OTT Movie : కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు, ఇలా జరిగితే ఎంత బాగుంటుంది అనుకుంటాము. స్టోరీలో అంతలా లీనం అవుతాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సైన్స్ ఫిక్షన్ మూవీ ఒక డిఫ్ఫరెంట్ స్టోరీ తో వచ్చింది. ఇక్కడ సమయాన్ని డబ్బుతో కొంటారు. ఈ సినిమా మిమ్మల్ని మరో ప్రపంచం లోకి తీసుకెళ్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జియో హాట్ స్టార్ (Jio HotStar) లో
ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ పేరు ‘ఇన్ టైమ్’ (In Time). 2011 లో వచ్చిన ఈ మూవీకి ఆండ్రూ నికోల్ దర్శకత్వం వహించారు. జస్టిన్ టింబర్‌లేక్, అమండా సెయ్‌ఫ్రైడ్ ప్రధాన పాత్రలు పోషించారు. సిలియన్ మర్ఫీ, విన్సెంట్ కార్తీజర్, ఒలివియా వైల్డ్, మాట్ బోమర్ సహాయక పాత్రల్లో నటించారు. ఇందులో ప్రతి వ్యక్తి వారి చేతిపై గడియారాన్ని పెట్టు కుంటారు. అది వారు ఎంతకాలం జీవిస్తారో చూపిస్తుంది. దీని స్టోరీ భవిష్యత్తులో జరుగుతుంది. అక్కడ సమయం అనేది డబ్బు స్థానంలో ఉపయోగించబడుతుంది. ఈ మూవీ అక్టోబర్ 28, 2011న విడుదలైంది. $40 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ $174 మిలియన్లు వసూలు చేసింది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ (Jio HotStar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఇందులో ప్రజలకు 25 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత వారికి వయసు పెరగదు. వృద్ధాప్యం రాకుండా చనిపోయేంత వరకు యవ్వనంలోనే ఉంటారు. అయితే వారి చేతిపై ఒక డిజిటల్ గడియారం ఉంటుంది. అది వారి మిగిలిన జీవిత కాలాన్ని చూపిస్తుంది. ఈ సమయం భవిష్యత్తులో డబ్బులా ఉపయోగపడుతుంది. దానితో వస్తువులు కొనుగోలు చేయవచ్చు, జీవనం సాగించవచ్చు. ఒక కరెన్సీ లా సమయం ఉపయోగపడుతుంది. సమయం అయిపోతే, ఆ వ్యక్తి ‘టైమ్ అవుట్’ అయి చనిపోతాడు. ధనవంతులు దాదాపు సమయాన్ని డబ్బుతో కొని అమరత్వం పొందుతారు. కానీ పేదవారు ప్రతిరోజూ బతకడానికి సమయం కోసం కష్టపడాల్సి వస్తుంది. విల్ సాలస్ అనే పేద యువకుడు, ఒక ధనవంతుడి నుండి ఊహించని విధంగా చాలా సమయం పొందుతాడు.
అయితే అతను ఆ తరువాత హత్య ఆరోపణలో ఇరుక్కుంటాడు. అతను సిల్వియా వీస్ అనే ధనవంతురాలిని తీసుకుని పరారీలో ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు బాగా దగ్గర అవుతారు. వీరిద్దరూ కలిసి ఈ అన్యాయమైన వ్యవస్థను ఎదిరించడానికి పోరాడతారు. సమయాన్ని నియంత్రించే ‘టైమ్‌కీపర్స్’ అనే అధికారులు వారిని వెంబడిస్తారు. వాళ్ళతో పోరాడే సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. చివరికి వీళ్ళు చేసే పోరాటం ఎంత వరకూ వెళ్తుంది ? ధనవంతులకు,పేదలకు సమానమైన న్యాయాన్ని తీసుకొస్తారా ? టైమ్‌కీపర్స్ చేతిలో బంధీలు అవుతారా ? అనే ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : డబ్బులకోసం ప్రెగ్నెంట్ అయ్యే అమ్మాయి … ప్రతీకారం తీర్చుకునే నర్స్ … కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్