టివేట్ అయ్యింది. ఒక్కసారిగా బద్దలై లావా బయటకు వచ్చింది. దీని ధాటికి ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళి కమ్మేసింది. అదే సమయంలో అక్కడున్న పర్యాటకులు ప్రాణాలు కాపాడుకునేందుకు భయంతో పరుగులు పెట్టారు.
ఐరోపాలో ఎత్తైన అగ్నిపర్వతం ఇటలీలోని సిసిలియా ప్రాంతంలో ఉన్న మౌంట్ ఎట్నా బద్దలైంది. భారీ విస్ఫోటనం సంభవించడంతో అగ్ని పైకి ఎగిసి పడింది. దీంతో ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళి కమ్మేసింది. విస్ఫోటనం తర్వాత ఆ ప్రాంతం నుంచి లావా ఉధృతంగా ప్రవహించింది. ఎట్నా ఈశాన్య భాగం బద్దలైనట్టు ఆదేశ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
అగ్నిపర్వతం యాక్టివేట్ కావడంత అత్యంత ప్రమాదకర విస్ఫోటనంగా భావించిన స్థానిక అధికారులు, అక్కడికి వచ్చిన పర్యాటకులను అలర్ట్ చేశారు. దుమ్ము, ధూళి క్రమంగా వ్యాపించడంతో టూరిస్టులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు భయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. అలాగే మౌంట్ ఎట్నా ప్రాంతంలోని సమీప గ్రామాల ప్రజలను మరో ప్రాంతానికి తరలించారు. స్థానికులు, టూరిస్టులు కచ్చితంగా మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు.
ALSO READ: విమానాన్ని ఢీ కొట్టిన రాబందు.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద దాదాపు నాలుగు మైళ్ల వరకు వ్యాపించిందని అధికారులు అంచనా వేశారు. ఎట్నా వల్ల చుట్టుపక్కల ప్రాంతాల వారికి ప్రాణహాని లేదని తెలిపారు.అగ్నిపర్వతం బద్దలు కాగానే స్థానిక ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేశారు. ఆ ప్రాంతం మీదుగా వెళ్లే విమానాలను డైవర్ట్ చేశారు.
మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఆఫ్రికా-యూరేషియా టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ తరచూ అగ్నిపర్వతం బద్దలవుతుంది. ప్రపంచంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో మౌంట్ ఎట్నా గుర్తింపు పొందింది. సిసిలీ ద్వీపంలో ఉండే ఈ పర్వతం సుమారు ఎత్తు 3,300 మీటర్లు.
మౌంట్ ఎట్నా యాక్టివేట్ అయిన సమయంలో దాదాపు ఆ ప్రాంతంలో డజను మంది టూర్ ఆపరేటర్లు ఉన్నారు. అగ్నిపర్వత ప్రాంతం హైకింగ్, స్కీయింగ్ లాంటి పర్యాటక కార్యకలాపాలకు ఫేమస్. అగ్నిపర్వతం పేలినప్పుడు అక్కడున్న పర్యాటకులు, ట్రెక్కర్లను సురక్షితంగా తరలించారు అధికారులు. 2014 తర్వాత ఈ స్థాయిలో విస్ఫోటనం జరగలేదని అధికారుల చెబుతున్నారు. ప్రస్తుతానికి విస్ఫోటనం తగ్గుముఖం పట్టిందని, బయటకు వచ్చిన లావా ప్రవాహం చల్లబడిందని తెలిపారు.
🚨 #BREAKING: MOUNT ETNA ERUPTS AGAIN
Italy’s 🌍 most active volcano, Mount Etna, has started erupting—spewing 🌋 lava and 🌫️ ash high into the sky.
Authorities 🚨 are closely monitoring the situation. No reports of injuries so far.#MountEtna #Volcano #Italy #Europe… pic.twitter.com/jehbYzaL51— ViralNewsHQ™ (@viralposts2323) June 2, 2025