E-Paper
Advertisement

యజమాని భార్యతో అలాంటి పని… సినిమా కోసం వచ్చి చిక్కుల్లో

యజమాని భార్యతో అలాంటి పని… సినిమా కోసం వచ్చి చిక్కుల్లో
Advertisement

Period Drama Series: పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అదే చేసుకుని వెళ్లిపోతే బాగానే ఉంటుంది. కానీ వచ్చిన పనిని పక్కన పెట్టి, ఏకంగా యజమాని భార్యపై కన్నేస్తే, ఆమె కూడా భర్తను వదిలేసి అతనితో వెళ్లిపోవడానికి సిద్దపడితే ? ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. అదే హిందీ వెబ్ సిరీస్ Jubilee. మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 1947లో దేశ విభజన సమయంలో బొంబాయిలోని ప్రముఖ ‘రాయ్ టాకీస్’ స్టూడియో చుట్టూ తిరుగుతుంది. స్టూడియో అధినేత శ్రీకాంత్ రాయ్. ఆయన తన తదుపరి భారీ చిత్రం ‘సంఘర్ష్’ కోసం కొత్త హీరోని వెతుకుతాడు. ఈ నేపథ్యంలోనే థియేటర్ ఆర్టిస్ట్ జంషెడ్ ఖాన్ అతని దృష్టిలో పడతాడు. జంషెడ్‌ను ‘మదన్ కుమార్’గా పరిచయం చేసి పెద్ద స్టార్ చేయాలని శ్రీకాంత్ రాయ్ డిసైడ్ అవుతాడు. కానీ ఇక్కడే కథలో మలుపు వస్తుంది.

Advertisement

శ్రీకాంత్ రాయ్ భార్య, ఆ కాలపు స్టార్ హీరోయిన్ సుమిత్రా దేవి. జంషెడ్ ఖాన్‌తో ప్రేమలో పడి, అతనితో లక్నోకు పారిపోతుంది. ఈ విషయం తెలిసిన శ్రీకాంత్ రాయ్ తన నమ్మకస్థుడైన ల్యాబ్ అసిస్టెంట్ బినోద్ దాస్ ను లక్నో పంపి వారిని తిరిగి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఆ టైమ్ లో లక్నోలో దేశ విభజన అల్లర్లు భయంకరంగా ఉంటాయి. ఆ గందరగోళంలో జంషెడ్ ఖాన్ ఘోరంగా మరణిస్తాడు. ఈ ప్రమాదం వెనుక బినోద్ దాస్ పాత్ర కూడా ఉంటుంది. జంషెడ్ మరణంతో సినిమా ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

కానీ నటనపై అమితమైన మోహం ఉన్న బినోద్ దాస్ తనే ‘మదన్ కుమార్’గా మారి స్టూడియో హీరో అవుతాడు. ఆ తర్వాత అతని జీవితం గ్లామర్, ప్రజాదరణ, డబ్బుతో పాపులర్ గా స్టార్ గా టర్న్ తీసుకుంటుంది. ఇదే సమయంలో కరాచీ నుంచి శరణార్థిగా బొంబాయి వచ్చిన యువకుడు జయ్ ఖన్నా దర్శకుడు కావాలని కలలు కంటాడు. లక్నో నుంచి వచ్చిన సాంప్రదాయ నృత్యకారిణి నిలోఫర్ కూడా సినిమా ప్రపంచంలో స్టార్ అవ్వాలని ఆశతో ముంబై చేరుకుంటుంది. బినోద్, సుమిత్రా, జయ్, నిలోఫర్ ఈ నలుగురి జీవితాలు సినిమా అనే మాయా ప్రపంచంలో ఒకదానితో ఒకటి ముడిపడి పోతాయి.

Advertisement

బినోద్ స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ, జంషెడ్ మరణ రహస్యం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. సుమిత్రా దేవి తన ప్రియుడి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కుతుంది. అధికార దాహం, బ్లాక్‌మెయిలింగ్, రాజకీయ కుట్రలు, కోల్డ్ వార్ ప్రభావాలు రాయ్ టాకీస్ స్టూడియోను పతనం వైపు నడిపిస్తాయి. మరి చివరికి ఈ నలుగురి జీవితాలు ఎలాంటి టర్న్ తీసుకున్నాయి ? సుమిత్రా తన ప్రియుడిని చంపింది బినోదే అని తెలుసుకుందా ? బినోద్ కు ఎట్టకేలకు శిక్ష పడిందా లేదా ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

‘జూబ్లీ’ సిరీస్ ఎపిక్ డ్రామా. సినిమా ప్రేమికులు, చరిత్రపై ఆసక్తి ఉన్నవారు ఒక్కసారి చూస్తే మరచిపోలేరు. 2023లో విడుదలై అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో భారతీయ సినిమా చరిత్రలోని స్వర్ణయుగాన్ని అద్భుతంగా చూపించారు. 1940-50ల నేపథ్యంలో దేశ విభజన గాయాలు, సినిమా ప్రపంచం గురించి బాగా చూపించారు. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ సిరీస్ 10 ఎపిసోడ్‌లతో సాగుతుంది.

Read Also: ఇండియన్ మైథాలాజి మిక్సయ్యి ఉన్న హాలీవుడ్ హర్రర్ మూవీ… లాస్ట్ ట్విస్ట్ డోంట్ మిస్

Related News

అమ్మవారికి కట్టిన ముడుపులో రక్తం… అర్దరాత్రి నుంచే తెలుగు హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్..!

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రద్ధాదాస్ హారర్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

అభిమానిని చులకనగా చూసే స్టార్.. నిబ్బా నిబ్బీలకు కనెక్ట్ అయ్యే కొరియన్ కామెడీ డ్రామా ఇది

విషమిచ్చి చంపబోతే 300 ఏళ్ల ఫ్యూచర్లోకి వచ్చి పడే అమ్మాయి…

వరుస మర్డర్స్ తో పోలీసులను పరుగులు పెట్టించే సైకో… రియల్ సీరియల్ కిల్లర్ కథ

పెళ్లి కాకుండానే చచ్చి దెయ్యంగా… అబ్బాయిలు కన్పిస్తే వదలని ఆడ పిశాచి

Big Stories

Advertisement
×