E-Paper
Advertisement

అండర్ కవర్ ముసుగులో ఇదేం పని? డేంజరస్ ఆపరేషన్స్ తో పాటు డార్క్ కామెడీ ఉన్న సిరీస్

అండర్ కవర్ ముసుగులో ఇదేం పని? డేంజరస్ ఆపరేషన్స్ తో పాటు డార్క్ కామెడీ ఉన్న సిరీస్
Advertisement

Spy Thriller Series: స్పై థ్రిల్లర్లలో ఉండే యాక్షన్, స్టంట్స్ ఐ ఫీస్ట్ లా ఉంటాయి యాక్షన్ మూవీ లవర్స్ కి. ఇక వాళ్ళు చేసే సీక్రెట్ ఆపరేషన్స్ ఎంత క్రేజీగా ఉంటాయో. వాటికోసమైనా ఇలాంటి సినిమాలను చూడాలని అన్పిస్తుంది. మీకు కూడా అలాగే అన్పిస్తుందా ? అయితే ఈ సిరీస్ సజెషన్ మీ కోసమే. ‘Patriot’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ అమెరికన్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ 2015లోనే ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకోవాలంటే, అంతకంటే ముందు స్టోరీలోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ స్టోరీ అంతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కథ చుట్టూ సాగుతుంది. సీరియస్ పొలిటికల్ డ్రామా, నవ్వు తెప్పించే సీరియస్ సిట్యుయేషన్స్ ఉన్న డార్క్ హ్యూమర్ కలయికతో ఈ సిరీస్ నడుస్తుంది. జాన్ తావ్నర్ (Michael Dorman) అనే వ్యక్తి అమాయకంగా కన్పించే ఇంటెలిజెన్స్ అధికారి. ఇరాన్ దేశం అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే అతని టార్గెట్. అందులో భాగంగా ఈ సీక్రెట్ మిషన్ కోసం జాన్ తన అసలు గుర్తింపును దాచి పెట్టి, ఒక మిడ్-వెస్ట్రన్ ఇండస్ట్రియల్ పైపింగ్ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా చేరతాడు.

Advertisement

ఆ ఉద్యోగంలో ఎంతగా జీవిస్తాడు అంటే… ఎవరికీ అనుమానం రావొద్దని, ఆ కంపెనీ ఉద్యోగిగా విదేశాలకు కూడా ప్రయాణాలు చేస్తాడు కానీ, ఒకవైపు ఆఫీసులో సాధారణ ఉద్యోగిగా పనులు చేయడం, మరోవైపు అత్యంత ప్రమాదకరమైన దేశ రహస్యాల మిషన్ ను నిర్వహించడం అన్నది అతనికి నరకంగా అన్పిస్తుంది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక అతను తన బాధలను జానపద పాటల రూపంలో పాడుకుంటూ రిలీఫ్ అవుతాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది.

ప్రభుత్వ నిబంధనలు, అధికారుల పొరపాట్లు, ఆఫీస్ మేనేజర్ పెట్టే టార్గెట్లు జాన్ చేస్తున్న మిషన్‌ను మరింత కష్టంగా మారుస్తాయి. జాన్ తన మెంటల్ పీస్ ను కాపాడుకుంటూ, ఈ గ్లోబల్ మిషన్‌ను ఎలా పూర్తి చేశాడు ? అనేదే ఈ సిరీస్ కథ. ఇది అమెజాన్ ఒరిజినల్ సిరీస్ కాబట్టి, దీనిని ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోతో Amazon Prime Video లో చూడవచ్చు.ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో తెలుగు సబ్‌టైటిల్స్ తో కూడా అందుబాటులో ఉంది. ఇంగ్షీషులో చూడడం కష్టం అనుకుంటే ఈ ఆప్షన్ లో మూవీని వీక్షించవచ్చు. ఇక ఈ సిరీస్ మొత్తం 2 సీజన్లు, 18 ఎపిసోడ్‌లు ఉంటుంది.

Advertisement

ఇక ఇదే టైటిల్ తో ఈ ఏడాది మలయాళంలో ఓ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా స్పై యాక్షన్ థ్రిల్లరే. మమ్ముట్టి, మోహన్‌లాల్‌ కలిసి నటించిన ఈ ‘పేట్రియాట్‌’ మూవీ 2026 మే 22న విడుదల కాగా, జూన్ 5 నుంచి Zee 5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : లవర్స్ ను రిస్క్ లో పడేసే కరువు రక్కసి… కడుపుబ్బా నవ్వించే యోగి బాబు కొత్త సిరీస్

Related News

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

ఓటీటీలోకి మమిత బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

17 ఏళ్ల తర్వాత కిల్లర్ కి విడుదల… అమాయకులను ఇరికించే లాయర్లను వేటాడే కిల్లర్… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

మనుషుల్ని వేటాడే కోటీశ్వరులు… వేటలో చిక్కుకున్న అమ్మాయే వేటగాళ్లను వేటాడితే ? బ్లడీ సర్వైవల్ థ్రిల్లర్

బిగ్ బాస్ తరహాలో మరో రియాలిటీ షో.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×