OTT Movie : కావాలంటే భవిష్యత్తును ముందే చూడవచ్చు లేదా గతంలోకి కూడా వెళ్ళవచ్చు… ఇలాంటి టైమ్ ట్రావెల్ కథతో ఎన్నో సినిమాలు ఇప్పటిదాకా తెరపైకి వచ్చాయి. కానీ ఒక అమెరికన్ సైన్స్-ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీలో మాత్రం వింత రోగం కారణంగా భర్త తన భార్యను గతంలోకి వెళ్ళి, చిన్నప్పటి నుంచే తోడూ నీడగా ఉంటాడు. చివరికి ఏమవుతుంది అన్నది స్టోరీలో తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే…
హెన్రీ డిటాంబుల్ (ఎరిక్ బానా) అనే లైబ్రేరియన్, క్లేర్ ఆబ్‌షైర్ (రాచెల్ మెక్‌అడమ్స్) అనే ఆర్టిస్ట్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. హెన్రీకి ఒక అరుదైన జన్యు రుగ్మత ఉంటుంది. దీని వల్ల అతను తనపై తాను కంట్రోల్ కోల్పోయి, సమయం సందర్భం లేకుండా టైమ్ ట్రావెల్ చేస్తాడు. ఒత్తిడిలో లేదా యాదృచ్ఛికంగా గతం లేదా భవిష్యత్తులోని వివిధ సమయాలకు వెళ్తాడు. ఈ టైమ్ ట్రావెల్ అతని జీవితాన్ని గందరగోళంగా మారుస్తుంది.
ఎందుకంటే అతను ఎప్పుడు, ఎక్కడ ల్యాండ్ అవుతాడో అతనికే తెలియదు. అలా ల్యాండ్ అయినప్పుడల్లా బట్టలు లేకుండా కనిపిస్తాడు. ఇక క్లేర్, హెన్రీ ప్రేమ కథ చిన్నతనంలోనే ప్రారంభమవుతుంది. హెన్రీ టైమ్ ట్రావెల్ చేసి క్లేర్‌ను ఆమె బాల్యంలో కలుస్తాడు. ఆమెకు భవిష్యత్తులో ఇతనే భర్తగా ఉంటాడని తెలుస్తుంది. పెద్దయ్యాక వారి ప్రేమ బంధం అధికారికంగా మొదలవుతుంది. కానీ హెన్రీ కి ఉన్న టైమ్ ట్రావెల్ జబ్బు వారి వివాహ జీవితాన్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. హెన్రీ సడన్ గా మిస్ అవ్వడం, అనుకోకుండా ఊడిపడడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ, ఈ రిలేషన్ ను నిలబెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. చివరికి ఒక హార్ట్ టచింగ్ ట్విస్ట్ తో మూవీకి ఎండ్ కార్డ్ పడుతుంది. మరి ఆ ట్విస్ట్ ఏంటి? హీరోకి ఉన్న వింత జబ్బు తగ్గిందా లేదా? అనేదే ఈ మూవీ స్టోరీ.
Read Also : అబ్బాయిలని చూడగానే ఆ పార్ట్ సైజ్ చెప్పే టెక్నాలజీ… ఇలాంటి మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా
రెండు ఓటీటీలలో అందుబాటులో…
‘ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్’ (In the time traveler’s wife) అనే ఈ అమెరికన్ టైమ్ ట్రావెల్ మూవీకి రాబర్ట్ ష్వెంట్కే దర్శకత్వం వహించారు, ఎరిక్ బానా, రాచెల్ మెక్‌అడమ్స్, రాన్ లివింగ్‌స్టన్, హేలీ మెక్‌కాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2009 ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.