E-Paper
Advertisement

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఒక్కసారిగా మారిన వాతావరణం, తెలంగాణకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఒక్కసారిగా మారిన వాతావరణం, తెలంగాణకు భారీ వర్ష సూచన
Advertisement

Telangana Rains: వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడింది. రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

దేశవ్యాప్తంగా రుతుపవనాలు జోరు.. బంగాళాఖాతంలో అల్పపీడనం

Advertisement

దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. మహారాష్ట్రలో వానలు దంచి కొడుతున్నాయి. శనివారం భారతమంతా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఓ వైపు అల్పపీడనం, దేశంలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో సౌరాష్ట్రలో 57 సెం.మీ.ల అసాధారణ భారీ వర్షపాతం నమోదైంది.

పశ్చిమ మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర-కచ్, కొంకణ్, మధ్య మహారాష్ట్రలలో 21 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి-కారైకల్, కేరళ, కర్ణాటక, ఒడిశాలో 12 నుంచి 20 సెంటీమీటర్లు భారీ వర్షపాతం నమోదు అయ్యింది.  ఇటు దక్షిణాదిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శుక్రవారం నుంచి ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. తెలంగాణకు భారీ వర్ష సూచన

శనివారం సాయంత్రం నుంచి వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండి అంచనా వేసింది.

అందులోని కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.  పరిస్థితుల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, అండర్‌పాస్‌ల మూసివేత కారణంగా ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశముందని తెలిపింది.

ALSO READ: దేశానికే ఆదర్శంగా సీఎం రేవంత్ నియోజకవర్గం..!

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక హైదరాబాద్ సిటీ విషయానికి వద్దాం. హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి.

మధ్య ఉత్తర హైదరాబాద్ మేడ్చల్, దుండిగల్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, బాచుపల్లి, నిజాంపేట, పటాన్‌చెరు, ఆర్సీ పురం, అమీన్‌పూర్, జీడిమెట్ల పరిసర ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు పడుతున్నాయి.

Related News

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

బైకుపై పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. కేబీఆర్ పార్క్ వన్‌వే ట్రాఫిక్ పరిశీలన

నిజామాబాద్ కాంగ్రెస్‌లో హైటెన్షన్.. పోచారంని సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్!

తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు

రూపారెడ్డి మర్డర్ కేస్‌లో ఊహించని ట్విస్ట్.. విద్యార్థులే నిందితులా?

టిమ్స్ ఆస్పత్రి వివాదం.. మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్!

మీరు వస్తానంటే మేము వద్దంటామా? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు BRS ఓపెన్ ఆఫర్!

Big Stories

Advertisement
×