Big Tv Kissik Talks: బిగ్ టీవీ (Big TV)ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో భాగంగా ఈ వారం బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ (Bigg Boss 7 Winner)రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్లవి ప్రశాంత్ తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి, ప్రస్తుతం తన కెరియర్ గురించి, వ్యవసాయం గురించి ఎన్నో విషయాలను తెలియ చేశారు. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష (Varsha) పల్లవి ప్రశాంత్ ను ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.
హీరోగా మారిన రైతుబిడ్డ…
బిగ్ బాస్ తరువాత కంటెస్టెంట్ లు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటారు. పల్లవి ప్రశాంత్ మాత్రం ఒక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమంలో తప్ప ఎక్కడ కనిపించలేదు. ఈ క్రమంలోనే వర్ష బిగ్ బాస్ తర్వాత పూర్తిగా కనపడకుండా వెళ్లిపోయావు ప్రశాంత్ అసలు ఏంటి సంగతి? మాకు తెలిసి త్వరలోనే వెండితెరపై కనిపించబోతున్నావు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు పల్లవి ప్రశాంత్ సమాధానం చెబుతూ.. అంతా దైవ నిర్ణయం అంటూ ఈయన సినిమాలలో నటించబోతున్నానని చెప్పకనే చెప్పేశారు..
రైతుగా నలుగురి ఆకలి తీర్చగలను…
పల్లవి ప్రశాంత్ కు హీరోగా సినిమా అవకాశం (Movie Chance)వచ్చిందని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు అయితే ఇలాంటి అవకాశం అందరి రైతులకు రాదని, ఇలాంటి అవకాశాలు రావాలి అంటే అదృష్టం కూడా ఉండాలని తెలియజేశారు. ప్రశాంత్ ఏ సినిమాలో నటిస్తున్నారు?దర్శకుడు ఎవరు? ఏంటి? అనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఇక వర్ష తదుపరి ప్రశ్న వేస్తూ రైతుగా ఆ జీవితం బాగుందా? లేక సెలబ్రిటీగా ఇలా బాగుందా? అంటూ మరో ప్రశ్న వేశారు అయితే వ్యవసాయం చేస్తూ రైతుగా బ్రతికితే నలుగురికి కడుపు నింపవచ్చు అలాగే సినిమా రంగంలో పనిచేస్తూ ఇద్దరికీ కడుపు నింపగలను నాకు రెండు సమానమే అంటూ పల్లవి ప్రశాంత్ తెలిపారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఒక సామాన్యమైన వ్యక్తిగా అడుగుపెట్టి తనని తాను నిరూపించుకుంటూ సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి విజేతగా బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ విజేతగా నిలిచిన ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలోనే సినిమా అవకాశం కూడా వచ్చిందని చెప్పాలి. ఇలా పల్లవి ప్రశాంత్ హీరోగా వెండి తెరపై కనిపించబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పల్లవి ప్రశాంత్ సినిమాలకు సంబంధించిన వివరాలు అధికారకంగా రాబోతున్నాయని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ హీరోగా కనిపించబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు ఏ సినిమాలో నటిస్తున్నారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపడమే కాకుండా అభినందనలు కూడా తెలియజేస్తున్నారు.
Also Read: Actor Vishal: హీరో విశాల్ ఇంట్లో పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న వీడియో!