BigTV English

OTT Movie: రేప్ కేసులో సీఎం, ప్రభుత్వాన్ని ఇరికించే లాయర్.. తప్పు బాధితురాలిదా? విడుదలైన గంటలోనే ఓటీటీలో సంచలనం

OTT Movie: రేప్ కేసులో సీఎం, ప్రభుత్వాన్ని ఇరికించే లాయర్.. తప్పు బాధితురాలిదా? విడుదలైన గంటలోనే ఓటీటీలో సంచలనం

OTT Movie: జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ.. చాలా ఏళ్ల తర్వాత అనుపమా పరమేశ్వరణ్ నటించిన ఈ మలయాళీ మూవీ ఎన్నో వివాదాల్లో చిక్కుకుని.. థియేటర్లో అతి కష్టం మీద విడుదలైంది. మొత్తానికి ఈ వివాదాస్పద మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం విడుదలకు ముందు సెన్సార్ బోర్డు (CBFC) జానకి అనే పేరు.. హిందూ దేవత సీతను సూచిస్తులన్నట్లుగా ఉందని, లైంగిక వేధింపుల బాధితురాలి పాత్రకు ఈ పేరు సరైనది కాదని CBFC అభ్యంతరం వ్యక్తం చేసింది. మొదట 96 కట్స్ సూచించినప్పటికీ, చివరకు రెండు మార్పులను సూచించింది. జానకి విద్యాధరన్ ఆ మూవీ టైటిల్‌ను జానకి V వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా మార్చాలని, కోర్టులో క్రాస్-ఎగ్జామినేషన్ సన్నివేశంలో జానకి పేరును మ్యూట్ చేయాలని పేర్కొంది. నిర్మాతలు ఈ మార్పులకు అంగీకరించడంతో సినిమా విడుదలైంది.


కథ ఏమిటంటే?

జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఆమె లైఫ్ హ్యాపీగా సాగుతుంది. ఆఫీసులోనే తన టీమ్ లీడర్‌ వెంకట్‌తో ప్రేమలో పడుతుంది. ఒక రోజు తమ గ్రామంలో తిరునాళ్లు చూసేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తుంది. అక్కడ ఒక జ్యూస్ షాప్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి జ్యూస్ తాగుతుంది. అక్కడివాళ్లు ఆమెను అసభ్యకరంగా చూడటంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఫ్రెండ్స్‌ను బస్సు ఎక్కించిన తర్వాత.. ఆమె తన ఫోన్ ఎక్కడో మిస్ అయినట్లు తెలుసుకుంటుంది. తన ఫోన్ జ్యూస్ షాప్‌లోనే ఉండి ఉండవచ్చని మళ్లీ అక్కడికి వెళ్తుంది. ఆ తర్వాత ఆమె అత్యాచారానికి గురవ్వుతుంది.


కానీ, ఆమెను బలత్కరించింది ఎవరో తెలీదు. ఈ విషయాన్ని ఆమె తన తండ్రి(మాధవ్ సురేష్)కి చెబుతుంది. దీంతో ఆమె తండ్రి కోర్టుకు వెళ్తాడు. అక్కడ పేరొందిన న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) కలిసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, అప్పటికే అక్కడ అబెల్ వాదిస్తున్న ఓ నన్ కేసుకు సంబంధించి ఆందోళనలు జరుగుతుంటాయి. దీంతో కోర్టు వద్ద భారీ సంఖ్యలో తొక్కిసలాట జరుగుతుంది. ఆ క్రమంలో జానకి తండ్రి.. కానిస్టేబుల్ కాలు తగిలి కిందపడిపోతాడు. తొక్కిసలాటలో చనిపోతాడు. దీంతో జానకి మరింత కుంగిపోతుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుంటుంది.

ఇక్కడి నుంచే అసలు కథ మొదలు

జానకి తండ్రి కలవాలనుకున్న లాయర్ అబెల్ డోనోవన్.. ఆమెకు వ్యతిరేకంగా వాదిస్తాడు. నిందితుడైన రాజకీయ నాయకుడు తరపున వాదిస్తాడు. ఈ క్రమంలో జానకీకి వ్యతిరేకంగా కొన్ని ఆధారాలు బయటపెడతాడు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ వల్ల గర్భవతి అయ్యిందని, ఆ విషయం తండ్రికి తెలిస్తే తిడతాడని తెలిసి.. అత్యాచారం డ్రామాకు తెరతీసిందని వాదిస్తాడు. అందుకు ఆధారాలు కూడా సేకరించి కోర్టు ముందు ఉంచుతాడు. అలాగే, తాను జ్యూస్ షాప్‌లో ఫోన్ మరిచిపోయిందని, అది తీసుకెళ్లడానికి వెళ్లినప్పుడే అత్యాచారం జరిగిందని చెప్పడం కూడా అబద్దమని తెలుపుతాడు.

ఈ సందర్భంగా జ్యూస్ షాప్‌లోని సీసీటీవీ కెమేరాలో రికార్డైన ఫూటేజ్‌ను బయటపెడతాడు. దీంతో జానకీ దగ్గర ఆధారాలే లేకుండా పోతాయి. జానకీ అసలు బాధితురాలా, కాదా? అనే సందేహాలు నెలకొంటాయి. అసలు ఆమెను అత్యాచారం చేసింది ఎవరు? చివరికి ఏమవుతుంది? అసలు ఈ కేసుతో ప్రభుత్వానికి సంబంధం ఏమిటీ? తదితర విషయాలు తెలియాలంటే.. తప్పకుండా బుల్లితెరపై ఈ మూవీని చూడండి. అనుపమా పరమేశ్వరణ్, సురేష్ గోపీ తమ పాత్రల్లో జీవించారు. ఈ మూవీ ప్రస్తుతం ZEE5, OTTplay ప్రీమియంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగులోనూ ఉంది. ఈ మూవీకి గిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది.

Also Read: Shilpa Shetty: నా కిడ్నీ తీసుకోండి ప్రభూ.. శిల్పాశెట్టి భర్త షాకింగ్ నిర్ణయం, ఆమె ఒత్తిడే కారణమా?

Related News

OTT Movie : అమ్మాయిల్ని ఆ పని కోసమే పుట్టించే ఆణిముత్యం… లాభం లేదు ఒంటరిగా చూడాల్సిందే భయ్యా

OTT Movie : చంపి, శవాలపై U గుర్తు చెక్కే సీరియల్ కిల్లర్… ఒక్కో కేసులో ఒక్కో ట్విస్ట్… థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : మనిషి లోపల మకాం పెట్టే చిట్టి ఏలియన్స్… భూమిని తుడిచి పెట్టే ప్లాన్ తో రంగంలోకి.

OTT Movie : చావు అంచులదాకా వెళ్లే హీరో… అపరిచితుల ఎంట్రీతో అల్టిమేట్ ట్విస్ట్… కడుపుబ్బా నవ్వించే మలయాళ కామెడీ

Sir Madam OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సార్ మేడమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

×