E-Paper
Advertisement

Kevin Pietersen: లలిత్ మోడీ పెద్ద దుర్మార్గుడు, డ‌బ్బుల ఆశ‌చూపి, ఇంగ్లాండ్ కు దూరం చేశాడు !

Kevin Pietersen: లలిత్ మోడీ పెద్ద దుర్మార్గుడు, డ‌బ్బుల ఆశ‌చూపి, ఇంగ్లాండ్ కు దూరం చేశాడు !
Advertisement

Kevin Pietersen:  ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ( Kevin Pietersen ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఇంగ్లాండ్ జట్టులో అద్భుతంగా రాణిస్తూ.. ప్రపంచ దేశాలను ఏలాడు. అయితే అలాంటి కెవిన్ పీటర్సన్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో మెంటార్ , కామెంటేటర్ గా కొనసాగుతున్నారు. అయితే అలాంటి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, ఐపీఎల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లలిత్ మోడీ ఐపీఎల్ ప్రారంభంలోనే తనను చాలా ఇబ్బంది పెట్టాడని బాంబు పేల్చారు కెవిన్ పీటర్సన్. టెస్టులు మ్యాచులు ఆడకుండా ఐపిఎల్ ఆడాలని తనపై లలిత్ మోడీ అప్పట్లో ఒత్తిడి తెచ్చాడని ఆరోపణలు చేశారు. ఐపీఎల్ ఆడితే ఎక్కువ డబ్బులు వస్తాయని తనను ప్రేరేపించాడని కెవిన్ పీటర్సన్ షాకింగ్ నిజాలను బయటపెట్టారు.

Also Read: Trolls On Shubman Gill: ఓరి ద‌రిద్రుడా..రోహిత్ శ‌ర్మ సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నావా ? గిల్ పై దారుణంగా ట్రోల్స్‌

ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించాడు.. కెవిన్ పీటర్సన్ సంచలనం

Advertisement

ఐపీఎల్ సృష్టి కర్త లలిత్ మోడీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ జట్టును త్వరలోనే అతడు కొనుగోలు చేయబోతున్నాడని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సృష్టికర్త లలిత్ మోడీపై కెవిన్ పీటర్ సన్ షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఐపీఎల్ ప్రారంభంలోనే ఈ టోర్నమెంట్ లోకి రావాలని తనపై లలిత్ మోడీ బాగా ఒత్తిడి తెచ్చాడని క్లారిటీ ఇచ్చారు. టెస్టులు ఆడడం కంటే ఐపీఎల్ ఆడితే బెస్ట్ అని.. తనకు సూచించినట్లు తెలిపారు. రెండు టెస్టులు ఆడే స్థానంలో ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడితే కోట్లల్లో డబ్బులు వస్తాయని తనకు ఆశ చూపించినట్లు గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ వైపు వెళ్దామని అప్పట్లో డిసైడ్ అయినట్లు వెల్లడించారు. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కు తనకు గొడవ జరిగిందని గుర్తు చేశారు కెవిన్ పీటర్సన్. దీని అంతటికి కారణం లలిత్ మోడీ ( lalit modi ) అని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అన్ని క్రికెట్ బోర్డులు కూడా ఐపీఎల్ కు సహకరిస్తున్నాయని వివరించారు. ప్రతి ప్లేయర్ ఐపిఎల్ ఆడడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. కాగా మొన్నటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ గా ఉన్న కెవిన్ పీటర్సన్ రాజీనామా చేశారు. ఐపీఎల్ 2026 సందర్భంగా కామెంటేటర్ గా పని చేయబోతున్నారు కెవిన్ పీటర్సన్.

ఐపీఎల్ లోకి లిలిత్ మోడీ రీ- ఎంట్రీ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి సృష్టిక‌ర్త లిలిత్ మోడీ మ‌ళ్లీ రీ- ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడని స‌మాచారం అందుతోంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు లిలిత్ మోడీ సిద్ధం అయ్యార‌ని అంటున్నారు.

Also Read: Pakistan PM: గాజులు వేసుకోని ఇంట్లో కూర్చోండి.. బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిపై పాక్ ప్ర‌ధాని సీరియ‌స్ !

 

Related News

స్పాట్ ఫిక్సింగ్ లో అంద‌రూ న‌న్ను బ‌లి చేశారు..2013 సంఘ‌ట‌న‌పై శ్రీశాంత్ సంచ‌ల‌నం !

2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియాను గెలిపించేందుకు కుట్ర‌లు చేశారు!

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్, పాస్ పోర్టు లేదు..కానీ కట్ చేస్తే

Big Stories

Advertisement
×