E-Paper
Advertisement

క్షుద్ర పూజల వెనుక విస్తుపోయే నిజాలు… భయపెడుతున్న హారర్ సిరీస్

క్షుద్ర పూజల వెనుక విస్తుపోయే నిజాలు… భయపెడుతున్న హారర్ సిరీస్
Advertisement

Horror Thriller series : చేతబడి, క్షుద్ర పూజలతో ఒక హారర్ సిరీస్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 8 ఎపిసోడ్లతో కథ మొత్తం ఒక కల్ట్ చేసే వింత పూజలు, బలులతో ఒక రకమైన సస్పెన్స్‌ని, భయాన్ని కలిగిస్తుంది. రియల్ సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ కథను రాశారు. షూటింగ్ అంతా కెనడాలోని వాంకోవర్‌లో జరిగినా, ఆ ఊరి వాతావరణం, ఆ వింత కల్ట్ ఆచారాలు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే ఇది ఒక లిమిటెడ్ సిరీస్, రెండో సీజన్ ఉండదు. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన ఈ సిరీస్, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చుతుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2022 లో వచ్చిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘డెవిల్ ఇన్ ఒహియో’ (Devil in Ohio). ఈ సిరీస్ 2017లో డారియా పోలాటిన్ రాసిన నవల ఆధారంగా తీశారు. ఇందులో ఎమిలీ డెషానెల్ (డాక్టర్ సుసాన్‌గా), మడేలిన్ ఆర్థర్ (మే గా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో మెయిన్ రోల్ చేసిన ఎమిలీ డెషానెల్, ఆ వింత అమ్మాయిగా నటించిన మడేలిన్ ఆర్థర్ తమ నటనతో అదరగొట్టారు. ముఖ్యంగా ఆ అమ్మాయి చూపులు, ప్రవర్తన చూస్తుంటే నిజంగానే ఏదో దెయ్యం పట్టినట్టు భయం వేస్తుంది. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక రాత్రి మే అనే అమ్మాయి ఒంటి మీద గాయాలతో ఒక అడవి ప్రాంతంలో రోడ్డు మీద పడుతుంది. హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్ సుసాన్ ఆ అమ్మాయిని చూసి జాలిపడి, ఆమె గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. మే తన ఊరు, ఇంటి గురించి ఏమీ చెప్పదు, కేవలం భయంతో వణికిపోతూ ఉంటుంది. సుసాన్ తనని ఇంటికి తీసుకెళ్తుంది. సుసాన్ కి భర్తతో పాటు ముగ్గురు కూతుర్లు కూడా ఉంటారు. అయితే మే వచ్చినప్పటి నుండి ఆ ఇంట్లో వింత వింత సంఘటనలు మొదలవుతాయి. మే ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే, మే ఒక మారుమూల గ్రామం నుండి వచ్చింది. అక్కడ ఒక వింత కల్ట్ ఉంది, వాళ్లు దయ్యాన్ని పూజిస్తారు. ఆ ముఠా నాయకుడు మే వాళ్ల నాన్నే.  వాళ్ల నమ్మకం ప్రకారం, వాళ్ల దేవుడికి మేని బలి ఇవ్వాలి. మే ఆ బలి నుండి తప్పించుకోవడానికే పారిపోయి వస్తుంది.

కానీ ఆ ముఠా ఊరుకోకుండా డాక్టర్ సుసాన్ ఫ్యామిలీని వెంటాడటం మొదలుపెడతారు. వాళ్లు సుసాన్ ఇంటి బయట వింత గుర్తులు పెట్టడం, ఫోన్లు చేసి బెదిరించడం చేస్తారు. మరోవైపు ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆ ముఠా అరాచకాలను బయటపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ ముఠా మేని కిడ్నాప్ చేసి మళ్లీ వాళ్ల ఊరికి తీసుకెళ్లి బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తారు. సుసాన్ ప్రాణాలకు తెగించి ఆ ఊరికి మేని కాపాడటానికి వెళ్తుంది. కానీ అసలైన షాకింగ్ ట్విస్ట్ ఇప్పుడే వస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? మేని సుసాన్ కాపాడుతుందా ? సుసాన్ ఫ్యామిలీ ప్రమాదంలో పడుతుందా ? పోలీస్ ఆఫీసర్ దీనిని అడ్డుకుంటాడా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ప్రతి ఇంటి సమస్యను గొంతెత్తి చాటిన గొప్ప ప్రయత్నం… ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×