Amardeep -Tejaswini: బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటుడు అమర్ దీప్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తెలుగు టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న ఎన్నో సక్సెస్ఫుల్ సీరియల్స్లలో అమర్ నటించారు. ఆయన నటించిన ప్రతి సీరియల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంది. సీరియల్స్ తో స్టార్ ఇమేజ్ ని అందుకున్న అమర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత సినిమాల పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. వరుస ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం అమర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. కెరియర్ పరంగా దూసుకుపోతున్న అమర్ తన భార్యతో గొడవలు జరుగుతున్నాయని విడాకులు తీసుకుపోతున్నారంటూ వార్తలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా మరోసారి ఈ వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు నిజమేంటో ఒకసారి తెలుసుకుందాం..
అమర్ – తేజు ల మధ్య గొడవలు..?
బుల్లితెర నటుడు అమర్, సీరియల్ హీరోయిన్ తేజస్విని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్నారు. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లో పాల్గొంటున్నారు. ఇకపోతే ఇటీవలే ఈ షో గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదలైంది.. ఇందులో అమర్ తేజు జోడిగా వచ్చారు. ఆ షో లో భాగంగా వాళ్ళిద్దరి గురించి చెప్తూ తేజు మాకు గొడవలు జరుగుతున్నాయని చెప్పింది. అయితే కొంతకాలంగా వారి మధ్య బాండింగ్ సరిగా లేదని గొడవలు పడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయాలు పై తాజాగా ఇష్యూలో క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా వార్తలు మాత్రం ఆగడం లేదు. ఈ వార్తలు మరోసారి ఊపందుకోవడానికి కారణం తేజనే.. అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం..
Also Read :హీరోయిన్లు అందుకే వ్యభిచారం చేస్తున్నారు.. అక్కడ కూడా కమిట్మెంట్ ఇవ్వాలిసిందే..
నిజాన్ని బయటపెట్టిన తేజా..
తాజాగా తన భర్తతో గొడవలంటూ వస్తున్న వార్తలు పై తాజాగా తేజ్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. గొడవలు నిజమేనని మొదట ఒప్పేసుకుంది. అందరూ ఇళ్లలో ఈ విధంగా అయితే ఉంటుందో మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. అందరి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్టే మా ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. అందరూ భార్యాభర్తల్లాగే గొడవ పడడం మళ్ళీ కలవడం మాకు అలవాటే. ఎంత గొడవ పడినా కూడా ఒక్కరోజులోనే మళ్లీ కలిసిపోతాం. మీ ఇంట్లో జరిగేదే మా ఇంట్లో కూడా జరుగుతుంది అంతకుమించి ఏమీ లేదు అంటూ ఎమోషనల్ అయింది తేజస్విని. అయితే వీళ్ళిద్దరి మధ్య విడిపోయేంత గొడవలు అయితే లేవు కాని మామూలుగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తుంది. మరి విడాకులు అంటూ వస్తున్న వార్తలు పై తేజ ఎలా స్పందిస్తుందో చూడాలి.