E-Paper
Advertisement

ఒక భార్య, ఇద్దరు భర్తలు.. చివరికి ఆమె కోసం పెద్ద డాన్‌తో పోరాటం, భలే కామెడీ మామ

ఒక భార్య, ఇద్దరు భర్తలు.. చివరికి ఆమె కోసం పెద్ద డాన్‌తో పోరాటం, భలే కామెడీ మామ
Advertisement

Korean Action Comedy : కొరియన్ సినిమాలంటే పడి చచ్చే భారతీయుల సంఖ్య భారీగానే ఉంటుంది. అందులోనూ కొరియన్ కామెడీ క్రైం థ్రిల్లర్ అంటే మరింత స్పెషల్ గా ఉంటాయి. మీకు కూడా ఇలాంటి సినిమాలు ఇష్టమా ? కడుపుబ్బా నవ్వుకోవడంతో పాటు ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఓ మంచి మూవీ కోసం వెతుకుతున్నారా ? అయితే ఈరోజు ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఈ సినిమా పేరు ‘హస్బెండ్స్ ఇన్ యాక్షన్’ (Husbands in Action). 2026 జూన్ 19న విడుదలైన పాపులర్ సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ సినిమా. పార్క్ గ్యూ టే దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకే మహిళ కోసం ఆమె మాజీ భర్తతో పాటు ప్రస్తుత భర్త కూడా ఫైట్ చేయడం అనే క్రేజీ రెస్క్యూ ఆపరేషన్ గా ఈ సినిమా కథ నడుస్తుంది.

కథలోకి వెళ్తే…

డ్రగ్స్ కంట్రోల్ విభాగంలో పని చేసే సిన్సియర్ పోలీస్ డిటెక్టివ్ చుంగ్ సిక్. కానీ ఇతనికి కోపం ఎక్కువ. ఈ స్వభావం వలన అతని భార్య షి-నే డివోర్స్ ఇస్తుంది. ఇక ఆమె పెళ్లి చేసుకున్న ప్రస్తుత భర్త మీన్ సియోక్. ఇతను చాలా సైలెంట్ గా పద్ధతిగా ఉంటాడు. ఇద్దరు భర్తలు తమ కూతురు స్కూల్ ఫంక్షన్ లో ఫస్ట్ టైం కలుసుకుంటారు. అందులో ఒకరు కన్న తండ్రి అయితే, మరొకరు పెంపుడు తండ్రి…. అలా మాజీ భర్త ప్రస్తుత ఇద్దరి మధ్య విపరీతమైన ఈగో వార్ నడుస్తుంది.

Advertisement

వీరిద్దరి మధ్య గొడవలు నడుస్తున్న సమయంలోనే ఒక షాకింగ్ సంఘటన జరుగుతుంది. డిటెక్టివ్ పట్టుకోవాలని చూస్తున్నా ఒక ప్రమాదకరమైన అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ అతనిపై పగ తీర్చుకోవడానికి, అతని మాజీ భార్య అయిన షిను కిడ్నాప్ చేస్తారు. ఒకవేళ పోలీసులకు దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందినా ఆమెను చంపేస్తామని హెచ్చరిస్తారు. తన భార్యను కాపాడుకోవడానికి ప్రస్తుత భర్త విలన్లకు అడిగినంత డబ్బు ఇవ్వడానికి రెడీ అవుతాడు. కానీ డిటెక్టివ్ మాత్రం పోలీస్ పద్ధతిలోనే వెళ్లాలని ఆలోచిస్తాడు. చివరికి హెచ్చరిక వల్ల అధికారికంగా కాకుండా సొంతంగానే రంగంలోకి దిగాలని ఇద్దరు భర్తలు కలిసి నిర్ణయించుకుంటారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడకపోయినా, తాము ప్రాణంగా ప్రేమించే ఒకే మహిళను రక్షించడం కోసం విభేదాలు అన్ని పక్కన పెట్టి పని చేస్తారు.

ఈ క్రమంలో వచ్చే కామెడీ సీన్స్ సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. డిటెక్టివ్ రఫ్ ప్లానింగ్ తో వెళ్తుంటే, మిన్ మాత్రం తన అమాయకత్వంతో ఆ ప్లాన్స్ అన్నిటిని చెడగొడతాడు. ఇక ఆ విలన్ల ప్లేస్ ను కనిపెట్టడానికి వీళ్లు చేసే కార్ చేజింగ్, గన్ ఫైట్, కిడ్నాపర్ల లొకేషన్ ను కనిపెట్టే క్రమంలో వచ్చే సీన్లు ఆసాంతం నవ్వులు పూయిస్తాయి. చివరికి విలన్ల ప్రధాన స్థావరానికి చేరుకున్న ఆ ఇద్దరు భర్తలు కలిసి వాళ్ళను ఎలా చితక్కొట్టారు ? ఇద్దరు ప్రాణాలకు తెగించి చేసిన ఆపరేషన్ సక్సెస్ అయిందా? తమ భార్యను సేఫ్ గా అక్కడి నుంచి బయటకు తీసుకురాగలిగారా ? అన్నది స్టోరీ.

Advertisement

Read Also ; ఫోన్లో పని కానిచ్చే అబ్బాయిలు… కాల్ చేశారని సొళ్ళు కారిస్తే ఖతం… ఐశ్వర్య రాజేష్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×