E-Paper
Advertisement

Historical thriller OTT: ఉగ్రదాడిని లైవ్ లో చూపించే ఛానెల్… ఆకట్టుకుంటున్న స్పోర్ట్స్ థ్రిల్లర్

Historical thriller OTT: ఉగ్రదాడిని లైవ్ లో చూపించే ఛానెల్… ఆకట్టుకుంటున్న స్పోర్ట్స్ థ్రిల్లర్
Advertisement

Horror thriller OTT : ఒలింపిక్స్‌లో జరిగిన ఒక భయంకరమైన ఇన్సిడెంట్ తో వచ్చిన హాలీవుడ్ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ క్రీడాకారులను ఉగ్రవాదులు బంధించినప్పుడు జరిగే సంఘటనలతో ఈ స్టోరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఆ సంఘటనను ఒక టివి చానల్ ప్రపంచానికి ఎలా ప్రత్యక్ష ప్రసారం చేసిందనేది ఈ సినిమా కథ. ఈ సినిమా కోసం అప్పటి అసలు ఒలింపిక్ బ్రాడ్‌కాస్టింగ్ సెంటర్‌ను తలపించేలా సెట్‌ను కూడా నిర్మించారు. సినిమాలో వాడిన చాలా వీడియో క్లిప్పింగ్స్ 1972లో తీసిన అసలైన పాత ఫుటేజ్ కావడం విశేషం. అనేక అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ హిస్టారికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘సెప్టెంబర్ 5’ (September 5). ఇది 1972 నాటి మ్యూనిచ్ ఒలింపిక్స్ నేపథ్యంలో రూపొందింది. టిమ్ ఫెల్బామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పీటర్ సర్స్‌గార్డ్, జాన్ మగారో, బెన్ చాప్లిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2024 ఆగస్టులో వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఆ తరువాత 2024 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 97వ ఆస్కార్ అవార్డుల్లో ఈ చిత్రం బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే కి నామినేషన్ కూడా పొందింది. జర్మనీలో ఈ సినిమా ‘లోలా’ అవార్డుల కోసం 10 విభాగాల్లో నామినేట్ అయ్యి, ఉత్తమ చిత్రం సహా పలు అవార్డులు గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు, ఇజ్రాయెల్ అథ్లెట్లను ఉగ్రవాదులు బంధిస్తారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ABC స్పోర్ట్స్ టీవీ టీమ్, ఆటల గురించి కాకుండా ఈ ఉగ్రదాడి గురించి ప్రపంచానికి చెప్పాల్సి వస్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో, కేవలం ఒక చిన్న కంట్రోల్ రూమ్‌లో కూర్చుని ఆ టీమ్ పడ్డ టెన్షన్ ను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. స్పోర్ట్స్ రిపోర్టర్లు వార్తా విలేకరులుగా మారి, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ దృశ్యాలను లైవ్‌లో ఎలా చూపించారనేది చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అయితే ఈ కవరేజ్ ఇచ్చేటప్పుడు ఆ టీమ్ చాలా ఇబ్బందులు పడుతుంది. లైవ్‌లో చూపిస్తున్న విజువల్స్ వల్ల ఉగ్రవాదులకు ఏమైనా హెల్ప్ అవుతుందా? చనిపోతున్న వాళ్లను టీవీలో చూపించడం సరైనదేనా అనే ప్రశ్నలు వాళ్లను వేధిస్తాయి. రియలిస్టిక్ గా ఈ సీన్స్ చూపించినందుకు, ఈ సినిమాకి ఆస్కార్ నామినేషన్ కూడా దక్కింది.

Read Also : 100 కోట్లతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన గుజరాతీ సినిమా ఓటీటీలోకి… ఐయండిబిలో 8.6 రేటింగ్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×