BigTV English

OTT Movie : ఐడియా ఇచ్చిన శవం… పరుగులు పెట్టించే డబ్బు… పొట్ట చెక్కలయ్యే కామెడీ

OTT Movie : ఐడియా ఇచ్చిన శవం… పరుగులు పెట్టించే డబ్బు… పొట్ట చెక్కలయ్యే కామెడీ

OTT Movie : కామెడీ ఎంటర్టైనర్ లో తెరకెక్కిన ఒక తమిళ్ మూవీ, ఓటీటీలో మంచి వ్యూస్ తెచ్చుకుంది. ఈ మూవీలో ప్రభుదేవా శవం పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. చివరివరకూ సరదాగా సాగిపోయే ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

మేఘనపురంలో నివసించే ఒక కుటుంబం బిర్యానీ హోటల్‌ను నడుపుతుంటుంది. అక్కడ కొత్త బైపాస్ రోడ్ పడటంతో, వాళ్ళకి వచ్చే కస్టమర్లు తగ్గిపోతారు. ఈ హోటల్ ని నడపడానికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఈ కుటుంబంలో హోటల్ నడిపే చెల్లమ్మకు ముగ్గురు కుమార్తెలు భవానీ, యజ్ఞానీ, శివానీ ఉంటారు. వాళ్ళు రాకెట్ రవి అనే స్థానిక వ్యక్తి నుండి డబ్బు అప్పు తీసుకుంటారు. అతడు కూడా ఎక్కువ వడ్డీకి అప్పు ఇస్తుంటాడు. మరొవైపు ఒక చిన్న గోడవలో చెల్లమ్మ తండ్రి హాస్పిటల్ లో చేరుతాడు. ఈ సంఘటనల నేపథ్యంలో, ఇంటి పెద్దకూతురు భవానీ తన కుటుంబ ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడే స్టోరీ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఒక రోజు వీళ్ళు ఒక శవాన్ని (ప్రభుదేవా) చూస్తారు. న్యాయవాది పూంగుండ్రన్‌ ను ఎవరో హత్య చేసి ఉంటారు. అతని గురించి తెలుసుకుని, ఆ శవాన్ని అడ్డుపెట్టుకుని  డబ్బు సంపాదించాలని అనుకుంటారు. నిజానికి ఈ న్యాయవాది ఎమ్మెల్యే అడైకలరాజ్‌పై కేసు వేసి ఉంటాడు. అతడు 28 కుటుంబాలను మోసం చేసి, వారి సంతకాలతో మెడికల్ ఇన్సూరెన్స్ డబ్బులు స్వాహా చేసిఉంటాడు. ఇతని పై కొంతమంది ఆరోపణలు చేస్తారు. అయినప్పటికీ అడైకలరాజ్ ఈ ఆరోపణల నుండి తప్పించుకుంటాడు.


పూంగుండ్రన్, అడైకలరాజ్ ఓటర్ల కోసం పంపిణీ చేయడానికి వచ్చిన ₹10 కోట్లను అడ్డుకుని, కొడైకెనాల్‌లోని UBC బ్యాంకులో ఉంచుతాడు. అడైకలరాజ్ కోపంతో, పూంగుండ్రన్‌ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌ను నియమిస్తాడు. అయితే ఆ కిల్లర్ పూంగుండ్రన్‌ను చంపి, ఆ డబ్బును కొట్టేయాలని చూస్తాడు. ఇక ఈ శవం చుట్టూ స్టోరీ అల్లుకుంటుంది. భవానీ, ఆమె కుటుంబం ఈ శవాన్ని ఉపయోగించి ₹10 కోట్లను సంపాదించడానికి ప్రయత్నిస్తారు. వారు ఈ డబ్బును పొందడానికి అడైకలరాజ్, అతని అనుచరులను తెలివిగా మోసం చేస్తారు. చివరికి భవానీ కుటుంబం ఆ డబ్బును కొట్టేస్తుందా ? అడైకలరాజ్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి? భవానీ ఫ్యామిలికి ఆర్థిక కష్టాలు తీరుతాయా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఉద్యోగం పాయే, గర్ల్ ఫ్రెండూ పాయే … ఓ ఐడియా మాత్రం వీడి జీవితాన్నే మార్చేసింది

ఆహా (Aha) లో

ఈ తమిళ కామెడీ మూవీ పేరు ‘జాలీ ఓ జిమ్‌ఖానా’ (Jolly O Gymhana).  2024 లో విడుదలైన ఈ మూవీకి సక్తి చిదంబరం దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రభుదేవా ఒక శవం పాత్రలో నటించగా, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో అభిరామి, యోగి బాబు, రెడిన్ కింగ్స్‌లీ, రోబో శంకర్, జాన్ విజయ్, యశికా ఆనంద్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ తెలుగు డబ్బింగ్‌లో కూడా విడుదలైంది. ఆహా (Aha) ప్లాట్‌ ఫామ్‌లో 2025 మే 15 నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×