E-Paper
Advertisement

ఏది కోరుకున్నా క్షణాల్లో ఇచ్చే గది…. బయటకు తీసుకెళ్తే మొత్తం బూడిదే

ఏది కోరుకున్నా క్షణాల్లో ఇచ్చే గది…. బయటకు తీసుకెళ్తే మొత్తం బూడిదే
Advertisement

Psychological Thriller: ఒక మ్యాజిక్ రూమ్… అందులోకి వెళ్లి ఏది కోరుకున్నా క్షణాల్లో మీ ముందుంటే ? డబ్బు, బంగారం, వజ్రాలు, విలాసవంతమైన జీవితం… మీకు కావాల్సిన ప్రతిదీ లభిస్తే ? మొదట అది వరంలా అనిపించినా, అదే కోరిక ఒకరోజు మీ జీవితాన్నే శాపంగా మార్చేస్తే ? ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన హాలీవుడ్ సైకాలాజికల్ మిస్టరీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘The Room’. తెలుగు డబ్బింగ్‌తో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఉంది. మరి ఈ సినిమా కథ ఏంటి ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

మాట్, కేట్ అనే దంపతులు నగర జీవితానికి దూరంగా ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకుని ఓ పాత విల్లాను కొంటారు. కొత్త ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించిన వారు, ఇంటిని శుభ్రం చేస్తుండగా గోడ వెనుక దాగి ఉన్న ఒక రహస్య గదిని కనిపెడతారు. మొదట ఆ గది మామూలుగానే కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికే అందులో ఒక విచిత్రమైన శక్తి ఉందని వారికి తెలుస్తుంది. ఆ గదిలో నిలబడి ఏది కోరుకున్నా అది క్షణాల్లో వారి ముందుకు ప్రత్యక్షమవుతుంది. డబ్బు, వజ్రాలు, అరుదైన కళాఖండాలు, ఖరీదైన వస్తువులు… ఏది అడిగినా ఆ గది వారికి అందిస్తుంది.

Advertisement

ఈ అద్భుతాన్ని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. కొంతకాలం విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. అయితే కేట్ మనసులో మాత్రం ఒక బాధ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా తల్లి కాలేకపోవడం ఆమెను తీవ్రంగా కలచివేస్తుంది. చివరకు ఒకరోజు అదే గదిలో నిలబడి తనకు ఒక బిడ్డ కావాలని కోరుకుంటుంది. ఆశ్చర్యకరంగా కొద్దిసేపటికే ఒక చిన్నారి వారి జీవితంలోకి వస్తాడు. మొదట అతడిని దేవుడు ఇచ్చిన వరంగా భావించి ప్రేమగా పెంచుకోవడం ప్రారంభిస్తారు. కానీ క్రమంగా ఆ చిన్నారి విషయంలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇదే సమయంలో ఆ గది ఇచ్చిన ప్రతి వస్తువుకూ ఒక పరిమితి ఉందని, ఇంటి బయటకు తీసుకెళ్తే అవి తమ అసలు రూపాన్ని కోల్పోతాయని దంపతులకు తెలుస్తుంది.

ఈ నిజం బయటపడిన తర్వాత వారి జీవితంలో భయం మొదలవుతుంది. ఆ చిన్నారి పెరుగుతున్న కొద్దీ అతని ప్రవర్తనలో ఊహించని మార్పులు కనిపిస్తాయి. ఇంటి చుట్టూ జరిగే వింత సంఘటనలు దంపతులను మరింత ఆందోళనకు గురి చేస్తాయి. ఒక కోరికతో ప్రారంభమైన ఆనందం క్రమంగా భయంగా, ఆ తర్వాత ప్రాణాపాయంగా మారుతుంది. బయటపడాలని ప్రయత్నించిన కొద్దీ ఆ ఇంటి వెనుక దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయట పడుతుంటాయి.

Advertisement

చివరికి ఆ గది అసలు రహస్యం ఏమిటి ? అది నిజంగా ఎలా పని చేస్తుంది ? ఆ చిన్నారి నిజంగా ఎవరు ? దంపతులు ఆ మాయా గది బంధం నుంచి బయట పడగలిగారా ? లేక అదే గది వారి జీవితాలకు శాశ్వత కారాగారంగా మారిందా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాపై ఒక లుక్కేయండి.

తెలుగు డబ్బింగ్ ఉందా ?

హాలీవుడ్ సైకాలాజికల్ మిస్టరీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ది రూమ్’లో ఓల్గా కురిలెంకో, కెవిన్ జాన్సెన్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఒక చిన్న కోరిక ఎంత పెద్ద విపత్తుకు దారి తీస్తుందో ఈ సినిమాలో ఉత్కంఠభరితంగా చూపించారు.

Read Also: చంబల్ అడవిలో బందిపోట్లకు చుక్కలు చూపించిన యువతి… చివరి అరగంట గూస్‌బంప్స్ గ్యారంటీ

Related News

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

అమ్మాయిలను చంపి పెళ్లి కూతుర్లలా అలంకరించే సైకో… సీటు అంచున కూర్చోబెట్టే ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ

Big Stories

Advertisement
×