Jailer 2 OTT:కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జైలర్ 2. జైలర్ సినిమా సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 15వ తేదీన దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజినీకాంత్ కెరియర్ లోనే కోలీవుడ్ సినీ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా కూడా ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు సుమారుగా రూ.750 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా విడుదలయ్యి రెండు వారాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ తమిళనాడులోని కొన్ని థియేటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లు లభిస్తుండడం గమనార్హం.
ఒకవైపు థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్ లతో దూసుకుపోతుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 12 నుండి ఈ సినిమా ఓటీటీలోకి రానుందని సమాచారం. ముఖ్యంగా తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర బృందం లేదా అమెజాన్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓటీటీ వెర్షన్లో ఏకంగా 30 నిమిషాల అదనపు ఫుటేజ్ ఉండనుంది అని సమాచారం. ఆ 30 నిమిషాలు సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్ళుతుందని, ముఖ్యంగా ఓటీటీ లో ఆడియన్స్ ను అలరించడం కోసమే ఈ 30 నిమిషాల సన్నివేశాన్ని మేకర్స్ దాచి ఉంచారు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి శివరాజ్ కుమార్, మోహన్ లాల్ , హృతిక్ రోషన్ లకు సంబంధించి కొన్ని అదనపు సన్నివేశాలను ఓటీటీ వెర్షన్ లో జోడించినట్లు సమాచారం. మరి ఈ అదనపు ఫుటేజ్ తో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చే ఈ సినిమా ఇక్కడి ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకొని ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
also read:రోహిత్ ఎలిమినేట్ అంటూ వార్తలు.. నెట్టింట రచ్చపై కౌశిక్ స్ట్రాంగ్ కౌంటర్!
జైలర్ 2 సినిమా విషయానికి వస్తే.. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, విద్యాబాలన్, మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, యోగిబాబు, మిర్నా మీనన్, రిత్విక్, మేఘన రాజ్ , సూరజ్ వెంజరమూడు ఇలా భారీ తారాగణం ఇందులో భాగమైంది. పైగా ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించారు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్లో ప్రైమ్ వీడియో సుమారుగా రూ.160 కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇటు ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.