IND vs ENG Test Series : మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు.. అందరూ టెస్టుల వైపు మల్లె పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐదు టెస్టుల సిరీస్. మరో రెండు రోజుల్లోనే… ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. జట్లను కూడా ఫైనల్ చేశారు.
గిల్ సారాధ్యంలో టీమిండియా
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి వారందరూ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాళ్లు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో… టీమిండియా కు కొత్త కెప్టెన్ వచ్చేసాడు. గుజరాత్ జట్టును లీడ్ చేస్తున్న గిల్ కు కెప్టెన్సీ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ నేపథ్యంలోనే జిల్ సారధ్యంలో ఇంగ్లాండ్ వెళ్ళింది టీం ఇండియా. అటు వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ బరిలోకి దిగబోతున్నాడు. బుమ్రాకు ఈసారి అవకాశం ఇవ్వలేదు. అతని ఫిట్నెస్ నేపథ్యంలో… బుమ్రా కు అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఉచితంగా ఎలా చూడాలి
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే… ఈ మ్యాచ్ లో నేపథ్యంలో.. అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ టెస్ట్ సిరీస్ డిడి స్పోర్ట్స్ లో మనం ఉచితంగా చూడవచ్చు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. అలాగే ott లేదా ఛానల్ సబ్స్క్రిప్షన్ లేకుండా… ఈ డిడి స్పోర్ట్స్ లో ఉచితంగానే మనం చూడవచ్చు. సాధారణంగా విదేశాలలో జరిగే మ్యాచ్లు డిడి స్పోర్ట్స్ లో ప్రసారం కావు. కానీ బీసీసీఐ ఈ విషయంలో… ఒక మెట్టు దిగి ప్రసారాలకు అంగీకారం తెలిపింది. జియో హాట్ స్టార్ అలాగే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐదు మ్యాచ్ లు వస్తాయి.
Also Read: Maxwell: 13 సిక్సర్లతో మ్యాక్స్‌వెల్ భయంకరమైన సెంచరీ.. వాడో మోసగాడు అంటూ ప్రీతి జింటా ఫైర్ !
మ్యాచ్ టైమింగ్స్
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Ind Vs Eng )మధ్య జరగబోయే ఐదు టెస్టుల సిరీస్.. భారత కాలమానం ప్రకారం ఉదయం ప్రారంభం కాదు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్లు ప్రారంభమవుతాయి. అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి.
టెస్ట్ సిరీస్ వివరాలు
టెస్ట్ 1: జూన్ 20-24, 2025, లీడ్స్‌లోని హెడింగ్లీలో
టెస్ట్ 2: జూలై 2-6, 2025, బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో
టెస్ట్ 3: జూలై 10-14, 2025, లండన్‌లోని లార్డ్స్‌లో
టెస్ట్ 4: జూలై 23-27, 2025, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో
టెస్ట్ 5: జూలై 31- ఆగస్టు 4, 2025, లండన్‌లోని ది ఓవల్‌లో