E-Paper
Advertisement

కాంగ్రెస్ వస్తే కరెంటు రాదా? BRS అబద్ధాలపై అద్దంకి దయాకర్ ఫైర్!

కాంగ్రెస్ వస్తే కరెంటు రాదా? BRS అబద్ధాలపై అద్దంకి దయాకర్ ఫైర్!
Advertisement

Addanki Dayakar: ఎల్ నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వచ్చి, అనేక ప్రాంతాల్లో తీవ్ర విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్లి చూస్తే అక్కడి కరెంట్ కష్టాలు ఏంటో స్పష్టంగా అర్థమవుతాయి. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎంత ఖర్చైనా సరే విద్యుత్‌ను కొనుగోలు చేసి సక్రమంగా సరఫరా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.

కరెంట్‌కు అసలైన చిరునామా కాంగ్రెసే

Advertisement

దేశానికి కరెంటును పరిచయం చేయడమే కాకుండా.. విద్యుత్ కాంతులతో వెలిగిపోవడానికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీయే. రాష్ట్రంలో పవర్ ప్లాంట్లను నెలకొల్పిన ఘనత మాదే. చరిత్రలో మొదటిసారిగా రైతులకు ఉచిత విద్యుత్ అందించిన చరిత్ర, ఎస్సీ-ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది. మధ్యలో వచ్చి మేమే కరెంట్ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటే ప్రజలు నమ్మరు.

బీఆర్ఎస్ అక్రమాలు, అవినీతి పాలన

Advertisement

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన వ్యవహారాలు నేడు పెద్ద ప్రతిబంధకంగా మారాయి. అధిక ధరలకు కరెంట్ కొనుగోలు చేసి డిస్కంలను తీవ్ర నష్టాల్లోకి నెట్టారు. విద్యుత్ శాఖను అవినీతికి నిలయంగా మార్చడమే కాక, ఉచిత విద్యుత్ పొందే ఎస్సీ, ఎస్టీ కాలనీల నుంచి కూడా ఛార్జీలు వసూలు చేశారు.

విష ప్రచారాన్ని నమ్మవద్దు

అధికారం కోల్పోయామనే నిరాశలో ‘పవర్ పోయి పరేషాన’లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ‘కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదు’ అని ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లు తెరిచి చూడాలి. బీఆర్ఎస్ చేస్తోన్ విష ప్రచారాలను ప్రజలు ఎంతమాత్రం నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

Also Read: మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం!

Tags

Related News

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు!

బిగ్ టీవీ ఎఫెక్ట్.. మెట్రో పిల్లర్ల అక్రమ తవ్వకాలపై కేసు నమోదు!

మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం!

తెలంగాణలో ప్రభుత్వ దవాఖాన్ల మెయింటెనెన్స్ ఫెయిల్.. దానికిదే సాక్షం?

మీసేవ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇక ఇంటికే వస్తారు! ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

జవహర్‌నగర్‌లో జోరుగా జూదం ఆట.. స్కెచ్చేసిమరీ పట్టుకున్న ఎస్ఐ!

కొడంగల్‌లో కొత్త పథకం సూపర్ సక్సెస్.. ఇక రాష్ట్రవ్యాపంగా అమలుకు సిద్దం!

Big Stories

Advertisement
×