BigTV English

OTT Movie : ప్రధానమంత్రి భర్త మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే ఇంటర్నేషనల్ పొలిటికల్ థ్రిల్లర్

OTT Movie : ప్రధానమంత్రి భర్త మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే ఇంటర్నేషనల్ పొలిటికల్ థ్రిల్లర్

OTT Movie : రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్, గ్రిప్పింగ్ స్టోరీతో సీటెడ్జ్ థ్రిల్ ని ఇస్తోంది. ఇందులో బ్రిటిష్ ప్రధానమంత్రి ఫ్రెంచ్ అధ్యక్షురాల మధ్య ఒక అంతర్జాతీయ సమావేశం సందర్భంగా ఈ స్టోరీ మొదలవుతుంది. ఇక్కడ టెర్రరిస్టులు వీళ్ళ ఫ్యామిలీలను టార్గెట్ చేస్తాయి. ఆతరువాత స్టోరీ ఊహించని ట్విస్టులతో ముందుకు వెళ్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

అబిగైల్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి. NHS (నేషనల్ హెల్త్ సర్వీస్) కి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఎన్నికల్లో గెలుస్తుంది. ఈ దేశం ప్రస్తుతం క్యాన్సర్ మందుల కొరతతో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆమె ఈ సమస్యను పరిష్కరించడానికి ఫ్రెంచ్ అధ్యక్షురాలు వివియన్ టౌసైంట్ తో ఒక అంతర్జాతీయ సమావేశానికి సిద్ధమవుతుంది. అయితే ఆమె భర్త డాక్టర్ అలెక్స్ ఆండర్సన్, ఫ్రెంచ్ గయానాలో ఒక వైద్య మిషన్ సమయంలో కిడ్నాప్ కి గురవుతాడు. కిడ్నాపర్లు అబిగైల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. ఇది ఆమె రాజకీయ జీవితాన్ని, కుటుంబాన్ని ఒక సంక్షోభంలో పడేస్తుంది. అదే సమయంలో, వివియన్ కి కూడా ఒక బ్లాక్‌మెయిల్ వీడియోతో బెదిరింపులు వస్తాయి. ఈ ఇద్దరు నాయకులు తమ రాజకీయ ఆలోచనలతో పోటీపడుతూనే, ఈ కుట్ర వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడానికి కలిసి పనిచేయాల్సి వస్తుంది.


ఈ సమయంలో యుకె టెర్రర్ థ్రెట్ లెవెల్ క్రిటికల్ స్థాయికి చేరుకుంటుంది. అబిగైల్, వివియన్‌లను మరింత ఒత్తిడిలో ఉంటారు. అబిగైల్ తన క్యాబినెట్‌కు తెలియకుండా అలెక్స్‌ను రక్షించే మార్గాలను వెతుకుతుంది. అబిగైల్ టీనేజ్ కూతురు సిల్వీ కూడా కిడ్నాప్ అవుతుంది. ఈ సంక్షోభం ఒక రాజకీయ కుట్రగా మారుతుంది. చివరి ఎపిసోడ్‌లో, ఒక సేఫ్ హౌస్‌లో జరిగే నాటకీయ పరిణామంలో, సిల్వీ ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇది కుటుంబాన్ని రక్షించడానికి ఒక హింసాత్మక చర్యకు దారితీస్తుంది. సిల్వీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? కిడ్నాపర్ల నుంచి వీళ్ళు బయట పడతారా ? అబిగైల్ ప్రధానిగా కొనసాగుతుందా ? క్యాన్సర్ మందుల కొరత తగ్గుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

నెట్‌ఫ్లిక్స్‌లో

“హాస్టేజ్” (Hostage) బ్రిటిష్ పొలిటికల్ థ్రిల్లర్ మినీ సిరీస్. ఇది మాట్ చార్మన్ బినోక్యులర్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో, ఇసాబెల్ సీబ్, ఆమీ నీల్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో సురాన్ జోన్స్, జూలీ డెల్పీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఐదు ఎపిసోడ్‌లతో రూపొందింది. ఈ సిరీస్ 2025 ఆగస్టు 21న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 6.4/10 రేటింగ్ తో ఈ సిరీస్ ప్రేక్షకులకు చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తోంది.

Read Also : పోలీస్ స్టేషన్ లో ట్యూషన్… అమ్మాయితో అలాంటి పని… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : అందమైన అమ్మాయే ఈ దెయ్యం టార్గెట్… బెడ్ పై కూడా వదలకుండా… బతికుండగానే నరకం అంటే ఇదే

OTT Movie : ఆల్మోస్ట్ అన్ని దేశాలలో బ్యాన్ చేసిన డేంజరస్ మూవీ… గర్ల్స్, బాయ్స్ ని బంధించి ఇవేం పాడు పనులు సామీ ?

OTT Movie : డేంజరస్ ఐలాండ్… అడుగు పెడితే అబ్బాయిల కోసం పడి చస్తారు… సింగిల్ గా చూడాల్సిన ఏరోటిక్ థ్రిల్లర్

OTT Movie : కిరాయి సైనికుల చేతుల్లోకి ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులున్న స్పై థ్రిల్లర్

OTT Movie : ఆగస్టు లాస్ట్ వీక్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Big Stories

×