OTT Movie : యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను లైక్ చేసే వాళ్ళు, ఈ తమిళ సినిమాను ఒక్కసారి చూడొచ్చు. ఈసినిమా 2018 కన్నడ చిత్రం టగరుకి రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమా చెన్నై నగరంలోని గ్యాంగ్‌స్టర్‌లతో ఒక పోలీసు అధికారి చేసే పోరాటాన్ని చూపిస్తుంది. విక్రమ్ ప్రభు నటన ,ఉత్కంఠభరిత యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘రైడ్’ (Raid) ఒక తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇది కార్తీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య, అనంతికా సనీల్‌కుమార్, రిషి రిత్విక్, సౌందరరాజా, వేలు ప్రభాకరన్, హరీష్ పెరడి నటించారు. 125 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2023న నవంబర్ 10 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 2024 జనవరి నుంచి అందుబాటులోకి వచ్చింది.
కథలోకి వెళ్తే
చెన్నైలో ఇన్‌స్పెక్టర్ ప్రభాకరన్, నగరంలోని గ్యాంగ్‌స్టర్‌లను అంతం చేయాలనే లక్ష్యంతో పని చేస్తాడు. నగర మార్కెట్‌ను నియంత్రించే డాన్ అంకుల్, అలియాస్ నారాయణస్వామి, అతని అనుచరులైన డాలి, చిట్టిలతో ప్రభాకరన్ ఆట మొదలుపెడతాడు. ఒక పోలీసు ఆపరేషన్ సమయంలో, ప్రభాకరన్ డాలి సోదరుడు కాక్‌రోచ్ ను ఎన్‌కౌంటర్‌లో చంపుతాడు. దీనితో డాలి, చిట్టి కోపంతో రగిలిపోతారు. ప్రభాకరన్ పై ఉదయం జాగింగ్ సమయంలో దాడి చేస్తారు. ఆ దాడిలో ప్రభాకరన్ కు కాబోయే భార్య వెన్బా మరణిస్తుంది. వెన్బా మరణంతో దిగ్భ్రాంతికి గురైన ప్రభాకరన్, డాలి అనుచరులను ఒక్కొక్కరినీ లక్ష్యంగా చేసుకొని చంపడం ప్రారంభిస్తాడు. ఇందులో చిట్టి కూడా ఉంటాడు.
Read Also : 800 ఏళ్లుగా ప్రాణాలతో… చావనివ్వని శాపం… గ్రిప్పింగ్ స్టోరీ, అదిరిపోయే ఫాంటసీ థ్రిల్లర్
మరోవైపు ప్రభాకరన్‌కు వెన్బా సోదరి వెన్మతి గోవా పోలీసుల రైడ్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. అతను ఆమెను రక్షిస్తాడు. ఇక వీళ్ళ లవ్ ట్రాక్ మొదలవుతుంది. ఈ సమయంలో డాలి, ప్రభాకరన్‌ను చంపడానికి ఒక హిట్‌మ్యాన్‌ను పంపిస్తాడు. కానీ ప్రభాకరన్ ఆ హిట్‌మ్యాన్‌ను చంపి, డాలి పుట్టినరోజు వేడుకలోకి చొరబడతాడు. అక్కడ ప్రభాకరన్ కి, డాలికి ఫైట్ జరుగుతుంది. ఇందులో ప్రభాకరన్ డాలిని చంపి, వెన్బా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు. కథ ముగింపులో, ప్రభాకరన్ మరొక కేసును పరిష్కరించడానికి వెళ్తాడు.