OTT Movie : లాక్‌డౌన్ సమయంలో తెరకెక్కిన ఒక బెంగాలీ సినిమా ఆడియన్స్ ని ఆలోచనలో పడేస్తోంది. ఒకే ఇంట్లో, ఒక మిడిల్ క్లాస్ హౌస్‌వైఫ్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఇది డొమెస్టిక్ అబ్యూస్, లోన్లీనెస్, జెండర్ పాలిటిక్స్‌ను సున్నితంగా చిత్రీకరించింది. విమర్శకులు స్వస్తికా నటన, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌ను ప్రశంసించారు. భర్త పెట్టే గృహ హింసకు, భార్య ఇచ్చే షాకింగ్ ట్విస్ట్ తో ఈ స్టోరీ కేక పెట్టిస్తుంది. కర్ర విరగదు, పాము చావదు అనే సామెత దీనికి కరెక్ట్ గా సరిపోతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
సర్మిష్ఠా ఒక గృహిణి. ఆమె భర్త ప్రదీప్ మానసికంగా హింసించే వ్యక్తి. లాక్‌డౌన్ కారణంగా ఇద్దరూ 24/7 ఇంటిలోనే ఉండాల్సి వస్తుంది. సర్మిష్ఠా రోజూ వంట చేస్తుంది, ఇల్లు శుభ్రం చేస్తుంది, ప్రదీప్ పెట్టే అవమానాలను సైలెంట్‌గా భరిస్తుంది. ప్రదీప్ ఆమెను చిన్న విషయాలకు తిడతాడు. అది ఆమె వంటలో ఉప్పు ఎక్కువైనా, లేదా ఆమె డ్రెస్ అతనికి నచ్చకపోయినా. సర్మిష్ఠా బయటికి చూస్తే ఒక డొసైల్ గృహిణిలా కనిపిస్తుంది. కానీ ఆమె కళ్లలో ఒక స్పార్క్, ఆమె మనసులో ఒక సీక్రెట్ దాగి ఉంది. ఇప్పుడు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. లాక్‌డౌన్ రోజులు సాగుతున్న కొద్దీ, ప్రదీప్ మానసిక హింస పెరుగుతుంది. అతను సర్మిష్ఠాను నియంత్రించడానికి ప్రయత్నిస్తాడు. ఆమెను బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వనివ్వడు.
కానీ సర్మిష్ఠా ఏదో ప్లాన్ చేస్తోందని మనకు కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఆమె రహస్యంగా ఒక డైరీ రాస్తుంది, ఫోన్‌లో ఎవరితోనో చాట్ చేస్తుంది. ప్రదీప్ టీ కప్పులో ఏదో కలపడం అనుమానాస్పదంగా కనిపిస్తాయి. ఇక్కడే కథ ఒక షాకింగ్ టర్న్ తీసుకుంటుంది. సర్మిష్ఠా ఒక సాధారణ గృహిణి కాదు. ఆమె తన జీవితంలో సంవత్సరాలుగా భరిస్తున్న గృహ హింస నుండి బయటపడాలని నిర్ణయించుకుంది. ఆమె రహస్యంగా ఒక ప్లాన్ వేస్తుంది, ఇది ప్రదీప్‌ను అతని సొంత ఆటలో ఓడించడానికి. ఆమె డైరీలో రాస్తున్నది తన బాధల రికార్డ్ మాత్రమే కాదు, అది ఒక స్ట్రాటజీ! ఆమె ప్రదీప్‌కు ఇచ్చే టీలో స్లో పాయిజన్ కలుపుతోంది. అతన్ని చంపకుండా బలహీనపరిచేందుకు. ఆమె లక్ష్యం అతన్ని ఫిజికల్‌గా, మానసికంగా కంట్రోల్ చేయడం, అతను ఆమెకు చేసినట్లే.
సర్మిష్ఠా రహస్యంగా ఒక సపోర్ట్ గ్రూప్‌తో కనెక్ట్ అవుతుంది. ఇది గృహ హింస బాధితులకు సహాయం చేస్తుంది. ఆమె ఫోన్ చాట్స్ ఈ గ్రూప్‌తోనే, వారు ఆమెకు తన స్వేచ్ఛ కోసం పోరాడేందుకు ధైర్యం ఇస్తారు. ఒక కీలక సన్నివేశంలో, ప్రదీప్ తన ఆరోగ్యం బలహీనపడుతున్నట్లు గ్రహిస్తాడు, సర్మిష్ఠా బిహేవియర్ అతనికి అనుమానం కలిగిస్తుంది. అతను ఆమెను కొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ సర్మిష్ఠా ఇప్పుడు భయపడే ఆడది కాదు. సర్మిష్ఠా తన ప్లాన్‌ను పూర్తి చేస్తుంది. ఆమె ప్రదీప్‌ను పూర్తిగా బలహీనపరుస్తుంది, అతన్ని ఇంట్లోనే ఒక రూమ్‌లో బంధిస్తుంది. అతను ఆమెను సంవత్సరాలుగా బంధించినట్లే. సర్మిష్ఠా ఇప్పుడు తన జీవితాన్ని తిరిగి సొంతం చేసుకుంటుంది.
‘తాసేర్ ఘవర్’ (Tasher ghawr)సుదీప్తో రాయ్ దర్శకత్వంలో వచ్చిన బెంగాలీ షార్ట్ ఫిల్మ్. ఇందులో స్వస్తికా ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించింది. జుధజిత్ సార్కార్ సపోర్టింగ్ రోల్‌లో ఉన్నాడు. 2020సెప్టెంబర్ 3 నుండి హోయ్‌చోయ్ (Hoichoi) ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బెంగాలీ భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇది 47 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 6.6/10 రేటింగ్ పొందింది.
Read Also : గ్రామంలో ఏ మహిళనూ వదలని దొర… పనోడితో దొర పెళ్ళాం… ఈ అరాచకం మాములుగా ఉండదు భయ్యా