E-Paper
Advertisement

OTT Movie : 65 ఏళ్ల అమ్మమ్మకు మళ్ళీ పెళ్లి… గిలిగింతలు పెట్టే మోహన్ లాల్ మలయాళ కామెడీ మూవీ

OTT Movie : 65 ఏళ్ల అమ్మమ్మకు మళ్ళీ పెళ్లి… గిలిగింతలు పెట్టే మోహన్ లాల్ మలయాళ కామెడీ మూవీ
Advertisement

OTT Movie : మోహన్‌లాల్ నటించిన ఒక మలయాళం సినిమా తెలుగు డబ్బింగ్‌తో రీసెంట్ గా ఓటీటీలో విడుదలైంది. ఒక ఫ్యామిలీ కామెడీ-డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్‌లాల్, KPAC లలిత కెమిస్ట్రీ, ఇంటర్వెల్ ట్విస్ట్ హైలైట్ గా ఉంటాయి. ఈ సినిమా స్టోరీ కున్నంకులం, త్రిస్సూర్‌లో నడుస్తుంది. ఈ మూవీ పేరు ? ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే వివరాల్లోకి వెళితే …

ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్

Advertisement

ఈ మలయాళ కామెడీ-డ్రామా సినిమా పేరు ‘ఇట్టిమాణి : మేడ్ ఇన్ చైనా’ (Ittymaani: Made in China). 2019లో విడుదలైన ఈ సినిమాకి జిబి-జోజు దర్శకత్వం వహింహారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ (ఇట్టిమాని), రాధిక సరత్‌కుమార్ (అన్నమ్మ), KPAC లలిత (తెయ్యమ్మ), హనీ రోజ్ (జెస్సీ) ప్రధాన పాత్రల్లో నటించారు. కైలాస్ మీనన్, దీపక్ దేవ్ దీనికి సంగీతం అందించారు. సినిమా 2019 సెప్టెంబర్ 6న థియేటర్లలో, 2019 అక్టోబర్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో, 2025 జూలై 24న ఈటీవీ విన్‌లో తెలుగు డబ్బింగ్‌తో విడుదలైంది. IMDbలో ఈ సినిమాకి 4.3/10 రేటింగ్ ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఇట్టిమాణి (మోహన్‌లాల్) చైనాలో జన్మించి, 10 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చిన వ్యక్తి. అతని తండ్రి ఇట్టి మాతన్ (మోహన్‌లాల్ ద్విపాత్రలో) చైనాలో నకిలీ ఉత్పత్తుల వ్యాపారం నడిపిన ఒక మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఇట్టిమాణి కూడా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ, కున్నంకులంలో నకిలీ చైనీస్ ఉత్పత్తులు అమ్ముతూ జీవిస్తాడు. అతను ఒక చైనీస్ రెస్టారెంట్, క్యాటరింగ్ సర్వీస్, అంబులెన్స్ వ్యాపారం నడుపుతాడు. కానీ అతని ప్రధాన ఆదాయం నకిలీ వస్తువుల నుంచే వస్తుంది. ఇట్టిమాణి డబ్బు సంపాదించే ప్రతి లావాదేవీలో కమిషన్ తీసుకుంటాడు. తన తల్లి తెయ్యమ్మ (కె.పి.ఎ.సి. లలిత) ఆసుపత్రిలో చేరినప్పుడు కూడా కమీషన్ కి కక్కుర్తి పడతాడు.

ఇక ఇట్టిమాణికి లండన్‌లో డాక్టర్‌గా ఉన్న జెస్సీ (హనీ రోజ్)తో వివాహం ఖాయమవుతుంది. అయితే మ్యాచ్‌మేకర్ పౌలినోస్‌తో కమిషన్ విషయంలో గొడవ పడి, జెస్సీ సోదరుడు జోజీతో వివాదం పెట్టుకుని, ఇట్టిమాణి ఈ వివాహాన్ని రద్దు చేసుకుంటాడు. ఇక స్టోరీ అన్నమ్మ (రాధిక సరత్‌కుమార్) అనే 65 ఏళ్ళ వితంతువుతో మలుపు తిరుగుతుంది. ఆమె ముగ్గురు పిల్లలు, ఆమెను పట్టించుకోకుండా విడిచిపెడతారు. అన్నమ్మ ఆస్పత్రిలో చేరడంతో ఇట్టిమాని ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. అన్నమ్మ తనకంటే చిన్న వయసు వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఇది ఊరిలో దుమారం రేపుతోంది.

ఈ ట్విస్ట్ ఇంటర్వెల్ వరకు సినిమాను ఆసక్తికరంగా మారుస్తుంది. కానీ అన్నమ్మ పిల్లలు తమ తల్లిని ఆస్పత్రిలో విడిచి పిక్నిక్‌కి వెళతారు. ఇది వారి నీచమైన స్వభావాన్ని చూపిస్తుంది. ఇట్టిమాని తన తల్లి తెయ్యమ్మతో అన్నమ్మకు సపోర్ట్ చేస్తూ, పెద్దలను గౌరవించాలనే ఒక సందేశాన్ని ఇస్తాడు. చివరికి 65 ఏళ్ళ వయసులో అన్నమ్మ పెళ్ళి చేసుకోవడానికి కారణం ఏమిటి ? ఇట్టిమాణికి పెళ్ళి అవుతుందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఈ రెంటుకొచ్చిన ఆటగాడి టార్గెట్ ఇంటి ఓనరే… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ

Related News

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఎక్కడ ?ఎప్పుడంటే?

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

Big Stories

Advertisement
×