Dark Crime Thriller: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చే క్రైమ్ థ్రిల్లర్ లను ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు చూసేందుకు. ఇప్పుడు అలాంటి సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ముంబై నగర నేర సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ పేరు Baby Do Die Do. నచికేత్ సామంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హుమా ఖురేషి, సాకిబ్ సలీమ్ కలిసి నిర్మించారు. పుట్టుకతోనే వినికిడి లోపం ఉండి, మాట్లాడలేని ఒక సాధారణ మహిళ, నగరంలోని ప్రమాదకరమైన నేరగాళ్లను అంతమొందించే కాంట్రాక్ట్ కిల్లర్‌గా ఎలా మారింది అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హుమా ఖురేషి కథానాయిక ‘బేబీ కర్మార్కర్’ పాత్రలో ఒక్క సంభాషణ కూడా లేకుండా కేవలం తన కళ్ల కదలికలు, ముఖ కవళికలతో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ మూవీ 2026 జూలై 3న థియేటర్లలో విడుదలై, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కినప్పటికీ, కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది. అయితే ఇప్పడు ఓటీటీ ఆడియన్స్ నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. డార్క్ క్రైమ్, సైకలాజికల్ ట్విస్టులు, రివెంజ్ స్టోరీలు ఇష్టపడేవారికి ‘Baby Do Die Do’ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా నిలుస్తోంది.
బేబీ కర్మార్కర్ (హుమా ఖురేషి) ముంబైలో తన తల్లితో కలిసి జీవించే చెవిటి, మాట్లాడలేని మహిళ. కానీ ఆమె జీవితంలో ఎవరికీ తెలియని మరో కోణం ఉంది. పీఎం జైన్ అనే వ్యక్తి దగ్గర కాంట్రాక్ట్ కిల్లర్‌గా పనిచేస్తూ డబ్బు కోసం టార్గెట్లను హతమారుస్తుంటుంది. అయితే బేబీ చేస్తున్న ఈ హత్యల వెనుక కేవలం డబ్బు మాత్రమే ఉండదు. చిన్నతనంలో తన కవల అక్కను కోల్పోయిన విషాదం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. చనిపోయిన అక్క గొంతు తనకు వినిపిస్తుందని నమ్మే బేబీ, ఆమెను చంపిన వ్యక్తిని ఎలాగైనా కనిపెట్టి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇదే సమయంలో పీఎం జైన్ కోసం చేసే ఓ మిషన్ బెడిసికొట్టడంతో బేబీ పోలీసులతో పాటు ముంబై క్రిమినల్ నెట్‌వర్క్‌కు కూడా టార్గెట్‌గా మారుతుంది. ఆమె ప్రేమలో పడిన సిద్దూ కూడా ఈ ప్రమాదకరమైన ప్రపంచంలోకి అనుకోకుండా లాగబడతాడు. బేబీ గతం, అక్క మరణం, ప్రస్తుత హత్యలు ఒకదానితో ఒకటి ముడిపడటంతో అసలు నిజం కోసం ఆమె ప్రయాణం మరింత డేంజరస్‌గా మారుతుంది. మరి బేబీ అసలు ఎవరిని చంపుతోంది? చనిపోయిన అక్క గొంతు ఆమెకు ఎందుకు వినిపిస్తోంది? 20 ఏళ్లుగా ఆమె వెతుకుతున్న హంతకుడు ఎవరు? అనే వివరాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
నచికేత్ సమంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హ్యూమా ఖురేషీ, సికందర్ ఖేర్, చంకీ పాండే, సీమా పాహ్వా, రాచిత్ సింగ్, విద్యా మాల్వాడే తదితరులు నటించారు. సినిమా నిడివి సుమారు 2 గంటల 5 నిమిషాలు. ఇది హిందీ క్రైమ్, యాక్షన్, మిస్టరీ, డార్క్ కామెడీ థ్రిల్లర్. జూలై 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 23 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఇది అందుబాటులో ఉంది.
Read Also: 200 ఏళ్ల వెనక్కి వెళ్లే ప్రేమికులు… అడుగడుగునా డేంజరస్ ట్విస్టులు… టైమ్-ట్రావెల్ విజువల్ వండర్