Psychological Thriller: యాక్షన్, ఫైట్లు ఉండే మామూలు సినిమాలు చాలానే చూసి ఉంటారు. కానీ మైండ్ గేమ్స్‌తో సాగే ఒక సీరియస్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని చూస్తుంటే ఆ వచ్చే మాజానే వేరు. The Fence మూవీ చూస్తే ఆ క్రేజీ ఫీలింగ్ కలగక మానదు. ఈ కథ అంతా ఆఫ్రికాలోని ఒక కంపెనీ సైట్‌లో ఒకే ఒక్క రాత్రిలో జరుగుతుంది. అక్కడ పని చేసే ఒక లోకల్ కుర్రాడు చనిపోతే, కంపెనీ మేనేజర్ గొడవ కాకుండా ఉండాలని ఆ శవాన్ని దాచేస్తాడు. ఆ తరువాత కథ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. పెద్దగా ఫైట్లు, హడావుడి లేకుండా ఇందులో తెల్లజాతీయుల అహంకారాన్ని, కంపెనీల అన్యాయాలను చాలా రియలిస్టిక్ గా చూపించారు.
హార్న్ ఓ నిర్మాణ ప్రాజెక్ట్‌కు ఫోర్‌మన్‌గా పనిచేస్తుంటాడు. అతనితో పాటు యువ ఇంజినీర్ కాల్ కూడా అక్కడే ఉంటాడు. హార్న్ భార్య లియోన్ అదే రాత్రి వారి వద్దకు వస్తుంది. అంతా ప్రశాంతంగా సాగుతుందనుకున్న సమయంలో అల్బూరీ అనే వ్యక్తి వారి గేటు దగ్గరకు వస్తాడు. అతడి సోదరుడు నౌఫియా అదే నిర్మాణ ప్రదేశంలో జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. తన సోదరుడి మృతదేహాన్ని వెంటనే అప్పగించాలని అల్బూరీ కోరుతాడు. కానీ హార్న్ మాత్రం డబ్బు ఇస్తానని, ఉదయం వచ్చి తీసుకెళ్లమని చెప్పి అతడిని పంపించే ప్రయత్నం చేస్తాడు. అయితే అల్బూరీ వెనక్కి తగ్గడు. రాత్రంతా అక్కడే ఉండి తన డిమాండ్‌ను కొనసాగిస్తాడు. అతడి పట్టుదల పెరిగే కొద్దీ హార్న్ దాచిపెట్టాలనుకుంటున్న విషయాలు బయటపడే పరిస్థితి వస్తుంది. లియోన్ కూడా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉండటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. చివరికి ఆ మృతదేహం వెనుక ఉన్న అసలు నిజం భయపెట్టే మిస్టరీగా మారుతుంది. మరి ఆ మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను చూడాల్సిందే.
క్లైర్ డెనిస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇసాక్ డి బాంకోలే, మాట్ డిల్లన్, మియా మెకెన్నా-బ్రూస్, టామ్ బ్లైత్ తదితరులు నటించారు. సినిమా నిడివి సుమారు 1 గంట 48 నిమిషాలు ఉంటుంది. ‘The Fence’ 2026 ఆగస్టు 21 నుంచి Prime Videoలో స్ట్రీమింగ్‌లో ఉంది. ఫాస్ట్ యాక్షన్ కంటే నెమ్మదిగా పెరిగే టెన్షన్, రహస్యాలు, మిస్టరీ డ్రామాలు ఇష్టపడేవారికి ‘The Fence’ భిన్నమైన అనుభూతిని ఇస్తుంది.