Chandrababu Govt: సీఎం చంద్రబాబు రూటు మార్చారు. నేతలు, కేడర్‌లో అసంతృప్తులకు చోటు ఇవ్వకుండా ఏడాదిలోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఈసారి మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్ల బిల్లు రానుంది. ఈ నేపథ్యంలో అవన్నీ గమనించిన ముఖ్యమంత్రి పక్కాగా స్కెచ్ వేసినట్టు ఆ పార్టీ నేతల మాట.
ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. తాజాగా వ్యవసాయ మార్కెట్‌లో కీలకమైన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ పదవులను ఖరారు చేసింది. 66 కమిటీలకు నూతన ఛైర్మన్లను నియమించింది. ఈ పదవుల ద్వారా వివిధ వర్గాలకు చెందిన మహిళలకు పెద్దఎత్తున అవకాశం కల్పించింది.
ఛైర్మన్ పదవుల నియామకాల్లో రాజకీయ సమతుల్యత, సామాజిక న్యాయాన్ని పాటించింది. 66 ఏఎంసీలలో ఛైర్మన్ పదవుల్లో టీడీపీ-52, జనసేన-10, బీజేపీకి నాలుగు పదవులు కేటాయించింది. ఎప్పటిమాదిరిగానే ఛైర్మన్ పదవుల్లో సామాజిక న్యాయాన్ని పాటించారు సీఎం చంద్రబాబు. వివిధ వర్గాలకు చెందిన మహిళలకు అవకాశం ఇచ్చారు.
బీసీ వర్గానికి-17, ఎస్సీలకు-10, ఎస్టీలకు-5, మైనారిటీలకు- 5 ఛైర్మన్ల పదవులను కేటాయించారు. సమాజంలోని అన్నివర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఇచ్చారు. ఈ నియామకాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 66 ఛైర్మన్ పదవుల్లో 35 చోట్ల మహిళలకు దక్కాయి. మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు మహిళలు కీలకపాత్ర పోషించనున్నారు.
ALSO READ: పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు.. వైసీపీకి లాభమా, నష్టమా?
వీటి ద్వారా మహిళలు నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. రైతులు పండించిన ఉత్పత్తులకు సరైన ధరలు కల్పించడం, మార్కెట్ వ్యవస్థను నియంత్రించడం, రైతులకు-వ్యాపారులకు మధ్య వారధిగా వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్లు ఉంటాయి. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం కానుంది. మహిళలకు ఈ స్థాయిలో పదవులు దక్కడానికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.
ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగానే గమనించిన సీఎం చంద్రబాబు, మహిళలకు పెద్ద పీఠ వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మహిళలకు ఛైర్మన్ల పదవులు ఇవ్వడం ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి అడుగులు వేసిందని అంటున్నారు.
ఏపీలో మరో దఫా నామినేటెడ్ పదవుల భర్తీ
66 అగ్రీకల్చర్ మార్కెట్ కమిటీలు ఖరారు
జనసేన నుంచి 9, బీజేపీ నుంచి 4 ఛైర్మన్ లుగా అవకాశం
66 ఛైర్మన్ పదవుల్లో 17 మంది బీసీలకు, 10 మంది ఎస్సీలకు, 5 మంది ఎస్టీలకు, 5 మంది మైనార్టీలకు చోటు
66 మార్కెట్ కమిటీ ఛైర్మన్లలో 35 చోట్ల మహిళలకు ఛాన్స్ pic.twitter.com/fJBDM2aOf3
— BIG TV Breaking News (@bigtvtelugu) July 17, 2025