BigTV English

KA on OTT : దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న కిరణ్ అబ్బవరం మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

KA on OTT : దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న కిరణ్ అబ్బవరం మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

KA on OTT : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మూవీ ‘క’. ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ 2024 అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సుజిత్ అండ్ సందీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఇటీవలే ‘KA’ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.


KA స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ?

‘క’ మూవీ ప్రస్తుతం తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్’ (ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే… కథ ఒక ముసుగు ధరించిన వ్యక్తి తన మనుషులకు వాసుదేవ్, రాధను కిడ్నాప్ చేయమని ఆదేశించడంతో ప్రారంభమవుతుంది. వాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్న వాసుదేవ్‌ను చెప్పినట్టుగానే అతని దగ్గరకు తీసుకువస్తారు. ఇక హీరో ఒక చీకటి గదిలో టేబుల్ మీద ఒక వింత గడియారం సౌండ్ తో మేల్కొంటాడు. ముసుగు ధరించిన వ్యక్తి షేక్ అనే వ్యక్తికి సంబంధించిన లేఖ గురించి అతనిని ప్రశ్నిస్తాడు. వాసుదేవ్ తనకు దీని గురించి అసలేమీ తెలియదని చెప్తాడు. ఆ వ్యక్తి గడియారాన్ని, హిప్నోటిక్ పరికరాన్ని ఉపయోగిస్తూ నిజం తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. దీంతో వాసుదేవ్ గతం బయటపడుతుంది.


ఆ గతం ప్రకారం వాసుదేవ్ ఒక అనాథాశ్రమంలో పెరిగాడు. ఇతరుల ఉత్తరాలు చదవడానికి ఇష్టపడే వ్యామోహం అతన్ని కృష్ణగిరి అనే పర్వత గ్రామంలో పోస్ట్‌మ్యాన్‌గా మారేలా చేస్తుంది. ఇక హీరో తన యజమాని కుమార్తె సత్యభామను ప్రేమిస్తాడు. అయితే ఆ ఊర్లో అమ్మాయిలు కనిపించకుండా పోవడం మొదలవుతుంది. సత్య కూడా కనిపించకుండా పోవడంతో వాసుదేవ్ జోక్యం చేసుకుంటాడు. అందులో భాగంగా వాసుదేవ్ షాకింగ్ నిజాలను తెలుసుకుంటాడు. అసలు ఆ మాస్క్ మ్యాన్ ఎవరు? ఊర్లో అమ్మాయిల మిస్సింగ్ కు హీరోకి లింకు ఏంటి? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : బో*ల్డ్ సీన్స్ కావాలా నాయనా … ఈ సినిమాని చూడండయ్యా నిద్ర కూడా పట్టదు …

కాగా KAలో కిరణ్ అబ్బవరం , నయన్ సారిక, తన్వి రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుజిత్, సందీప్ దర్శకత్వం వహించారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం థియేటర్లలో రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి, కిరణ్ అబ్బవరం కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. నవంబర్ 28 నుంచి ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ అవార్డు విన్నింగ్ మూవీని ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×