E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

అర్దరాత్రి అడవి మధ్యలో ఆగిపోయే ట్రెయిన్… ‘ట్రెయిన్ టు బుసాన్’లాంటి థ్రిల్లింగ్ హర్రర్ మూవీ

అర్దరాత్రి అడవి మధ్యలో ఆగిపోయే ట్రెయిన్… ‘ట్రెయిన్ టు బుసాన్’లాంటి థ్రిల్లింగ్ హర్రర్ మూవీ
Advertisement

Horror Thriller : మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సమయంలో రైలు ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ అలా ప్రయాణిస్తున్నప్పుడు సడన్ గా ఓ అర్ధరాత్రి పూట ట్రైన్ ఆగిపోతే ? అంతలోనే వింత జంతువులన్నీ వచ్చి రైలులో ఉన్న ప్రయాణికులపై దాడి చేస్తే ? గుండె జారిపోవడం ఖాయం. ఇలాంటి స్టోరీ లైన్ తో రూపొందిన ‘హౌల్ (Howl) అనే బ్రిటిష్ ఇండిపెండెంట్ హారర్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. 2017లో విడుదలైన ఈ మూవీలో రాత్రివేళ అడవి మధ్యలో ఆగిపోయిన రైలు, అందులోని ప్రయాణికులపై తోడేలు వంటి మనుషులు దాడి చేయడం, వాటి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడడానికి జనాలు చేసిన పోరాటం ఆసక్తికరంగా ఉంటాయి. మరి ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు? అనే వివరాల్లోకి వెళితే…

కథలోకి వెళ్తే…

లండన్లో జో అనే వ్యక్తి రైల్వే గార్డ్ గా పని చేస్తాడు. కానీ అతను తనకు ప్రమోషన్ రాలేదని డిసప్పాయింట్ అవుతాడు. పైగా అదే రోజు రాత్రి బయలుదేరే ఆల్ఫా ట్రాక్స్ నైట్ ట్రైన్ లో అతనికి డ్యూటీ కూడా వేస్తారు. ఆ రైలు ప్రయాణంలో వివిధ రకాల మనస్తత్వాలు ఉన్న కొద్ది మంది ప్రయాణికులు ఉంటారు. అలాగే జోతోపాటు కేటరింగ్ స్టాప్ అయిన ఎల్లెన్ కూడా ఆరోజు రాత్రి డ్యూటీలో ఉంటుంది. ఇలా వీళ్ళ పరిచయాలతో నెమ్మదిగా మూవీ స్టార్ట్ అవడంతో పాటు రైలు కూడా కదులుతుంది.

Advertisement

అలా ట్రైన్ స్పీడ్ ఊపందుండగా… అర్ధరాత్రి సమయంలో దట్టమైన అడవి గుండా రైలు ప్రయాణం మొదలు పెడుతుంది. కానీ మధ్యలో అకస్మాత్తుగా ఏదో జంతువును ఢీ కొట్టి రైలు ఆగిపోతుంది. దిగి చూస్తే అక్కడ ఒక జింక కనిపిస్తుంది. కానీ అలా చూడడానికి దిగిన రైలు డ్రైవర్ టోనీపై ఆ చీకట్లో ఒక వింత జంతువు దాడి చేసి చంపేస్తుంది. ఎంతసేపటికి డ్రైవర్ తిరిగి రాకపోవడంతో రైలులో ఉన్న జనాలు టెన్షన్ పడతారు. కాసేపటికి భయంకరమైన తోడేళ్లు వంటి మనుషులు రైలును చుట్టుముడతాయి. అంతేకాదు విండోస్ పగలగొట్టి లోపలికి రావడానికి ట్రై చేస్తాయి. అందులో భాగంగా కొంతమంది ప్రయాణికులను దారుణంగా చీల్చి చెండాడతాయి.

బతికున్న వాళ్లు మాత్రం రైలు తలుపులు కిటికీలు గట్టిగా మూసేసి లోపల దాక్కుంటారు. దాడిలో గాయపడిన ఒక ప్రయాణికురాలు తోడేలుగా మారడం మొదలు పెడుతుంది. అలా ప్రాణాలు కాపాడుకునే క్రమంలో మనుషుల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆర్డర్ అనే వ్యక్తి మాత్రం సెల్ఫిష్ గా ప్రవర్తిస్తూ తన ప్రాణం కోసం ఇతరులను ప్రమాదంలోకి పడేయాలని చూస్తాడు. ఇక మొదట్లో సాదాసీదా వ్యక్తుల కనిపించిన జో ప్రయాణికులను కాపాడడానికి తన ప్రాణాలను అడ్డుగా వేస్తాడు.

Advertisement

మిగిలిన ప్రయాణికులు రైలు స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అప్పటికే రైలు ఇంధనం లీక్ అవ్వడంతో రైలు మళ్లీ ఆగిపోతుంది. ఈ గ్యాప్ లో ఆ తోడేలు లాంటి మనుషుల గుంపు మళ్లీ రైలు పై దాడి చేస్తుంది. దీంతో ఎలెన్ తో పాటు మరికొందరు అడవిలోకి ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు పెడతారు. మరి ఈ ప్రమాదం నుంచి ఎవరైనా బయటపడ్డారా లేదా ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ మూవీ Prime Videoలో అందుబాటులో ఉంది.

Read Also : కంటికి కనిపించకుండా మనుషులను చంపే జీవులు.. క్లైమాక్స్ చూస్తే మతిపోద్ది!

Related News

చేయని నేరానికి జైలుకెళ్ళి ఎస్కేప్… చచ్చిన కొడుకుని వెతుక్కుంటూ… మైండ్ బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్

ఫోన్లో పని కానిచ్చే అబ్బాయిలు… కాల్ చేశారని సొళ్ళు కారిస్తే ఖతం… ఐశ్వర్య రాజేష్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

బొమ్మను చూసుకోవడానికి వచ్చే బేబీ సిట్టర్… ఊహించని ట్విస్ట్‌లతో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్

కోమాలో ఉన్నవాళ్ళంతా మిస్టరీ ప్రపంచంలోకి… మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్..!

మార్చురీ నుంచి అమ్మాయి మృతదేహం మాయం… క్లైమాక్స్ కేక భయ్యా

పసి పిల్లాడిని బలి తీసుకునే అల్మారా… ఒళ్లు గగుర్పొడిచే సీన్లున్న హర్రర్ మూవీ

Big Stories

×