BigTV English

Shreyas Iyer : సర్పంచ్ సాబ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. పంజాబ్ కార్లపై అయ్యర్ ఫోటోలు

Shreyas Iyer : సర్పంచ్ సాబ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. పంజాబ్ కార్లపై అయ్యర్ ఫోటోలు

Shreyas Iyer : టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది కోల్ కతా నైట్ రైడర్స్ కి టైటిల్ అందించినటువంటి శ్రేయాస్ అయ్యర్ ఎందుకో ఏమో ఈ ఏడాది మాత్రం పంజాబ్ కింగ్స్ జట్టుకి ఎంపికయ్యాడు. దీంతో అతను పంజాబ్ ని ఫైనల్ కి చేర్చాడు. పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం తనదైన శైలిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు.. బెంగళూరు పై 6 పరుగులు తేడాతో ఓడిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గెలిచినప్పటికీ.. శ్రేయాస్ అయ్యర్ మాత్రం ప్రేక్షకుల మనస్సు గెలిచాడు. ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ డైహార్ట్ ఫ్యాన్ తన కారు పై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, అర్స్ దీప్, ఓనర్ ప్రీతి జింటా ఫొటోలను ముద్రించాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Also Read : Brett Lee: టీమిండియా కోసం రంగంలోకి బ్రెట్ లీ.. భారీ ప్యాకేజీ ?

పంజాబీల హృదయాల్లో సర్పంచ్ సాబ్..


అతను పంజాబ్ కింగ్స్ కి అభిమాని మాత్రమే కాదు.. ఓ సర్పంచ్ కూడా. పంజాబీల హృదయాల్లో సర్పంచ్ సాబ్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి పంజాబ్ కింగ్స్ ఫైనల్లో ఓటమి చెందినప్పటికీ.. ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలతో అందరినీ ఆకట్టుకున్నాడు. తన అద్భుతమైన కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్ ని పదేళ్ల తరువాత ఫైనల్ కి చేర్చాడు. మరోవైపు వ్యక్తిగత ప్రదర్శన పరంగా అయ్యర్ మాత్రం దుమ్ములేపాడు. దీంతో అయ్యర్ కి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో రివార్డు కూడా లభించింది. మరోవైపు టీమిండియ వైట్ బాల్ కెప్టెన్సీ రేసులో శ్రేయాస్ అయ్యర్ ఉన్నట్టు సమాచారం. గత కొంత కాలంగా వన్డేలకే పరిమితం అయిన అయ్యర్ భారత టీ-20లకు పునరాగమనం చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం వన్డే మ్యాచ్ లు మాత్రమే టీమిండియా తరపున ఆడుతున్నాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో తన అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో అయ్యర్ టీ-20 సెటప్ లోకి కూడా అవకాశం ఉంది. అయ్యర్ ఇప్పుడు వైస్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం భారత జట్టు టీ-20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉండగా.. రోహిత్ శర్మ వన్డే జట్టుకి నాయకత్వం వహిస్తున్నాడు. టెస్ట్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ ఇటీవలే నియమితులయ్యాడు. మూడు ఫార్మాట్లకి వేర్వేరు కెప్టెన్లను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే టీ-20, టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ త్వరలోనే వన్డేలకు సైతం వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకునే అవకాశముంది. ఈ తరుణంలో శ్రేయాస్ అయ్యర్ కి కెప్టెన్సీ పదవీ దక్కే అవకాశం ఉందని ఊహగానాలు వినిపించడం విశేషం.

Related News

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

IND Vs PAK : టీమిండియాతో మ్యాచ్‌..సైకాల‌జిస్ట్ ను రంగంలోకి దించుతోన్న పాక్‌

Big Stories

×