Indian Railways: భారతీయ రైల్వేలోకి అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైలుగా అడుగు పెట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ప్రయాణీకులు మెరుగైన సేవలు అందిస్తోంది. వేగవంతమైన ప్రయాణం, అత్యాధునిక సౌకర్యాలు ప్రయాణ అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుతున్నాయి. అయితే, తాజాగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లో సాంకేతిక సమస్య తలెత్తి, అత్యవసరంగా నిలిపివేయడంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. కాసేపు కలవరపాటుకు గురయ్యారు. ఇంతకీ వందేభారత్ కు ఏమైంది? ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందంటే?
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైల్లో సమస్య!
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో లోకో పైలెట్లు నెల్లూరు రైల్వే స్టేషన్ లో అత్యవసరంగా నిలిపివేశారు. ఈ సమస్య కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఏసీలు, ఫ్యాన్లు పని చేయక ఉక్కపోతతో అవస్థలు ఎదుర్కొన్నారు.
ఉక్కపోతతో ప్రయాణీకులు ఉక్కరిబిక్కిరి!
రైల్లో తలెత్తిన సాంకేతిక సమ్య కారణంగా పలు కోచ్ లలో ఏసీలు, ఫ్యాన్లు పని చేయడం మానేశాయి. కొన్నింటిలో లైట్లు కూడా ఆరిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు సరైన వెంటిలేషన్ లేక ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు రైల్వే స్టేషన్ లో సుమారు అరగంటకు పైగా రైలు నిలిచి ఉండటంతో చాలా మంది ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
వెంటనే రంగంలోకి దిగిన టెక్నికల్ టీమ్
వందేభారత్ రైల్లో టెక్నికల్ సమస్యలు ఉన్నట్లు తెలియగానే రైల్వే టెక్నికల్ టీమ్ నెల్లూరు రైల్వే స్టేషన్ కు చేరుకుని మరమ్మలు చేపట్టారు. పూర్తయిన తర్వాత రైలు తిరుపతికి బయల్దేరింది. “హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైళ్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాటిని గుర్తించాం. టెక్నికల్ టీమ్ కొద్ది సమయంలోనే వాటిని సాల్వ్ చేసింది. మరమ్మతులు పూర్తి అయిన తర్వాత రైలు తిరుపతికి బయల్దేరి వెళ్లింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం” అని రైల్వే అధికారులు వెల్లడించారు.
గతంలోనూ ఓసారి ఇలాగే..
కొద్దికాలం క్రితం ఇదే మార్గంలో వందేభారత్ రైలులో సాంకేత సమస్య తలెత్తింది. దుండగులు వందే భారత్ రైలుపై రాళ్ళు రువ్వడం వల్ల అనేక కిటికీలు దెబ్బతిన్నాయి. వాటిని సరి చేసిన తర్వాతే రైలు ముందుకు కదిలింది. ఈ నేపథ్యంలో బయటి వ్యక్తుల కారణంగా, అంతర్గత సమస్యలతో వందేభారత్ రైళ్లు ఆగిపోవడం పట్ల రైల్వే నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకులు కూడా ఈ రూట్లోనే మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తడం పట్ల ఆశ్చర్యపోతున్నారు.
ప్రొటోకాల్ కచ్చితంగా పాటించాలన్న ఉన్నతాధికారులు
తాజాగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైల్వే సిబ్బంది కచ్చితంగా మెయింటెనెన్స్ ప్రోటోకాల్ ను అవలంభించాలన్నారు. ప్రయాణ సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలన్నారు. ప్రయాణీకుల భద్రతను ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడంతో పాటు అంతరాయాలను తగ్గించడం ప్రధాన ప్రాధాన్యతగా ఉంటాలన్నారు.
Read Also: విశాఖ – తిరుపతి డబుల్ డెక్కర్ రైలులో ఏసీ స్లీపర్ కోచ్లు.. ఈస్ట్ కోస్ట్ర్ రైల్వే కీలక నిర్ణయం, కానీ…