E-Paper
Advertisement

ఇల్లరికం అల్లుడి కష్టాలు… కూతురిని ముట్టుకొనివ్వని పట్టుకొనివ్వని తల్లి దెయ్యం… మస్ట్ వాచ్ మలయాళం మూవీ

ఇల్లరికం అల్లుడి కష్టాలు… కూతురిని ముట్టుకొనివ్వని పట్టుకొనివ్వని తల్లి దెయ్యం… మస్ట్ వాచ్ మలయాళం మూవీ
Advertisement

Malayalam Horror Comedy: పెళ్లి చేసుకుని భార్య ఇంట్లోకి వెళ్లిన ఓ అల్లుడికి అక్కడ అసలు సమస్య ఏంటో మొదట అర్థం కాదు. భార్య తనను ప్రేమిస్తుంది. కానీ ఆమె చనిపోయిన తల్లి మాత్రం తన అల్లుడిని అస్సలు అంగీకరించదు. కనిపించదు… కానీ ఇంట్లో ఆమె ఉనికి మాత్రం ప్రతి క్షణం తెలుస్తూనే ఉంటుంది. బెడ్‌ రూమ్‌ లోకి వెళ్లినా అడ్డంకే. భార్యతో మాట్లాడినా ఇబ్బందే. చివరకు ఆత్మను ఒప్పించడానికి అల్లుడు పడే పాట్లు కామెడీగా మారతాయి. భార్యాభర్తలను కలవనీయకుండా దెయ్యం చేసే ఆ గందరగోళమే ‘హలో మమ్మీ’ (Hello Mummy). ఈ మలయాళం మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? ఫ్యామిలీతో చూడొచ్చా ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

బోనీ సరదా మనస్తత్వం ఉన్న యువకుడు. పెళ్లిపై పెద్దగా ఆసక్తి ఉండదు అతనికి. కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉంటారు. చివరకు అతను స్టెఫీని కలుస్తాడు. మొదట ఇద్దరి మధ్య పెద్దగా ఆసక్తి లేకపోయినా, పరిచయం పెరిగే కొద్దీ ప్రేమగా మారుతుంది. స్టెఫీని పెళ్లి చేసుకోవడానికి బోనీ సిద్ధమవుతాడు. అయితే ఆమె ఓ షరతు పెడుతుంది. పెళ్లి తర్వాత బోనీ ఆమె ఇంట్లోనే ఉండాలి. భార్య కోసం ఆ షరతును ఒప్పుకున్న బోనీ అక్కడికి వెళ్లిన తర్వాత అసలు సమస్యను ఎదుర్కొంటాడు.

Advertisement

స్టెఫీ తల్లి గ్రేస్ అప్పటికే చనిపోయి ఉంటుంది. కానీ ఆమె ఆత్మ మాత్రం ఇంటిని వదిలి పెట్టలేదు. అంతేకాదు బోనీని ఆమె అస్సలు ఇష్టపడదు. మొదట బోనీకి ఇవన్నీ నమ్మశక్యంగా అనిపించవు. కానీ పెళ్లి తర్వాత తన కళ్ల ముందే జరిగే వింతలు అతని అభిప్రాయాన్ని మార్చేస్తాయి. బోనీ, స్టెఫీ కలిసి ఉండాలని ప్రయత్నించిన ప్రతిసారి గ్రేస్ ఆత్మ అడ్డుకుంటుంది. ఇంట్లో కొన్ని కఠినమైన నియమాలు కూడా ఆమె ఉనికితో ముడిపడి ఉంటాయి. బోనీకి తన భార్యతో సాధారణంగా మాట్లాడటం కూడా కష్టమవుతుంది. చివరకు వాళ్లు ఆత్మకు తెలియకుండా మెసేజ్‌ ల ద్వారా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది.

బోనీ పరిస్థితిని మార్చేందుకు గ్రేస్‌ ను మెప్పించాలని ప్రయత్నిస్తాడు. ఒక దశలో స్టెఫీ గర్భవతి అని అబద్ధం చెప్పడంతో ఆత్మను తమ వైపు తిప్పుకోవాలని చూస్తారు. కానీ ఆ ప్లాన్ మరింత గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. ఇదే సమయంలో బాస్ అనే జర్నలిస్ట్ స్టెఫీ కుటుంబం గురించి ఎవ్వరికీ తెలియని ఓ రహస్యం ఉందని బోనీకి హెచ్చరిస్తాడు. ఆత్మను తొలగిస్తానని చెప్పే ఆషాభ కూడా కథలోకి ఎంట్రీ ఇస్తాడు. కానీ అతని ఉద్దేశాలు అనుకున్నంత మంచివి కావని బోనీకి తర్వాత తెలుస్తుంది. చివరకు బోనీ, స్టెఫీ, గ్రేస్ ఆత్మ మధ్య ఉన్న సమస్య ఓ పెద్ద సంఘర్షణకు దారితీస్తుంది. కుటుంబాన్ని కాపాడటానికి బోనీ చేసే ప్రయత్నాలు కామెడీగా సాగుతూనే, చివర్లో భావోద్వేగంగా మారతాయి. మరి ఇంతకీ హీరోయిన్ ఫ్యామిలీ సీక్రెట్ ఏంటి ? చివరికి హీరో తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు ? ఆ దెయ్యం అత్త కూతురిని కలవనిచ్చిందా లేదా ? అన్నదే కథ.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?

Advertisement

షరఫుద్దీన్ (Sharafudheen), ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi), జానీ ఆంటోనీ (Johny Antony), జగదీష్ (Jagadish) ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మలయాళ హారర్ కామెడీకి వైశాఖ్ ఎలాన్స్ (Vaishakh Elans) దర్శకత్వం వహించారు. Amazon Prime Videoలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో లేదు గానీ, మలయాళం ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి.

Read Also: కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

Related News

స్కూల్లో స్టూడెంట్ రౌడీ వేషాలు… టీచర్ ఇచ్చే ట్విస్టుకు పట్టపగలే చుక్కలు… కొరియన్ టీచరా మజాకా

కోడి చుట్టూ తిరిగే కథ… చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించడం కష్టం… తెలుగులోనే స్ట్రీమింగ్

‘కాఫీవిత్ కరణ్’ షోకు ఎండ్ కార్డ్… కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్!

తండ్రిపై కోపంతో రింగ్‌లోకి దిగిన కుర్రాడు… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్

ఒకే కుటుంబంలో వరుస హత్యలు… కోట్ల ఆస్తి కోసం భయంకరమైన కుట్ర… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

నిజ జీవిత పోరాటానికి జాతీయ అవార్డు… 13 ఏళ్లుగా ఓటీటీ కోసం ఎదురుచూసిన మూవీకి మోక్షం… 8.2 రేటింగ్‌తో ఇప్పుడు స్ట్రీమింగ్

ఏకంగా 6 పెళ్ళిళ్ళు… అతన్ని పెళ్లి చేసుకున్న మహిళలంతా చనిపోతారు… ట్విస్టులతో మతిపోగొట్టే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×