Sri Lanka : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా కొందరూ చాలా అద్భుతంగా క్రికెట్ రాణిస్తే.. మరికొందరూ పేలవ ప్రదర్శన కనబరుస్తుంటారు. కొందరూ టాపర్లుగా పేరు సంపాదిస్తే.. మరికొందరూ చెత్త ప్రదర్శన ఆటగాళ్లుగా నిలుస్తున్నారు. అయితే కొంత మంది క్రికెటర్లు గతంలో ఓ ఊపు ఊపిన వారు ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు వారి కొడుకులు మళ్లీ క్రికెట్ రంగంలోనే రాణిస్తున్నారు. వారిలో కొందరూ అద్భుతంగా రాణిస్తుంటే.. మరికొందరూ మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. వారిలో ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. సచిన్ టెండూల్కర్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతంగా గుర్తింపు సంపాదించుకున్నాడు.
Also Read : Smaran Ravichandran : జట్టులో మరో మరో ఆణిముత్యం.. కావ్య పాపకు లక్ కలిసి వచ్చింది.. ఆ ప్లేయర్ ఎవరంటే
తండ్రుల బాటలోనే..
తాజాగా శ్రీలంక కి చెందిన ఫేమస్ క్రికెటర్ల కుమారులు కూడా తమ తండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ముఖ్యంగా సనత్ జయసూర్య బ్యాటింగ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అతని కుమారుడు ఇప్పుడు బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు. అలాగే శ్రీలంక బౌలర్ ముత్తయ మురళీధరన్ కుమారుడు కూడా బౌలింగ్ లో రాణించడం విశేషం. అప్పట్లో తండ్రులు ఎలా రాణించారో.. ఇప్పుడు కుమారులు కూడా తండ్రుల అడుగుజాడల్లో వెళ్లడం విశేషం. ముఖ్యంగా శ్రీలంక క్రికెట్ ఒకప్పుడు తమ ప్రతిభతో ఆధిపత్యం చెలాయించిన దిగ్గజ ఆటగాళ్ల వారసులు ప్రస్తుతం మైదానంలో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఆల్ రౌండర్ సనత్ జయసూర్య కుమారుడు రనుక్ జయసూర్య, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ కుమారుడు నరేర్ మురళీధరన్ ఓ క్లబ్ మ్యాచ్ మ్యాచ్ లో ఒకరినొకరు ఎదుర్కోవడం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇద్దరూ కుమారులు ఒకే మ్యాచ్ లో..
ఈ అరుదైన ఘటన కొలొంబోలోని పి.సారా ఓవల్ స్టేడియంలో చోటు చేసుకుంది. సింహాళిస్ స్పోర్ట్స్ క్లబ్, తమిళ యూనియన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ ఇద్దరూ యువ ఆటగాళ్లు ఆడే అవకాశం దక్కింది. రనుక్ సింహాళిస్ స్పోర్ట్స్ క్లబ్ తరపున బరిలోకి దిగితే.. నరేన్ తమిళ యూనియన్ కోసం పోటీ పడ్డాడు. ఒకే కాలంలో శ్రీలంక జాతీయ జట్టులో చిరస్మరణీయ విజయాలు సాధించిన జయసూర్య మురళీధర్ వారసులు ఇప్పుడు ప్రత్యర్థులుగా ఆడటం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ఇప్పటికే మురళీధరన్ కుమారుడు నరేన్ మురళీధరన్ 4 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. అతని తండ్రి ముత్తయ్య మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్ లో సృష్టించిన పలు రికార్డులు నేటికి అందని కొసలుగానే ఉన్నాయి. 800 టెస్ట్ వికెట్లు, 534 వన్డే వికెట్లు సహా మొత్తం 1347 అంతర్జాతీయ వికెట్లతో ఆయన ప్రపంచ క్రికెట్ లో అగ్రస్థానంలో నిలిచారు. మరోవైపు విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా క్రికెట్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జయసూర్య వారసుడు రనుక్ క్లబ్ క్రికెట్ లో తన ప్రతిభను చాటుకుంటూ భవిష్యత్ తారగా ఎదుగుతున్నాడు. జయసూర్య వన్డే 13వేలకు పైగా.. టెస్టుల్లో 7వేల పరుగులు సాధించాడు. అలాగే బౌలర్ గా 400 పైగా వికెట్లను తీశాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కుమారులు రనుక్, నరేన్ ఒకే మైదానంలో ఆడటంతో అభిమానులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.