E-Paper
Advertisement

రిహాబ్‌కు తీసుకెళ్లాల్సిన కుర్రాడితో చిక్కుల్లో… ఇద్దరు డ్రైవర్ల జర్నీ ఫుల్ రచ్చ… కామెడీ ఎంటర్‌టైనర్

రిహాబ్‌కు తీసుకెళ్లాల్సిన కుర్రాడితో చిక్కుల్లో… ఇద్దరు డ్రైవర్ల జర్నీ ఫుల్ రచ్చ… కామెడీ ఎంటర్‌టైనర్
Advertisement

Dark Comedy Crime Movie: ఒక కుర్రాడిని రిహాబ్ సెంటర్‌కు తీసుకెళ్లడం పెద్ద కష్టమైన పని కాదు. కారు ఎక్కించాలి.. అక్కడికి తీసుకెళ్లాలి.. అప్పగించాలి.. అంతే. కానీ ఆ కుర్రాడు డబ్బున్న కుటుంబానికి చెందినవాడై, అతనితో వెళ్తున్న ఇద్దరు డ్రైవర్లు ఇప్పటికే జీవితంలో బాగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్లైతే? ఆ చిన్న ప్రయాణం ఒక్కసారిగా డ్రగ్స్, క్రైమ్, ప్రమాదాలు, గందరగోళంతో నిండిపోతే? ఇదే పాయింట్‌ను డార్క్ కామెడీ టచ్‌తో చూపించే సినిమా ఇడియట్స్ (Idiots). ప్రస్తుతం ఓటీటీలో ఈ మూవీ ట్రెండింగ్ లో కూడా ఉంది. మరి ఇది ఏ ఓటీటీలో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథలో డేవ్ (Dave), ఓ’షియా (O’Shea) ఇద్దరు డ్రైవర్లు తమ జీవితంలో పెద్దగా సక్సెస్ అయిన వాళ్లు కాదు. వాళ్లకు అప్పగించబడే పని కూడా చాలా గొప్పదేమీ కాదు. డబ్బున్న కుటుంబానికి చెందిన యువకుడు షెరిడన్ ను రిహాబ్‌కు తీసుకెళ్లాలి. బయటకు చూస్తే ఇది ఒక ట్రాన్స్‌పోర్ట్ జాబ్‌లానే కనిపిస్తుంది. కానీ కారులోకి ఆ యువకుడు ఎక్కిన తర్వాత పరిస్థితి క్రమంగా అదుపు తప్పుతుంది.

Advertisement

షెరిడన్  జీవితం ఇప్పటికే డ్రగ్స్, కుటుంబ సమస్యలు, నియంత్రణలేని ప్రవర్తనతో గందరగోళంగా ఉంది. రిహాబ్‌కు వెళ్లాల్సిన వ్యక్తి ఆ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగనివ్వకుండా తనతో పాటు డ్రైవర్లను కూడా సమస్యల్లోకి లాగుతాడు. మొదట డ్రైవర్లు తమ పని త్వరగా పూర్తి చేసి డబ్బు తీసుకుని వెళ్లిపోదామని అనుకుంటారు. కానీ కొన్ని సంఘటనలు వాళ్ల ప్లాన్‌ను పూర్తిగా మార్చేస్తాయి.

ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ డ్రగ్స్, అనుమానాస్పద వ్యక్తులు, నేరపూరిత పరిస్థితులు ఎదురవుతాయి. ఏది నిజం? ఎవరు ఎవరిని ఉపయోగిస్తున్నారు? అనే ప్రశ్నలు మొదలవుతాయి. ముఖ్యంగా తమ ప్రయాణికుడి వల్లే తాము ఇరుక్కున్నామని ఇద్దరు డ్రైవర్లు గ్రహించినా అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది. చివరికి కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది. చివరికి ఈ ఇద్దరు డ్రైవర్లు తమ ప్రయాణికుడిని సురక్షితంగా రిహాబ్‌కు తీసుకెళ్లగలరా? లేక ఆ ప్రయాణం వాళ్లనే క్రైమ్ ప్రపంచంలోకి నెట్టేస్తుందా?  అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

ఎక్కడ చూడచ్చు అంటే 

Advertisement

ఇడియట్స్ (Idiots) మాకాన్ బ్లేర్ దర్శకత్వంలో రూపొందిన ఇంగ్లీష్ డార్క్ కామెడీ క్రైమ్ మూవీ. ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 22 నుంచి Prime Videoలో డిజిటల్ రిలీజ్‌కు వచ్చింది.

Read Also: పగతో రగిలిపోయే గ్యాంగ్‌స్టర్… రాత్రికి రాత్రే ఊరంతా ఊచకోత… మెంటల్ మాస్ రివేంజ్

Related News

కొండల్లోని అద్భుతమైన మాయా చెట్టు… కలల ప్రపంచంలోకి తీసుకెళ్లే విజువల్ ఫ్యాంటసీ అడ్వెంచర్

నగరాన్ని కాపాడిన సూపర్‌ హీరోనే నిందితుడు… మూడేళ్ల తర్వాత సరదా తీర్చేసిన యాక్షన్ థ్రిల్లర్

సేఫ్‌ లు ఇలా కూడా తెరుస్తారా ? పియానో ట్యూనర్‌ టాలెంట్ కు పిచ్చెక్కాల్సిందే… మైండ్ బ్లాకింగ్ థ్రిల్లర్

200 ఏళ్ల వెనక్కి వెళ్లే ప్రేమికులు… అడుగడుగునా డేంజరస్ ట్విస్టులు… టైమ్-ట్రావెల్ విజువల్ వండర్

చీకట్లో విరుచుకుపడ్డ వింత రాక్షసులు… 500 ఏళ్ల నాటి నిజం బట్టబయలు… అర్ధరాత్రి ఆ అడవిలో ఏం జరిగింది ?

మందు బాటిల్ వల్ల మొదలైన గొడవ… చివరికి క్రైమ్‌లో చిక్కుకున్న స్నేహితులు… ఫుల్ నవ్వులు

వైరస్ తో దేశాన్నే తుడిచిపెట్టే డేంజరస్ ప్లాన్… హై వోల్టేజ్ మైండ్ బ్లోయింగ్ మిషన్

Big Stories

Advertisement
×