BigTV English

OTT Movie : ఆడకూడని ఆటలాడి ప్రాణాల మీదకు… చూస్తున్న కొద్దీ మజా ఇచ్చే అద్భుతమైన జంగిల్ అడ్వెంచర్

OTT Movie : ఆడకూడని ఆటలాడి ప్రాణాల మీదకు… చూస్తున్న కొద్దీ మజా ఇచ్చే అద్భుతమైన జంగిల్ అడ్వెంచర్

OTT Movie : ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫారెస్ట్ అడ్వెంచర్ పైనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ దృష్టి ఉంది. జక్కన్న మూవీని ఇప్పట్లో చూడలేము. ఎందుకంటే ఇంకా ఈ మూవీ షూటింగ్ దశలోనే ఉంది. కానీ అదే జానర్ లో తెరకెక్కిన ఓ అద్భుతమైన బాలీవుడ్ మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘జుమాంజి’ (jumanji) మూవీ 1995లో రిలీజ్ అయ్యింది. 1981లో క్రిస్ వాన్ ఆల్స్‌బర్గ్ రాసిన పిల్లల పుస్తకం ఆధారంగా, జో జాన్స్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక అమెరికన్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ఇది. ఈ చిత్రంలో రాబిన్ విలియమ్స్, కిర్‌స్టెన్ డన్‌స్ట్, బ్రాడ్లీ పియర్స్, బోనీ హంట్, జోనాథన్ హైడ్, బెబె న్యూవిర్త్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక బోర్డ్ గేమ్ చుట్టూ తిరిగే ఈ కథ, ప్రతి ఆటగాడి కదలికతో జంగిల్‌కు సంబంధించిన ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మూవీ ప్రేక్షకులను ఒక ఉత్కంఠభరితమైన సాహసంలోకి తీసుకెళ్తుంది. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరంతే. $65 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 1995 డిసెంబర్ 15న విడుదలై $262.8 మిలియన్ల బాక్స్ ఆఫీస్ వసూళ్లను సాధించడం విశేషం. కాగా ‘జుమాంజి’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)తో పాటు నెట్ ఫ్లిక్స్ (Netflix) లో కూడా ఉంది.

కథలోకి వెళ్తే…
1969లో అలాన్ పారిష్ అనే అబ్బాయి సీక్రెట్ బోర్డ్ గేమ్ “జుమాంజి”ని కనిపెడతాడు. తన స్నేహితురాలు సారాతో కలిసి ఆడటం మొదలు పెడతాడు. గేమ్‌లో అలాన్ ఒక పాచిక వేసినప్పుడు, అతను గేమ్‌లోని జంగిల్ ప్రపంచంలో చిక్కుకుంటాడు. సారా భయంతో పారిపోతుంది. 26 సంవత్సరాల తర్వాత, 1995లో జూడీ, పీటర్ అనే ఇద్దరు పిల్లలు తమ అత్త ఇంట్లో ఈ జుమాంజి గేమ్‌ను చూసి ఆడటం మొదలుపెట్టగానే, గేమ్ నుండి వింత జంతువులు, ప్రమాదాలు బయటకు వస్తాయి. ఉదాహరణకు సింహాలు, ఏనుగులు, భారీ దోమలు. ఆటలో ఒక డైస్ వేసినప్పుడు అలాన్ (రాబిన్ విలియమ్స్) జంగిల్ నుండి విడుదలవుతాడు ఇప్పుడు అతను ఒక పెద్దవాడు అవుతాడు.


Read also : ఫ్లర్ట్ చేసి అక్కాచెల్లెళ్లకు చుక్కలు చూపించే కేటుగాడు… ఇలాంటి వాడిని నమ్మితే నరకమే అమ్మాయిలూ

అలాన్, జూడీ, పీటర్, సారా కలిసి గేమ్‌ను పూర్తి చేయాలని నిర్ణయిస్తారు. ఎందుకంటే ఆటను ఆపడం వల్ల ప్రపంచం అంతా నాశనమైపోతుంది. గేమ్‌లో డైస్ వేసినప్పుడల్లా కొత్త ప్రమాదాలు వస్తాయి. వరదలు, వానరాల దాడులు, వాన్ పెల్ట్ అనే వేటగాడు అలాన్‌ను చంపడానికి వెంబడిస్తాడు. అయితే ఈ నలుగురు ఒకరినొకరు కాపాడుకుంటూ గేమ్‌ను గెలవడానికి కష్టపడతారు. మరి అన్ని ప్రమాదాలను అసలు ఈ నలుగురు ఎలా ఎదుర్కొన్నారు? చివరికి గేమ్ ను ఎలా పూర్తి చేశారు? అనేది సీన్ సీన్ కో ట్విస్ట్ తో అదిరిపోతుంది.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×