E-Paper
Advertisement

జాబ్ లేదు, లవ్ లేదు… ఫ్రెండ్షిప్ తో హార్ట్ ను టచ్ చేసే రోడ్ ట్రిప్

జాబ్ లేదు, లవ్ లేదు… ఫ్రెండ్షిప్ తో హార్ట్ ను టచ్ చేసే రోడ్ ట్రిప్
Advertisement

Feel Good Move: ఓటీటీలో ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాను చూడాలని అనుకుంటున్నారా ? అయితే ఈ మూవీ మీ కోసమే. చూసిన ప్రతి ఒక్కరికీ తమ ఫస్ట్ లవ్ ను గుర్తు చేసేలా ఉంటుంది ఈ మూవీ. ఓన్లీ ప్రేమికులు మాత్రమే కాదు ఫ్రెండ్ కూడా ఏదో ఒక సందర్భంలో ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. లైఫ్ లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే జాబ్ లెస్ బాధలు, లైఫ్ లో సెటిల్ అవ్వడానికి పడే కష్టాలను హార్ట్ టచింగ్ గా చూపించారు. పైగా ఈ మూవీ తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా పేరు ‘జయముంది భయమేల మనసా’ (Jayamundhi Bhayamela Manasaa). మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

2017 నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమా. ముగ్గురు చిన్ననాటి స్నేహితుల జీవితాలు, లైఫ్ గురించి వారి భయాలు, ఒత్తిళ్లు, స్నేహం ద్వారా వచ్చే సెల్ఫ్-డిస్కవరీ చుట్టూ తిరుగుతుంది. ఇది కేవలం ఒక రోడ్ ట్రిప్ కాదు… జీవితంలో భయాన్ని జయించి, కొత్త ఆశలతో ముందుకు సాగడం ఎలాగో చూపించే హార్ట్ టచింగ్ కథ. వరుణ్ (భరణ్ దండమూడి) బీటెక్ పూర్తి చేసి, ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని కలలు కంటాడు. కానీ ఉద్యోగం లేకపోవడంతో ఇంట్లో ప్రతిరోజూ అవమానాలు, తండ్రితో తిట్లు తింటూ ఉంటాడు. ఇక కిరణ్ (రవి మహాదాస్యం) ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ అయ్యి తీవ్ర డిప్రెషన్‌లో ఉంటాడు. సురేష్ (రాజేష్ ఖన్నా) వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసిక ఒత్తిడిలో కుమిలిపోతాడు.

Advertisement

ముగ్గురూ తమ జీవితాల్లోని ఈ ఒత్తిళ్లు, భయాలు తట్టుకోలేక ఒక క్రేజీ నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్ నుండి ముంబై వరకు సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతారు. 800 కిలోమీటర్ల రోడ్ ట్రిప్ ను ప్లాన్ చేస్తారు. అయితే అందరిలో కారులోనో, బైక్ లోనో కాకుండా సైకిళ్లపై ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఈ లాంగ్ జర్నీలో వారు ఊహించని ఎన్నో గందరగోళ పరిస్థితులు, సరదా సంఘటనలు, అనుకోని సవాళ్లను ఎదుర్కొంటారు. రోడ్డు మీద జరిగే సంభాషణలు, పంచుకున్న జ్ఞాపకాలు, కలిసి ఎదుర్కొన్న కష్టాలు వాళ్ళలో పేరుకుపోయిన భయాలను, సందేహాలను నెమ్మదిగా కరిగిస్తాయి.

ఈ ట్రిప్ వారిని కేవలం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మాత్రమే కాకుండా, తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు, సంతోషాలు చోటు చేసుకుంటాయి. ఈ జర్నీలో ఏదేమైనా ధైర్యంగా ముందుకు సాగాలని వాళ్ళు ఎలా తెలుసుకున్నారు అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ముఖ్యంగా బాధ్యలో, ఫెయిల్యూర్ తో బాధ పడుతున్న వారికి ఈ సినిమా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Advertisement

భరణ్ దండమూడి, శరణ్య శర్మ, రవి మహాదాస్యం, రాజేష్ ఖన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. కల్యాణ్ నాయక్ సంగీతం అందించారు. ‘జయముంది భయమేల మనసా’ ETV Winలో అందుబాటులో ఉంది. ఈటీవీ విన్ లో నేరుగా ఓటీటీ రిలీజ్ అయిన స్వచ్ఛమైన తెలుగు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ డ్రామా. రంజిత్ పాశం దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: కళ్ల ముందే గ్యాంగ్‌స్టర్‌తో భార్య బాగోతం… ఈ కొరియన్ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×