Nindu Noorella Saavasam Serial Today Episode : మనోమరి కోర్టు నుంచి వెళ్లిపోతుంటే రణవీర్ వస్తాడు. ఎక్కడికి వెళ్లిపోతున్నావు అని అడుగుతాడు. మనోహరి కోపంగా నీ వల్ల ఇవాళ అమర్‌కు దొరికిపోయేదాన్ని.. ఇలా ఇన్ని సార్లు రమ్మంటే నేన రాలేను. ఇక నేను రాను అని చెప్తుంది. దీంతో రణవీర్ కోపంగా మనోహరి నేను రమ్మని అడగడం లేదు. రమ్మని ఆర్డర్ వేస్తున్న.. లాయర్ నెక్ట్స్ హియరింగ్ డేట్ కనుక్కుని చెప్తాడు. బుద్దిగా కోర్టుకు వచ్చి జడ్జి ముందు నిలబడు పద లాయరు అంటూ రణవీర్ వెళ్లిపోతాడు. మనోహరి ఇరిటేటింగ్‌గా ఒకవైపు అమర్‌కు నా మీద అనుమానం మొదలైందని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో ఈ రణవీర్ గొడవేంటి నాకు అని మనోహరి వెళ్లబోతుంటే.. చిత్ర ఆపుతుంది. అమర్ నుంచి తప్పించుకోవడానికి నువ్వు అటు వెళితే అమరేంద్ర సతీమణికి దొరికిపోతావు అంటుంది.
దీంతో మనోహరి షాక్ అవుతుంది. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా.? భాగీ ఇక్కడకు వచ్చిందా..? అని అడుగుతుంది. దీంతో చిత్ర వచ్చింది. నువ్వు లోపల రణవీర్‌తో విడాకుల కోసం జడ్జి ముందు నిలబడినప్పుడు నేనే నిన్ను సేవ్ చేశాను అని చెప్తుంది. దీంతో మనోహరి భాగీ మమ్మల్ని కలిపి చూడలేదు కదా..? మా మీద ఏమీ అనుమానం రాలేదు కదా..? అని అడగ్గానే.. ఇప్పటి వరకైతే చూడలేదు.. అనుమానము రాలేదు. నిజం కూడా తెలియదు. కానీ నేను చెప్తే అన్ని జరిగిపోతాయి. చెప్పకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు అనుకుంటా అంటుంది చిత్ర. దీంతో మనోహరి కోపంగా చూస్తుంటుంది.
మరోవైపు కోర్టులోంచి బయటకు వెళ్తున్న రణవీర్‌ను మిస్సమ్మ చూస్తుంది. రణవీర్ కోర్టులో ఉన్నాడేంటి..? చిత్ర చెప్పింది మనోహరి గురించియేనా..? నా అనుమానం నిజమైతే మను ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు ముందు ఉంటుంది రా వెళ్దాం అంటూ కరుణను తీసుకుని ఫ్యామిలీ కోర్టు వైపు వెళ్తుంది. మిస్సమ్మ రావడం చూసిన చిత్ర మనోహరిని పక్కకు తీసుకెళ్తుంది. మిస్సమ్మ మొత్తం వెతికి ఎక్కడా కనిపించలేదే అనుకుంటుంది. ఇంతలో అమర్, రాథోడ్ వస్తారు. మిస్సమ్మను ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. చిత్ర ఇందాక మనోహరి కనిపించింది అని చెబితే చూద్దామని వచ్చాను అని చెప్తుంది. దీంతో అమర్ ఉదయం నాకు ఆశ్రమానికి వెళ్తున్నాను అని చెప్పింది. ఇందాకా కోర్టులో రణవీర్ కూడా కలిశాడు. అని అమర్ చెప్పగానే.. మిస్సమ్మ ఇద్దరనీ అనుమానిస్తుంది. అమర్ ఇంటికి వెళ్దాం పద అని మిస్సమ్మ, కరుణను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతారు. వాళ్లు వెళ్లడం చూసిన మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది.
మరోవైపు గార్డెన్‌లో వాటర్ పడుతున్న అనామిక దగ్గరకు శివరాం, నిర్మల వెళ్తారు. మా కోడలు అరుంధతి నీకు తెలుసా..? తను పరిచయం ఉందా నీకు అని అడుగుతాడు శివరాం. మా కోడలు ఏమైనా చెప్పమనీ నీకు చెప్పిందా అని నిర్మల అడుగుతుంది. దీంతో అనామిక మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్తుంది. మొన్న ఆకాష్‌కు అటాక్ వచ్చినప్పుడు కూడా నువ్వు మా కోడలిలా కంగారు పడ్డావు.. చనిపోయిన మా కోడలిలాగా నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు చెప్పమ్మా.. అంటాడు శివరాం. నువ్వు చూడ్డానికి కూడా మా కోడలి లాగానే ఉంటావు. చెప్పమ్మా నీకు మా కోడలికి సంబంధం ఏంటి అని నిర్మల అడుగుతుంది. దీంతో ఏం లేదు ఆంటీ అంటుంది అనామిక.
దీంతో శివరాం మరి నువ్వు తనలా ఎలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దీంతో అనామిక ఎమోషనల్‌గా ఫీలవుతూ అరుంధతి గారిని మీరు ఎంతలా మిస్ అవుతున్నారో మీ మాటల్లో విన్నాను. అందుకే అరుంధతిలా మాట్లాడితే పిల్లలు వాళ్ల అమ్మని మిస్ అవ్వరని అలా చేస్తున్నాను అని అనామిక చెప్పగానే.. శివరాం కోపంగా వాళ్ల బాధ తీర్చమని నీకు ఎవరైనా చెప్పారా..? లేకపోతే ఆరుంధతిలా మాట్లాడితే వాళ్ల బాధ పోతుందని ఎవరైనా చెప్పారా..? అని అడుగుతాడు. ఎవరూ చెప్పలేదండి అని అనామిక చెప్పగానే మరి నీ అంతటా నువ్వే పిల్లల విషయంలో అలా ఎలా నిర్ణయం తీసుకుంటావమ్మా అంటాడు. నిర్మల కూడా కోపంగా నువ్వు ప్రతిసారి ఇలా వాళ్ల అమ్మలా మాట్లాడుతుంటే పిల్లలు ఎంత బాధ పడతారో ఆలోచించావా..? అని అడుగుతుంది. దీంతో ఇంకోసారి అలా మాట్లాడతని అనామిక చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మిస్సమ్మ, అమర్ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు అనామిక ప్లాన్ చేస్తుంది. ప్లాన్ ప్రకారం పాలల్లో మందు కలిపి అమర్‌కు ఇవ్వాలనుకుంటుంది. అప్పటికే అమర్ పాలు తాగి వెళ్లిపోతాడు. ఆ పాలు మిస్సమ్మ తాగుతుంది. దీంతో అనామిక కంగారు పడుతుంది. పాలు తాగిన మిస్సమ్మ మత్తుగా చూస్తూ.. తిక్క తిక్కగా మాట్లాడుతుంది. అమర్ దగ్గరకు వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని కిస్ ఇచ్చి ఐలవ్యూ చెప్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?