OTT Movie : బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక క్రేజీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, లవ్ స్టోరీ తో కూడా అదరగొట్టింది. ఈ స్టోరీ ఒక మధ్య తరగతి యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగం వదిలి, బిజినెస్ లోకి దిగడంతో స్టోరీ మలుపు తీసుకుంటుంది. చివరి వరకు ఈ సినిమా ఆసక్తికరంగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
స్టోరీలోకి వెళితే
గౌరవ్ శుక్లా అనే 28 ఏళ్ల మధ్యతరగతి యువకుడు, తన కార్పొరేట్ ఉద్యోగంతో విసిగిపోయి ఉంటాడు. అతని జీవితం తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ శరద్ మల్హోత్రా, హార్దిక్ వాఘేలాతో సమయం గడపడం, తన చిన్నప్పటి క్రష్ దేవికాను ప్రేమలో పడేయటానికి సరిపోతూ ఉంటుంది. ఇతనికి ఒక అర్జున్ కపూర్ అనే విరోధి కూడా ఉంటాడు. అర్జున్ ఒక జీవితంలో ఉన్నతస్థాయిలో ఉంటాడు. ఒక రోజు ఉద్యోగంతో విసిగిపోయిన ఇతనికి బాగా కోపం వస్తుంది. అందరి మీద కేకలు వేయడంతో, ఉద్యోగం నుండి గౌరవ్ ని తొలగిస్తారు. ఈ సంఘటన అతని జీవితంలో ఒక మలుపు తెస్తుంది. సమాజం, కుటుంబం నుండి వచ్చే ఒత్తిడిని ఎదుర్కొంటూ, గౌరవ్ ఒక కొత్త స్టార్టప్ ఐడియాతో ముందుకు వస్తాడు. ‘మాస్ మ్యాజిక్’ అనే హోమ్ కుక్డ్ ఫుడ్ డెలివరీ సర్వీస్ ను ప్రారంభిస్తాడు.
ఇది ఆఫీస్ లో పని చేసే బ్యాచిలర్స్ కోసం, గృహిణులు తయారు చేసిన వంటకాలను అందిస్తుంది. దేవికా, అతని స్నేహితుల సహాయంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు గౌరవ్. అయితే కొద్ది రోజుల్లోనే వ్యాపారంలో పోటీ, ఆర్థిక సమస్యల కారణంగా, ఈ స్టార్టప్ డీలా పడుతుంది. గౌరవ్ మళ్లీ నిరుద్యోగిగా మారతాడు. ఈ సమయంలో, గౌరవ్ తల్లి తన ప్రావిడెంట్ ఫండ్ ను ఇచ్చి వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించమని ప్రోత్సహిస్తుంది. గౌరవ్ తన వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభిస్తాడు. చివరికి గౌరవ్ వ్యాపారంలో సక్సెస్ అవుతాడా ? దేవికాను తన ప్రేమలో పడేస్తాడా ? నిరుద్యోగిగా మారుతాడా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : చిన్న పిల్లకు మాత్రమే కన్పించే పిల్ల పిశాచి… ఫ్రెండ్షిప్ చేయాలన్పించే దెయ్యం
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ మూవీ పేరు ‘మ్సే నా హో పాయేగా’ (Tumse Na Ho payega). 2023 లో వచ్చిన ఈ మూవీకి అభిషేక్ సిన్హా దర్శకత్వం వహించారు. ఈ సినిమా వరుణ్ అగర్వాల్ రాసిన ‘How I Braved Anu Aunty and Co-Founded a Million Dollar Company’అనే నవల ఆధారంగా రూపొందింది. ఇందులో ఇష్వాక్ సింగ్, మహిమా మక్వానా, గౌరవ్ పాండే, గుర్ప్రీత్ సైని, కరణ్ జోత్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.