E-Paper
Advertisement

వైర్డ్ ఇయర్‌ఫోన్లు, MP3 ప్లేయర్లు మళ్లీ ట్రెండ్‌లోకి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!

వైర్డ్ ఇయర్‌ఫోన్లు, MP3 ప్లేయర్లు మళ్లీ ట్రెండ్‌లోకి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
Advertisement

Retro tech trend: ఈ రోజుల్లో మనం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే .. వరకు స్మార్ట్‌ ఫోన్ స్క్రీన్‌నే చూస్తూ గడుపుతున్నాం. ప్రతి క్షణం చూసినా ఇన్‌స్టా రీల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, ఈమెయిల్స్ రూపంలో నోటిఫికేషన్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ నిరంతర డిజిటల్ హడావిడి కారణంగా యువత తీవ్రమైన మానసిక ఒత్తిడిని, ఫోన్ అడిక్షన్‌ను ఎదుర్కొంటోంది. ఈ టెక్ సతమతానికి విసిగిపోయిన జెన్-జీ , మిలీనియల్స్ ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. అదే ‘డిజిటల్ మినిమలిజం’ లేదా పాతకాలపు గాడ్జెట్లకు మళ్లీ స్వాగతం చెప్పడం!

1. నోటిఫికేషన్ల గోల లేని ప్రశాంతత:

ఒకప్పుడు ప్రతి ఒక్కరి జేబులో కనిపించే MP3 ప్లేయర్లు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాయి. స్మార్ట్‌ ఫోన్‌లో పాటలు వింటున్నప్పుడు మధ్యలో వచ్చే వాట్సాప్ మెసేజ్ ట్యూన్‌లు, కాల్స్ లేదా సోషల్ మీడియా పాప్-అప్‌లు మన ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. కానీ .. కేవలం పాటలు మాత్రమే వినడానికి వీలుగా ఉండే డెడికేటెడ్ MP3 ప్లేయర్లలో ఈ డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కేవలం మ్యూజిక్‌లో మాత్రమే లీనమైపోయే ప్రశాంతతను ఇవి అందిస్తున్నాయి. అందుకే యూత్ వీటిని మళ్లీ విపరీతంగా కొనుగోలు చేస్తోంది.

2. వైర్డ్ ఇయర్‌ఫోన్ల క్రేజ్:

Advertisement

బ్లూటూత్ ఇయర్‌ బడ్స్‌ను ఎప్పుడూ ఛార్జ్ చేయాలి, ఒకవేళ ఎక్కడైనా పోగొట్టుకుంటే కంగారు పడాలి. పైగా రేడియేషన్ భయాలు కూడా ఎక్కువే. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ ‘వైర్డ్ ఇయర్‌ ఫోన్లు’ మళ్లీ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారుతున్నాయి. చెవుల్లో ఇయర్‌ ఫోన్లు పెట్టుకుని, వైర్‌ను ఫోన్‌కు లేదా MP3 ప్లేయర్‌కు కనెక్ట్ చేసుకుని తిరగడం ఇప్పుడు ఒక ట్రెండీ స్టైల్‌గా మారిపోయింది. అంతేకాకుండా.. వైర్డ్ ఇయర్‌ ఫోన్లు ఇన్‌స్టంట్ ఆడియో కనెక్షన్‌ను ఇస్తాయి. ఎలాంటి లాగ్ లేదా కనెక్షన్ డ్రాప్ సమస్యలు ఉండవు.

3. రెట్రో వైబ్స్, నాస్టాల్జియా:

కొత్త తరం యూత్‌కు 90ల నాటి వింటేజ్ , రెట్రో స్టైల్స్ అంటే విపరీతమైన ఇష్టం. అందుకే క్యాసెట్ ప్లేయర్లు, చిన్న చిన్న MP3 డివైజ్‌లు, పాత డిజైన్ ఉన్న హెడ్‌ఫోన్‌లను వాడటం ఒక కూల్ ట్రెండ్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం అవసరం కోసం మాత్రమే కాకుండా.. ఒక యూనిక్ లైఫ్‌స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారింది.

Advertisement

Also Read: ఫోన్‌లో 2 సిమ్‌లు వాడితే బ్యాటరీ త్వరగా పాడవుతుందా? అసలు నిజమిదే!

4. మెంటల్ హెల్త్, ‘డిజిటల్ డిటాక్స్’:

ప్రపంచవ్యాప్తంగా ‘డిజిటల్ డిటాక్స్ అనే పదం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రోజంతా.. స్క్రీన్ చూసి అలసిపోయిన కళ్లకు, మెదడుకు విశ్రాంతి ఇవ్వడానికి యువత ఈ పాత పద్ధతులను ఆశ్రయిస్తోంది. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేని ఆఫ్‌ లైన్ మ్యూజిక్ డివైజ్‌లను వాడటం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుందని టెక్ నిపుణులు సైతం చెబుతున్నారు.

మొత్తానికి చూస్తే.. టెక్నాలజీ ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నప్పటికీ, కొన్ని సార్లు ఆ వేగమే మనకు అలసటను తెచ్చిపెడుతుంది. ఆ అలసట నుంచే ఈ పాత గాడ్జెట్ల పునరుజ్జీవనం పుట్టుకొచ్చింది. MP3 ప్లేయర్లు , వైర్డ్ ఇయర్‌ఫోన్లు కేవలం వస్తువులు మాత్రమే కాదు, నేటి యూత్ కోరుకుంటున్న ప్రశాంతమైన, నిశ్శబ్దమైన డిజిటల్ విరామానికి అద్దం పడుతున్నాయి.

Related News

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

పెన్ డ్రైవ్‌పై ఈ రంధ్రాల సీక్రెట్ తెలుసా? దీనివల్ల ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు తెలియలేదే!

ఫోన్‌లో 2 సిమ్‌లు వాడితే బ్యాటరీ త్వరగా పాడవుతుందా? అసలు నిజమిదే!

శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? అంతరిక్షం నుంచి మీ ఇంటికి నెట్‌వర్క్ ఎలా వస్తుంది?

ఎల్జీ కొత్త వాషింగ్ మిషన్లు.. బుర్ర బద్దలయ్యే క్రేజీ ఫీచర్లు.. మార్కెట్‌ షేక్ అవ్వడం పక్కా!

అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్ సేల్..వస్తువులు కొనడానికి ఏది బెస్ట్?

ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అందే అద్భుతమైన లాభాలు!

Big Stories

Advertisement
×