E-Paper
Advertisement

Annagaru Vostaru OTT : ‘అన్నగారు వస్తారు’ స్ట్రీమింగ్ షురూ… ఓటీటీ తీరుపై తెలుగు ఆడియన్స్ అసంతృప్తి

Annagaru Vostaru OTT : ‘అన్నగారు వస్తారు’ స్ట్రీమింగ్ షురూ… ఓటీటీ తీరుపై తెలుగు ఆడియన్స్ అసంతృప్తి
Advertisement

Annagaru Vostaru OTT : కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అన్నగారు వస్తారు’ ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీ కెరీర్‌లోనే అత్యంత తక్కువ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా ‘అన్నగారు వస్తారు’ నిలిచింది. దాదాపు 40 కోట్ల​ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పట్టుమని పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. సంక్రాంతి బరిలో వచ్చినా కూడా ఈ సినిమా తీవ్రంగా నిరాశపరచింది. ఇక ఇది ఇలా ఉంటే, మరో వివాదంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ సంగతి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు సమస్య ఏమిటంటే

జనవరి 14న థియేటర్లలో విడుదలైన (వా వాతియార్), కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. దీనిని తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ థియేటర్ల దాక వెల్లకుండానే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా, తెలుగు ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా మొదలయ్యాయి. తమిళ వెర్షన్ దివంగత నటుడు MGR ని హైలైట్ చేస్తుండగా, తెలుగు వెర్షన్ పూర్తిగా NTR గారిని హైలెట్ చేస్తున్నట్లు చూపించారు.

Advertisement

అయితే ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు తెరపై MGR చూపిస్తూ, డైలాగ్‌లు మాత్రం NTR గురించి చెబుతున్నట్లు ఉంటుంది. దీంతో తెలుగు ఆడియన్స్ అసంతృపి వ్యక్తం చేస్తున్నారు. అడపా దడపా ఇలా డబ్బింగ్ చెప్పి కేవలం డబ్బుకోసం ఇలా రిలీజ్ చేయకుండా, ప్రేక్షకుల మనోభావాలను కూడా దెబ్బ తీయకుండా కొంచెం శ్రద్ధ తీసుకుంటే మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

కథ ఏమిటంటే

రాజ్‌ కిరణ్‌ అనే ఒక పెద్దాయన తమిళ నటుడు ఎంజీఆర్‌కు వీరాభిమాని. అతనికి మనవడు పుట్టడంతో చాలా సంతోషపడతాడు. అదే రోజు ఎంజీఆర్‌ చనిపోవడంతో అతనిలో ఎంజీఆర్‌ ని చూసుకోవడం మొదలు పెడతాడు ఆ పెద్దాయన. ఆ బిడ్డకు రామేశ్వరన్‌ అనే పేరు కూడా పెడతాడు. ఎంజీఆర్‌ లాగా నిజాయతీగా పెరిగి, తన మనవడు కూడా గొప్పవాడు కావాలని కలలు కంటాడు. ఇక రామేశ్వరన్‌ పెద్ద అయ్యాక పోలీసు కూడా అవుతాడు. అయితే రామేశ్వరన్‌ మాత్రం తన తాత ఆశయాలకు విరుద్దంగా పెరుగుతాడు. లంచాలు తీసుకుంటూ విలాసంగా బతకడానికి ఇష్టపడతాడు. ఒక రోజు రామేశ్వరన్‌ గురించి రాజ్‌ కిరణ్‌ కి తెలిసిపోతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేదే మిగతా కథ.

Advertisement

Read Also : పొరపాటున కాలంలో వెనక్కెళ్ళే కుర్రాడు… క్లాసిక్ టైమ్ ట్రావెల్ మూవీ… అస్సలు మిస్ అవ్వొద్దు

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×